Minister Seethakka: ములుగు జిల్లా సమీపంలోని గట్టమ్మ గుట్ట వద్ద నిర్మించనున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి(Foot overbridge) నిర్మాణంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేదతీరే అవకాశం ఉందని, తల్లికి తలవంచందే భక్తులు ముందు కదలరని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క(Minister Seethakka) అన్నారు. బుదవారం ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను, ఆర్టీసీ బస్సులు(RTC Bus), ప్రయివేట్ వాహనాల పార్కింగ్ స్థలాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క , జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్ లతో కలిసి పరిశీలించారు.
Also Read: Viral Video: ఫ్యాంటు జేబులో పేలిన మోటరోలా ఫోన్.. వీడియో వైరల్
మంత్రి సీతక్క మాట్లాడుతూ..
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులు, పర్యాటకులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరమే ముందు సాగుతారని, జాతీయ రహదారి ఆనుకొని ఉన్న గట్టమ్మ తల్లి ఆలయం వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని, నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. పార్కింగ్(Parking) నుంచి ఆలయ మార్గం వరకు ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల సాఫీగా రాకపోకలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. పార్కింగ్ ప్రాంతంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్పష్టమైన రేడియం స్టిక్కర్లు, దిశానిర్దేశక సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని, రాత్రి సమయంలో కూడా స్పష్టంగా కనిపించేలా సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్(Ravi Chender), ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, ఆర్ అండ్ బి శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Uttarakhand : ఉత్తరాఖండ్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ టన్నెల్‌లో ఘోర ప్రమాదం.. 60 మందికి గాయాలు

