Supreme Court of India: దేశ న్యాయ చరిత్రలో అరుదైన ఘట్టం..
supreme court ( Image Source: Twitter)
జాతీయం

Supreme Court of India: దేశ న్యాయ చరిత్రలో అరుదైన ఘట్టం.. 2025లో 75 వేలకుపైగా కేసులు పరిష్కరించిన సుప్రీంకోర్టు

Supreme Court of India: ఉన్నత న్యాయవ్యవస్థపై కొనసాగుతున్న భారాన్ని స్పష్టంగా చూపించే గణాంకంగా, 2025లో భారత సుప్రీంకోర్టు 75,000కుపైగా కేసులను వాదించింది. ఇది ప్రపంచంలోని ఏ ఇతర అత్యున్నత న్యాయస్థానం సాధించని స్థాయిలో ఉండటం గమనార్హం. ఓ వైపు సుప్రీంకోర్టు అసాధారణంగా పనిచేస్తున్నదని ఈ గణాంకం తెలియజేస్తున్నా, మరోవైపు న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న వ్యవస్థాపక సవాళ్లను కూడా తీవ్రంగా గుర్తు చేస్తోంది.

Also Read: Wolf Supermoon: కొత్త ఏడాదిలో బిగ్ సర్‌ప్రైజ్.. ఆకాశంలో తోడేలు చందమామ.. ఇప్పుడు మిస్సయితే..

అమెరికా సుప్రీంకోర్టులో వేల సంఖ్యలో పిటిషన్లు దాఖలవుతున్నా, వాదనల కోసం కేవలం 70 నుంచి 80 కేసులను మాత్రమే స్వీకరిస్తుంది. యునైటెడ్ కింగ్‌డమ్ సుప్రీంకోర్టు డిసెంబర్ 29 వరకు 200కు పైగా కేసులను స్వీకరించి, అందులో సుమారు 50 కేసులకు మాత్రమే తీర్పులు ఇచ్చింది. అయితే, మన భారత దేశంలోని సుప్రీంకోర్టు ఒక్క ఏడాదిలోనే 1,400 తీర్పులతో పాటు వేలాది ఉత్తర్వులు జారీ చేసి కేసులను సులభంగా పరిష్కరించింది.

Also Read: GHMC Achievements 2025: హైదరాబాద్ చరిత్రలోనే ఇదొక మైలురాయి.. 2025 సంవత్సరంలో ఇదే అతి పెద్ద రికార్డు..?

ఈ క్రమంలోనే భారత్‌లో న్యాయ వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం (మేడియేషన్)ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పలువురు ప్రముఖ న్యాయవాదులు గట్టిగా వాదిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ‘మేడియేషన్ ప్రభావం విస్తృతి’ అనే జాతీయ సదస్సులో పాల్గొన్న సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా మాట్లాడుతూ, దేశంలో పెరుగుతున్న కేసుల సంఖ్యకు కొత్తదనం కలిగిన, ఆచరణలో సాధ్యమైన పరిష్కారాలు అవసరమని అన్నారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అనుమతించిన సంఖ్య ఇప్పటికే ఆరు సార్లు పెంచింది. 1956లో 11కి, 1960లో 14కి, 1978లో 18కి, 1986లో 26కి, 2009లో 31కి, చివరగా 2019లో 34కి పెంచారు. సుప్రీంకోర్టుకు చేరుతున్న కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ విస్తరణ అవసరమైందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: GHMC Achievements 2025: హైదరాబాద్ చరిత్రలోనే ఇదొక మైలురాయి.. 2025 సంవత్సరంలో ఇదే అతి పెద్ద రికార్డు..?

అయితే, న్యాయమూర్తుల సంఖ్య పెరిగినా కేసుల భారం తగ్గడం లేదు. 2024 డిసెంబర్ నాటికి సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు 83,000కు పైగా ఉండగా, ఇది 2020 చివరితో పోలిస్తే దాదాపు 14,000 కి పెరిగింది. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. కోర్టు తొలి సంవత్సరం అయిన 1950 చివరికి పెండింగ్ కేసులు ఇంకా 690 ఉన్నాయి.

Just In

01

Hydraa – Kite Festival: నాడు మురికి కూపాలు.. నేడు వేడుక‌లకు వేదిక‌లు.. సంక్రాంతికి చెరువులు సిద్ధం!

Damodar Rajanarasimha: రాష్ట్రంలో కొత్త ఏడాదిలో‌ 4 కొత్త హాస్పిటల్స్: మంత్రి దామోదర రాజనర్సింహ

2026 Assembly Elections: ఫుల్ పొలిటికల్ హీట్.. 2026లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు ఇవే

Kingdom Sequel Cancelled: ‘కింగ్డమ్ 2’ ఇక ఉండదంటూ వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

Vande Bharat Sleeper: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జనవరిలోనే వందే భారత్ స్లీపర్ సేవలు.. కేంద్రం ప్రకటన