SP Sudhir Ramnath Kekan: ఆలయం వద్ద నూతన పార్కింగ్!
SP Sudhir Ramnath Kekan (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

SP Sudhir Ramnath Kekan: గట్టమ్మ ఆలయం వద్ద నూతన పార్కింగ్ ఏర్పాటు: ఎస్పీ శ్రీ సుధీర్ రామనాథ్ కేకన్

SP Sudhir Ramnath Kekan: మేడారం మహాజాతర సందర్భంగా భక్తులకు సౌకర్యవంతమైన పార్కింగ్ ఏర్పాట్ల కోసం ములుగు జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రామనాథ్ కేకన్, డీఎఫ్‌ఓ కిషన్ జాదవ్ తో కలిసి గట్టమ్మ ఆలయం పరిసర ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌కు అనువైన ప్రాంతాన్ని ఎంచుకొని చదును చేశారు. బుధవారం చదును చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని జాతర సమయంలో వేల సంఖ్యలో వచ్చే ప్రభుత్వ మరియు ప్రైవేట్ వాహనాల పార్కింగ్‌కు ఉపయోగించేందుకు, సుమారు 10 ఎకరాల మేర ప్రాంతాన్ని అనుకూలంగా తీర్చిదిద్దారు. కాగా ఈ సారి ట్రాఫిక్ ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతికులంగా మారనుంది. కాగా ఎస్ పీ, అటవీ శాఖ అధికారులను అభినందించారు.

ర్యాంపులు ఏర్పాటు

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పార్కింగ్ ప్రాంతంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్పష్టమైన రేడియం స్టిక్కర్లు, దిశానిర్దేశక సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని, రాత్రి సమయంలో కూడా స్పష్టంగా కనిపించేలా సూచికలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎస్ పి ఆదేశించారు. వాహనాలు సులభంగా వచ్చేందుకు అవసరమైన ర్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు.

Also Read: Mukkoti Ekadashi: మెదక్‌లో వైభవంగా ముక్కోటి.. మంత్రి దంపతుల ప్రత్యేక పూజలు

మహా జాతర మేడారం

పార్కింగ్ నుంచి ఆలయ మార్గం వరకు ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల సాఫీగా రాకపోకలు జరిగేలా ముందస్తు ప్రణాళిక రూపొందించారు. మేడారం జాతరను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. దూర ప్రాంతాల నుంచి మొదటగా ఘట్టమతల్లిని దర్శించుకున్నాక సమ్మక్క సారక్క జాతర కు భక్తులు వెళతారని, ఆ క్రమంలోనే ఘట్టమ్మ తల్లి దేవాలయం వద్ద వివిధ ప్రాంతాలను నుంచి వచ్చిన వాహనాలకు అనువైన పార్కింగ్ స్థలాల్లో ఏర్పాటు చేస్తే దర్శనం ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆ తర్వాత మహా జాతర మేడారం సమ్మక్క సారలమ్మలలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులకు సులువుగా ఉంటుందని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పేర్కొన్నారు.

Also Read; Maruthi Surprise: అడ్రస్ ఇచ్చినందుకు మారుతీ ఇంటికి ప్రభాస్ ఫ్యాన్స్ ఏం పంపారో తెలుసా?.. ఇది వేరే లెవెల్..

Just In

01

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?

Grok AI Misuse: 3 రోజుల్లో ఆ కంటెంట్‌ను తొలగించండి.. ‘ఎక్స్’కి కేంద్రం సంచలన నోటీసులు

Urea Supply: రైతులు క్షమించరు జాగ్రత్త.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై ఫైర్

RTC Bus Accident: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం… తెల్లారిన దంపతుల బతకులు

GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు