Alleti Maheshwar Reddy: టూ వీలర్ పై పన్నులు పెంచడం
Alleti Maheshwar Reddy ( image credit: swetcha reporter)
Political News

Alleti Maheshwar Reddy: టూ వీలర్ పై పన్నులు పెంచడం దుర్మార్గం.. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి!

Alleti Maheshwar Reddy: రాష్ట్ర ప్రభుత్వం టూ వీలర్ పై పన్నులు పెంచడం దుర్మార్గమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా  ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ సెస్ అంటోందని, కానీ ఆ నిధులను ఎలా ఖర్చు చేస్తారో మాత్రం చెప్పడం లేదని ధ్వజమెత్తారు. కమర్షియల్ వెహికిల్స్ కు పన్ను పెంచడం సరికాదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పన్నులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ సదుపాయాలు కల్పించడంలో లేదని చురకలంటించారు. ఆర్టీసీ చార్జీలు పెంచారని, అవి ఎక్కడ పోయాయో తెలియదని ఫైరయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారని, ఆ హామీ ఏమైందో తెలియదని ఏలేటి విమర్శించారు.

కూలీలకు ఎలాంటి ఉపాధి కల్పిస్తారో చెప్పాలి

గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టెడ్ రోడ్లు వేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంలేదన్నారు. ఎంఐఎం నేతలకు ఇచ్చిన సమయం కూడా తమకు సభలో ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పన్నులను ఉపసంహరించుకోవాలని ఏలేటి డిమాండ్ చేశారు. ఇకపోతే శివారు ప్రాంతాల రైతులకు ఎలాంటి ఉపాధి కల్పిస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి ఉపాధి కల్పిస్తారో చెప్పాలన్నారు.

Also Read: Alleti Maheshwar Reddy: కార్మికుల సొమ్ముతో మెస్సీ మ్యాచ్? బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!

పథకంపై ఆవేదన పేరు మార్చినందుకా?

జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనానికి ముందు చేసిన అధ్యయనానికి సంబంధించిన రిపోర్టులను పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టడం లేదని మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంపై ఆవేదన పేరు మార్చినందుకా? లేక 120 పని దినాలు పెంచినందుకా? స్పష్టత ఇవ్వాలని ఏలేటి చురకలంటించారు. పనిదినాల భారం ప్రభుత్వంపై పడుతున్నందుకే ఈ కడుపు మంటనా? అని నిలదీశారు. పథకం పేరు మార్చడం వల్ల ఎవ్వరికీ నష్టం జరగడం లేదని, నష్టం కాంగ్రెస్ కు మాత్రమే ఉన్నట్లుందని సెటైర్లు వేశారు. గాంధీ పేరు మార్చినందుకే కాంగ్రెస్ నేతలు ఆవేదన చెందుతున్నట్టున్నారని ఎద్దేవాచేశారు. మహాత్మాగాంధీ పక్కా హిందువేనని, రామరాజ్యం కావాలని కోరుకున్నారని గుర్తుచేశారు. అందుకు అనుకూలంగానే పేరు మార్చరినట్లు ఏలేటి వివరించారు.

Also Read: Alleti Maheshwar Reddy: స్పీకర్ తీర్పు రాజ్యాంగ ఉల్లంఘనే.. ఏడాదిన్నర కాలయాపన ఎందుకు?

Just In

01

Ticket Bookings Offer: సంక్రాంతి వేళ ధమాకా ఆఫర్.. రైళ్లల్లో ప్రయాణిస్తే డబ్బు వాపస్.. భలే ఛాన్సులే!

Municipal Elections: మున్సిపోల్‌ ఎన్నికలకు రంగం సిద్ధం.. వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల!

Dil Diya First Look: చైత‌న్య రావు ‘దిల్ దియా’ పోస్టర్ చూశారా.. ఆ బోల్డ్ లుక్ ఏంటి భయ్యా..

Municipal Elections: మున్సిపాల్ ఎన్నికలకు అధికారుల కసరత్తు.. ఆశావాహులకు టికెట్లు దక్కుతాయా?

Medak district Crime: మెదక్ జిల్లాలో ఘోరం.. భర్తను గొంతు బిగించి చంపిన భార్య