Amazon Good News: అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను (US Immigration Rules) కఠినతరం చేసిన నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ఆ దేశ ఎంబసీలలో క్షణ్ణంగా వీసా తనిఖీలు కొనసాగుతున్నాయి. అనివార్యమైన ఈ ప్రక్రియకు కొన్ని నెలల సమయం పడుతోంది. ఈ కారణంగా పనినిమిత్తం అమెరికా (USA) నుంచి బయట దేశాలు వెళ్లిన వీసాదారులు అనూహ్యంగా అక్కడే చిక్కుకుపోతున్నారు. ఈ పరిణామం టెకీలకు పెద్ద సంకటంగా మారింది. అయితే, ఈ విషయంలో గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్ వీసా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలలో భాగంగా ఇండియాలో చిక్కుకుపోయిన తమ ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’ చేసేందుకు అనుమతించింది. దీంతో, ఇండియన్ టెకీలకు పెద్ద ఉపశమనం (Amazon Good News) దక్కినట్టుయింది.
భారత్‌లో చిక్కుకున్న ఆ సంస్థ ఉద్యోగులు వీసా క్లియరెన్స్ వచ్చేవరకు ఇక్కడే ఉండి వర్క్ చేసేందుకు వీలుచిక్కింది. డిసెంబర్ 13 నాటికి భారత్‌లో చిక్కకుపోయి, హెచ్-1బీ లేదా హెచ్-4 వీసా అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ ఉపశమనం లభిస్తుంది. ఎలిజిబిలిటీ ఉన్న ఉద్యోగులు మార్చి 2026 వరకు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చని సూచించింది.
Read Also- Medaram Jatara 2026: సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని… కీలక ఆదేశాలు జారీ చేసిన మల్టీ జోన్ ఐజీ
ఎందుకీ నిర్ణయం?
సాధారణంగా అమెజాన్ కంపెనీ ఉద్యోగులు కచ్చితంగా ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. వారంలో కచ్చితంగా 5 రోజులు ఆఫీస్‌లోనే వర్క్ చేయాలి. అయితే, వీసా బ్లాక్స్ కారణంగా ఎంప్లాయిస్ గణనీయ సంఖ్యలో ఇండియాలో చిక్కుకున్నారు. దీంతో, అనివార్య పరిస్థితుల్లో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్ నుంచి వర్క్ ఫ్రం హోమ్ చేసే ఉద్యోగులకు ఎలా కోడింగ్, ట్రబుల్‌షూట్, డాక్యుమెంటేషన్‌కు అనుమతి ఉండదు. అంతేకాదు, ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు, మేనేజింగ్ ప్రొడక్ట్స్, చర్చలు, కాంట్రాక్టులపై సంతకాలు చేయడానికి వీల్లేదని అమెజాన్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. స్థానికంగా ఉన్న అమెజాన్ ఆఫీసులు లేదా, ఫెసిలిటీస్‌లకు వెళ్లి అక్కడి నుంచి పనిచేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కచ్చితంగా ఒక నివాసం నుంచి, లేదా నాన్-అమెజాన్ లోకేషన్ నుంచి పనిచేయాలని చెప్పింది.
Read Also- New Year Party: న్యూఇయర్ పార్టీకి ఆర్టీసీ బస్ డిపోలో మేక కటింగ్.. ప్రోత్సహించిన డిపో మేనేజర్!
కాగా, భారత్ నుంచి వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులపై వర్క్ విషయంలో ఆంక్షలు విధించడంపై ఇండియన్ టెకీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్పందిస్తూ, తన జాబ్‌లో 70-80 శాతం వరకు కోడింగ్, టెస్టింగ్, డాక్యుమెంటింగ్‌కు సంబంధించిన పని ఉంటుందని తెలిపాడు. ఇండియా నుంచి వర్క్ చేస్తున్నాననే కారణంతో ఆంక్షలు విధిస్తే వర్క్ ఎలా చేస్తానంటూ ప్రశ్నించాడు. ఉద్యోగులకు ఎలాంటి ఆప్షన్లు ఇస్తున్నారనే విషయంలో సరైన క్లారిటీ ఇవ్వలేదని చెప్పాడు.
కాగా, వీసా అపాయింట్ల విషయంలో అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లు చాలా సమయం తీసుకుంటున్నాయి. కొన్ని నెలల సమయం పడుతోంది. దీంతో, కొందరు ఈ ఏడాది చివరివరకు వేచి చూడాల్సి ఉంది. మరికొందరికైతే వచ్చేసంవత్సరం కూడా అపాయిట్‌మెంట్లు ఖరారయ్యాయి. దీనిని బట్టి వీసా అపాయింట్‌మెంట్లు ఎంత ఆలస్యమవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

