Grok Saves Man Life: వ్యక్తి ప్రాణాలు కాపాడిన గ్రోక్.. అవాక్కైన మస్క్
Grok Saves Man Life (Image Source: Twitter)
Viral News

Grok Saves Man Life: వ్యక్తి ప్రాణాలు కాపాడిన గ్రోక్.. అవాక్కైన ఎలాన్ మస్క్.. నెట్టింట ఆసక్తికర పోస్ట్

Grok Saves Man Life: వైద్య శాస్త్రంలో కృత్రిమ మేధ (ఏఐ) విఫ్లవాత్మక మార్పులు తీసుకొస్తుందన్న అంచనాలను నార్వేలో జరిగిన ఘటన రుజువు చేసింది. ఎక్స్ ఏఐ టూల్ అయిన గ్రోక్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ఈ విషయాన్ని సదరు వ్యక్తి స్వయంగా తెలియజేశారు. మృత్యువాత పడకుండా తనను ఏఐ ఏ విధంగా రక్షించిందో రెడ్డిట్ వేదికగా తెలియజేశారు. ఈ విషయం అపరకుబేరుడు ఎలాన్ మస్క్ కంట పడటంతో ఆయన కూడా అవాక్కయ్యారు. గ్రోక్ ప్రాణాలు రక్షించిన వార్తను షేర్ చేస్తూ నెట్టింట పోస్ట్ పెట్టారు.

మస్క్ పోస్ట్‌లో ఏముందంటే?

ఏఐ టూల్ గ్రోక్ వ్యక్తి ప్రాణాలను కాపాడిన విషయాన్ని టెస్లా గ్రూప్ నకు చెందిన ఓ ఎక్స్ ఖాతా తొలుత షేర్ చేసింది. దీనిని రీట్వీట్ చేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. గ్రోక్ అని రాసి దాని పక్కన లవ్ సింబల్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎలాన్ మస్క్ రీట్వీట్ చేయడంతో వ్యక్తి ప్రాణాలను గ్రోక్ కాపాడిన అంశం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

బాధితుడు మాటల్లో..

నార్వేకు చెందిన 49 ఏళ్ల వ్యక్తి.. గ్రోక్ తనను కాపాడిన విషయాన్ని మెుట్ట మెుదటగా రెడ్డిట్ లో పంచుకున్నారు. ఇటీవల తాను విపరీతమైన కడుపునొప్పి బారిన పడినట్లు అతడు తెలిపాడు. కడుపులో రేజర్ బ్లేడ్ పెట్టి కోస్తున్నంత బాధను అనుభవించినట్లు చెప్పారు. దీంతో వెంటనే సమీపంలోని డాక్టర్ వద్దకు వెళ్లగా.. అతడు తన పొట్టను నొక్కి చూసి సాధారణ నొప్పేనంటూ ట్యాబ్లెట్ ఇచ్చాడని చెప్పారు.

Also Read: Harish Rao on CM Revanth: మూసి కంపు కంటే.. సీఎం నోటి కంపే ఎక్కువ.. హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్

గ్రోక్ సాయం కోరిన బాధితుడు..

డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకున్నప్పటికీ తన నొప్పి ఏమాత్రం తగ్గలేదని బాధితుడు రెడ్డిట్ లో తెలిపాడు. దీంతో సరిగ్గా తాను పడుతున్న బాధను ఏఐ టూల్ గ్రోక్ కు చెప్పినట్లు పేర్కొన్నాడు. తన సమస్య మెుత్తం విని.. అది అపెండిక్స్ లేదా అల్సర్ కావొచ్చని గ్రోక్ తేల్చేసిందన్నారు. వెంటనే సిటీ స్కాన్ చేయించుకోవాలని సూచించినట్లు చెప్పారు. దీంతో మరోమారు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించగా.. టెస్టుల్లో అపెండిక్స్ అని తేలిందన్నారు. అది కూడా పగిలే దశలో ఉండటంలో వైద్యులు వెంటనే సర్జరీ చేసి తన ప్రాణాలు కాపాడినట్లు వివరించాడు. ఇదే విషయాన్ని మస్క్ షేర్ చేయడం విశేషం.

Also Read: Kavitha Kalvakuntla: అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే.. బీఆర్ఎస్‌ను ఎవరూ కాపాడలేరు.. కవిత సంచలన వ్యాఖ్యలు

Just In

01

Musi River: త్వరలో మూసీ ప్రక్షాళన!.. మొదటి దశలో ఎన్ని కి.మీ. చేస్తారంటే?

Tiger Panic: మళ్లీ పులి కలకలం.. ఉలిక్కిపడ్డ కొత్తగూడ ఏజెన్సీ

PhD on Nifty 50: నిఫ్టీ-50పై పీహెచ్‌డీ.. డాక్టరేట్ సాధించిన తెలుగు వ్యక్తి

Oppo Find X9s: 7,000mAh బ్యాటరీతో Oppo Find X9s..

Lady Constable: లేడీ కానిస్టేబుల్ దుస్తులు చింపేసిన నిరసనకారులు.. షాకింగ్ వీడియో వైరల్