Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం సమావేశాల్లో భాగంగా రెండో రోజు సభ ప్రారంభమైంది. ఈ క్రమంలో విపక్ష బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత సమస్యపై చర్చించాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబడ్డారు. ఈమేరకు ఆ పార్టీ నేతలు హరీశ్ రావు, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి తదితర ఎమ్మెల్యేలు ఫ్లకార్డులతోనే సభలోకి అడుగుపెట్టారు.
పెద్ద ఎత్తున నినాదాలు..
అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందే బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలిపారు. ‘రైతు రాజ్యమని గొప్పలు.. యూరియా దొరకక రైతులు తిప్పలు’, రైజింగ్ తెలంగాణ అని గొప్పలు.. యూరియా లైన్లలో రైతులు తిప్పలు’, ‘షాపుల్లో లేని యూరియా యూప్ లో ఉంటదా?’ అంటూ రాసి ఉన్న ఫ్లకార్డులను బీఆర్ఎస్ నేతలు ప్రదర్శించారు. కాంగ్రెస్ వచ్చింది.. రైతులను నిండా ముంచింది అంటూ నినాదాలు చేశారు. యూరియా కొరతపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టారు.
యూరియాపై బీఆర్ఎస్ నిరసన
ప్లకార్డ్ లతో అసెంబ్లీ హాల్ లోకి వెళ్లిన బీఆర్ఎస్ఎల్పీ నేతలు
కాంగ్రెస్ వచ్చింది రైతులను నిండా ముంచింది అంటూ నినాదాలు
సకాలంలో యూరియా సరఫరా చేయాలని డిమాండ్
యూరియా కొరతపై వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు pic.twitter.com/qAE9OWXZSq
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2026
మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..
యూరియా కొరతపై చర్చ జరపాలంటూ బీఆర్ఎస్ పట్టుబడటంపై సభలో మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ప్రతిపక్షాలకు క్వశ్చన్ అవర్ జరగడం ఇష్టం లేనట్టుందని మండిపడ్డారు. ప్రస్తుతం సభలో క్వశ్చన్ అవర్ నడుస్తోందన్న మంత్రి.. కొన్ని ముఖ్యమైన ప్రశ్నలపై సభలో చర్చించాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఏదైనా సమస్య ఉంటే వివిధ సరైన ఫార్మట్ లో సభ ముందుకు తీసుకొని రావాలని సూచించారు. ప్రస్తుతం జరిగే క్వశ్చన్ అవర్ ను సజావుగా జరగినివ్వాలని.. మీరు అడిగి ప్రతి ప్రశ్నకు సమధానం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు విపక్ష సభ్యులు కోరినట్లుగా యూరియా కొరతపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇప్పటికిప్పుడు సభలో తీసుకురాలేమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తేల్చి చెప్పారు. క్వశ్చన్ అవర్ లో పాయింట్ ఆఫర్ ఉండదని స్పష్టం చేశారు.
శాసనసభలో గందరగోళం
యూరియా కొరతపై వెంటనే చర్చ చేపట్టాలంటూ పట్టుబట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ప్రతిపక్షాలకు క్వశ్చన్ అవర్ జరగడం ఇంట్రెస్టింగ్ గా లేనట్టు ఉందన్న మంత్రి శ్రీధర్ బాబు
ఏదైనా సమస్య ఉంటే వివిధ ఫార్మాట్ లో ప్రతిపక్ష సభ్యులు రావాలన్న మంత్రి శ్రీధర్ బాబు
యూరియా కొరతపై… pic.twitter.com/KF0PZl8jiB
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2026
Also Read: Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు కబ్జా.. బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు
కేసీఆర్ డుమ్మా..
మరోవైపు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. రెండోరోజు సమావేశంలోనూ సభకు హాజరుకాలేదు. ఇటీవలే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై చర్చిద్దామని సవాలు విసిరిన కేసీఆర్.. సభకు మాత్రం దూరంగానే ఉన్నారు. దీంతో మరోమారు బీఆర్ఎస్ శ్రేణులు నిరాశకు గురవుతున్నారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు.. ప్రతిపక్ష నేతపై సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సభకు వస్తే గౌరవమర్యాదలు తగ్గకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. నీటి సమస్యపై చర్చించేందుకు తాము సిద్ధమేనని తేల్చేశారు.

