Lover Attacks Man: ప్రియుడిని ఇంటికి పిలిచి ప్రైవేట్ పార్ట్స్ కోసివేత
Mumbai-Crime (Image source X)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Lover Attacks Man: రాత్రి 1.30 గంటలకు ప్రియుడిని ఇంటికి పిలిచి.. ప్రైవేటు పార్ట్స్ కోసేసిన ప్రియురాలు

Lover Attacks Man: గతేడాది 2025కి గుడ్‌బై చెప్పి.. గురువారం నాడు ప్రపంచమంతా నూతన సంవత్సరం 2026లోకి అడుగుపెట్టింది. తమకు ఇష్టమైనవారి మధ్య, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య దాదాపుగా అందరూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. నూతన ఉత్తేజంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. కానీ, ఓ వ్యక్తికి మాత్రం కలలో కూడా ఊహించని దారుణ పరిస్థితి ఎదురైంది. గతంలో శారీరక సంబంధం నెరిపిన ప్రియురాలు న్యూఇయర్ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తే వెళ్లాడు. స్వీట్స్ తీసుకొని వెళ్దువు రమ్మంటే నమ్మేశాడు. తీరా ఇంట్లోకి వచ్చిన ప్రియుడిని ప్యాంట్ విప్పమంటూ ప్రియురాలు కోరింది. అతడు ప్యాంట్ విప్పేశాక కిచెన్‌లోకి వెళ్లి పదునైన కత్తి తీసుకొచ్చి, ఒక్కసారిగా ప్రియుడి ప్రైవేటు భాగాలను (Lover Attacks Man) కోసేసింది.

ఈ హఠాత్పరిణామంతో ప్రియుడు గిలగిలా కొట్టుకున్నాడు. తీవ్ర రక్తస్రావం జరిగింది. అయినప్పటికీ అలాగే ఓ ఆటో ఎక్కి తన ఇంటికి వెళ్లాడు. విషయాన్ని గుర్తించిన అతడి కొడుకులు, బంధువులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతడికి చికిత్స నడుస్తోంది. ముంబైలోని సియోన్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ నడుస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ షాకింగ్ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో జరిగింది. బాధిత వ్యక్తి వయసు 44 సంవత్సరాలు, నిందితురాలి వయసు 25 ఏళ్లుగా తేలింది. డిసెంబర్ 31న రాత్రి ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో నిందితురాలి పిల్లలు ఇంట్లో నిద్రపోతున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు (Crime News) చేశారు. అయితే, నిందితురాలు మాత్రం పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read Also- Chamala Kiran Kumar Reddy: యూరియా సరఫరా విషయంలో కేటీఆర్ విమర్శలు ఫేక్: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఎఫైర్ ఎప్పటినుంచంటే?

బాధిత వ్యక్తి, నిందితురాలి మధ్య చాలాకాలంగా వివాహేతర సంబంధం నడిచింది. వీరిద్దరూ బంధువులు. బాధిత వ్యక్తి సోదరికి నిందితురాలు మరదలు అవుతుంది. ఆ విధంగా ఇద్దరి మధ్య పరిచయం, ఆ తర్వాత శారీరక సంబంధాలు ఏర్పడ్డాయి. ఆరేడేళ్లపాటు ఇద్దరి మధ్య శారీరసంబంధం కొనసాగింది. భార్య, పిల్లలను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియురాలు చాలా కాలంగా కోరుతోందని వెల్లడైంది. ఇదే విషయమై ఇద్దరి మధ్య చాలాసార్లు వాగ్వాదాలు జరిగాయి. నిత్యం వివాదాల నేపథ్యంలో, బాధిత వ్యక్తి ఒత్తిడికి గురయ్యాడు. దీంతో, ముంబైలోని శాంటా క్రూజ్ ఈస్ట్ ప్రాంతంలో 18 ఏళ్లపాటు నివసించిన అతడు, ప్రియురాలి బాధపడలేక బీహార్ వెళ్లిపోయాడు. కుటుంబం మొత్తాన్ని వెంటబెట్టుకొని నవంబర్ 2025లో బీహార్ వెళ్లాడు. అక్కడే నివసిస్తున్నాడు.

అయినప్పటికీ ప్రియురాలి నుంచి అతడికి బెదిరింపులు ఆగలేదు. ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉండేది. ఈ క్రమంలో డిసెంబర్ 19న బాధిత వ్యక్తి ఓ పనినిమిత్తం బీహార్ నుంచి ముంబై వచ్చాడు. అయితే, నిందిత మహిళకు కంటపడకుండా దూరం పాటించాడు. ఆమెతో కాంటాక్ట్‌లోకి వెళ్లలేదు. సమాచారం ఎలా అందిందో తెలియదు గానీ డిసెంబర్ 31న దాదాపు రాత్రి 1.30 గంటల సమయంలో తన ఇంటికి రావాలంటూ బాధిత వ్యక్తిని ఆహ్వానించింది. న్యూఇయర్ స్వీట్స్ ఇస్తానని నమ్మించింది. తీరా వెళ్లాక ఊహించని ఈ దారుణానికి ఒడిగట్టింది. ప్రైవేటు పార్ట్స్ కోసివేయడంతో బాధిత వ్యక్తికి తీవ్రమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆటోలో ఇంటికి చేరుకున్న అతడిని తొలుత వీఎన్ దేశాయ్ హాస్పిటల్‌కు, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం సియోన్ హాస్పిటల్‌కు తరలించారు. ఇది చాలా తీవ్రమైన గాయమని, సర్జరీ కూడా అవసరం కావొచ్చని వైద్యులు తెలిపారు.

Read Also- College Bus Accident: ఘోర ప్రమాదం.. కాలేజీ బస్సు బోల్తా.. కళ్లెదుటే 60 మంది స్టూడెంట్స్..

Just In

01

PhD on Nifty 50: నిఫ్టీ-50పై పీహెచ్‌డీ.. డాక్టరేట్ సాధించిన తెలుగు వ్యక్తి

Oppo Find X9s: 7,000mAh బ్యాటరీతో Oppo Find X9s..

Lady Constable: లేడీ కానిస్టేబుల్ దుస్తులు చింపేసిన నిరసనకారులు.. షాకింగ్ వీడియో వైరల్

Parrot Deaths: నర్మదా నది ఒడ్డున తీవ్ర విషాదం.. మధ్యప్రదేశ్‌లో 200 చిలుకల మృతి

Budget 2026: దేశ ఆర్థిక దిశను నిర్ణయించే కేంద్ర బడ్జెట్ ప్రకటనకు డేట్ ఫిక్స్.. ఈ ఏడాది ఎప్పుడంటే?