Police Corruption: ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ కొల్లూరు ఎస్ఐ
Police Corruption (imagecredit:swetcha)
క్రైమ్, మెదక్

Police Corruption: ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ కొల్లూరు ఎస్ఐ రమేష్.. ఎంత డిమాండ్ చేశారంటే..?

Police Corruption: సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ రమేష్ ను అవినీతి నిరోధక శాఖ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్(DSP Sudharashan) ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన మెదక్(Medak) ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్‌–ఇన్‌స్పెక్టర్ ఎం. రమేష్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ ఛాంబర్‌లోనే ఫిర్యాదుదారుడి నుండి ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు దాడులు నిర్వహించి ఆయనను పట్టుకున్నారు.

25 వేల కు ఒప్పందం

విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో పి డి ఎస్ బియ్యం(PDS Rice) లారీ ని పట్టుకొని (నిత్యావసర వస్తువుల చట్టం) సెక్షన్ 7 మరియు భారత న్యాయ స్మృతి సెక్షన్ 318 (4) కింద నమోదైన క్రైం నంబర్ 508/2025 కేసులో ఫిర్యాదుదారుడి పేరును తొలగించేందుకు గాను సదరు అధికారి రమేష్ 30 వేలు లంచం డిమాండ్ చేయగా 25 వేల కు ఒప్పందం కుదుర్చుకునీ మొదట 5 వేలు ఇచ్చారు. మొదటగా ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన అధికారి, 17 డిసెంబర్ 2025 న మిగిలిన ఇరవై వేల రూపాయలను ఇవ్వమని ఒత్తిడి చేయడంతో ఫిర్యాదుదారుడు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు. ముందస్తు ప్రణాళికతో దాడులు నిర్వహించిన అధికారులు, పోలీస్ స్టేషన్ ఛాంబర్‌లోనే లంచం తీసుకుంటున్న సమయంలో సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న ఇరవై వేల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Shivaji Controversy: హీరోయిన్ దుస్తుల వివాదంపై సుమన్ చెప్పింది ఇదే.. వారు ఏం చేసేవారంటే?

లంచం డిమాండ్

ఈ ఘటనపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసిబి డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. సదరు అధికారిని అరెస్ట్ చేసి, హైదరాబాద్‌(Hyderabad)లోని రెండవ అదనపు ప్రత్యేక న్యాయమూర్తి (అవినీతి నిరోధక శాఖ కేసులు) వారి కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి పేరు, వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచినట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేసినట్లయితే వెంటనే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064 ను సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. అవినీతి నిరోధక శాఖను సంప్రదించేందుకు క్యూఆర్ కోడ్‌ను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రముఖ బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ సుదర్శన్ పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల పేరు మరియు వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు భరోసా ఇచ్చారు.

Also Read: GHMC: జీహెచ్ఎంసీ ఎన్నికలకు అడుగులు.. ఇన్‌టైమ్‌లోనే పూర్తి చేసేలా సర్కార్ చర్యలు!

Just In

01

Kavitha: కవిత కొత్త పార్టీ.. ఈ ఏడాదిలో పార్టీ పేరును ప్రకటించే అవకాశం!

Kavitha: కవిత ఎపిసోడ్‌పై కాంగ్రెస్ పరిశీలన.. నిజంగానే విమర్శలు చేస్తున్నారా?

Harish Rao: పొమ్మనలేక పొగ పెట్టే ప్రయత్నం? పార్టీలో కీలక నేతగా ఎదిగితే గెంటేయడమేనా?

Hindu Man Killed: బయటకు పిలిచి.. సందులోకి తీసుకెళ్లి.. బంగ్లాదేశ్‌లో హిందూ జర్నలిస్ట్ హత్య

Triple Murder Case: తల్లి, చెల్లి, తమ్ముడిని చంపేసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన వ్యక్తి.. ఢిల్లీలో ట్రిపుల్ మర్డర్