Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026 ఫిబ్రవరి 1 ఆదివారం ప్రవేశపెట్టనుంది. అయితే, ఈ సారి ఈ షెడ్యూల్‌లో ప్రభుత్వం కొత్త మార్పులు చేసే ఛాన్స్ లేదని పలు నివేదికలు చెబుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల డేట్స్ పై అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాక ముందే ఇది వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీని నిర్ణీత తేదీగా భావించి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, వర్గాలను ఆ నివేదిక తెలిపింది. సాధారణంగా ప్రతి ఏడాది బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెడతారు.
Also Read: Chamala Kiran Kumar Reddy: యూరియా సరఫరా విషయంలో కేటీఆర్ విమర్శలు ఫేక్: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్‌ను శనివారం రోజు అధికారికంగా ప్రవేశపెట్టారు. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015 బడ్జెట్‌ను ఫిబ్రవరి 28 (శనివారం)న, 2016 బడ్జెట్‌ను కూడా ఫిబ్రవరి 28 (శనివారం)న ప్రవేశపెట్టారు.
నిర్మలా సీతారామన్ తన రికార్డు తానే బ్రేక్ చేసి, వరుసగా తొమ్మిది సమావేశాలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొదటి భారతీయ ఆర్థిక మంత్రిగా నిలవనున్నారు. అయితే, మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టిన 10 బడ్జెట్ల రికార్డుకు ఆమెను మరింత దగ్గర చేస్తుంది. దేశాయ్ 1959 నుండి 1964 వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో మొత్తం 6 బడ్జెట్లను, 1967 నుండి 1969 మధ్య 4 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. మాజీ ఆర్థిక మంత్రులు పి. చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ వేర్వేరు ప్రధాన మంత్రుల హయాంలో వరుసగా తొమ్మిది, ఎనిమిది బడ్జెట్లను ప్రవేశపెట్టారు. 2019లో ప్రధాని మోదీ రెండోసారి విజయం సాధించినప్పుడు సీతారామన్ భారతదేశపు మొదటి మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. 2024లో ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీతారామన్ తన ఆర్థిక శాఖ పోర్ట్‌ఫోలియోను కొనసాగించారు.
Also Read: Damodar Rajanarasimha: రాష్ట్రంలో కొత్త ఏడాదిలో 4 కొత్త హాస్పిటల్స్: మంత్రి దామోదర రాజనర్సింహ

