Drunk And Drive Test: న్యూయర్ వేడుకలతో హైదరాబాద్ నగరం మార్మోగిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున నగరవాసులు కొత్త ఏడాదికి సెలబ్రేషన్స్ ద్వారా స్వాగతం పలికారు. అదే సమయంలో మందుబాబులు సైతం పెద్ద ఎత్తున నగరంలో రెచ్చిపోయారు. మందుతాగి వాహనాలు నడపొద్దని పోలీసులు ముందే హెచ్చరించినా కొందరు ఏమాత్రం లెక్కచేయలేదు. మద్యం తాగి వాహనాన్ని నడుపుతూ పోలీసులు అడ్డంగా బుకయ్యారు. ఫలితంగా డిసెంబర్ 31 రాత్రి నగరంలో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
‘2731 మంది పట్టుబడ్డారు’
హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదుయ్యాయి. మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతున్న వారికి పోలీసులు చెక్ పెట్టారు. నగరంలో మెుత్తం 2,731 మంది పోలీసులకు చిక్కారు. పట్టుబడ్డ అందరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసు శాఖ ప్రకటించింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1198 మంది మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. అలాగే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 928 మంది, మల్కాజిగిరి పరిధిలో 605 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టారు.
పోలీసులపై ప్రశంసలు..
హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించడంపై నగర కమిషనర్ వీసీ సజ్జనార్ (V.C. Sajjanar) సంతోషం వ్యక్తం చేశారు. ఇందు కోసం కష్టపడ్డ సిటీ పోలీసులకు అభినందనలు తెలిపారు. హోమ్ గార్డ్స్ నుంచి ఏసీపీల వరకూ ప్రతీ ఒక్కరి కృషిని ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ఇదే విధంగా టీమ్ వర్క్ తో పనిచేసి హైదరాబాద్ సురక్షితమైన గ్లోబల్ సిటీగా ఉంచాలని సూచించారు. వ్యక్తిగతంగా అన్నీ జోన్లలోని బందోబస్తును తాను పరిశీలించినట్లు సజ్జనార్ తెలిపారు. సిటీ పోలీసులు అర్ధరాత్రి అద్భుతంగా పనిచేశారని కొనియాడారు.
I congratulate all officers for the successful conduct of New Year’s Eve bandobast and the strict enforcement of drunk-driving laws.
I appreciate the efforts of every officer—from Home Guards to Additional Commissioners of Police. Teamwork is what makes #Hyderabad safer and… pic.twitter.com/aqRtb5ItSn
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 1, 2026
Also Read: Hyderabad Liquor Sales: ఇలా తాగేశారేంట్రా.. డిసెంబర్ 31 రాత్రి.. రికార్డు స్థాయిలో మద్యం సేల్స్!
ప్రమాదాల్లేని హైదరాబాద్..
అంతకుముందు మరో ఎక్స్ పోస్టు పెట్టిన వీసీ సజ్జనార్.. న్యూయర్ సందర్భంగా హైదరాబాద్ లో ఒక్క ప్రమాదం చోటుచేసుకోలేదని తెలిపారు. నగరమంతా ఏర్పాటు చేసిన బందోబస్త్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు సత్ఫలితాలు ఇచ్చినట్లు చెప్పారు. అటు నగరవాసులు సైతం బాధ్యతాయుతంగా వ్యవహరించారని.. హైదరాబాద్ సురక్షితమైన నగరమని మరోమారు నిరూపించారని సజ్జనార్ ప్రశంసించారు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు ముందుకు సాగుదామని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.
Thank you, #Hyderabad, for an incident-free New Year.
Strong enforcement, effective awareness, and public support resulted in zero incidents with Drunk Driving enforcement drives everywhere.
This didn’t happen by chance. Awareness worked, responsibility won, and your… pic.twitter.com/U36eVfBxkU
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 1, 2026

