LG Gallery TV: టీవీ మార్కెట్‌లో కొత్త ట్రెండ్?
Lg TV ( Image Source: Twitter)
Technology News

LG Gallery TV: ప్రపంచ టెక్ షో CES 2026లో ఎల్‌జీ గ్యాలరీ టీవీ ఆవిష్కరణ..

LG Gallery TV: ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ ప్రదర్శన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2026లో ఎల్‌జీ తన కొత్త గ్యాలరీ టీవీ (Gallery TV) ను ఆవిష్కరించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త మోడల్‌ను ఎల్‌జీ తన లైఫ్‌స్టైల్ టీవీల శ్రేణిలో భాగంగా పరిచయం చేస్తూ, వినోదానికి మాత్రమే కాకుండా ఇంటి డిజైన్‌లో భాగంగా పనిచేసే ఉత్పత్తిగా రూపొందించింది.

సాంప్రదాయ టీవీల మాదిరిగా గోడపై నలుపు తెరలా కనిపించకుండా, ఉపయోగంలో లేనప్పుడు కూడా ఇంటి అందాన్ని పెంచేలా గ్యాలరీ టీవీని డిజైన్ చేసినట్లు ఎల్‌జీ తెలిపింది. ఇది యాక్టివ్‌గా ఉపయోగించనప్పుడు ఒక ఆర్ట్ కాన్వాస్‌లా మారి, హోమ్ డెకర్‌తో సహజంగా కలిసిపోయేలా రూపొందించబడింది. ఆధునిక ఇళ్లలో స్క్రీన్‌లు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ సాధనాలుగా కాకుండా, డిజైన్ ఎలిమెంట్లుగా మారాలనే ఎల్‌జీ లైఫ్‌స్టైల్ టీవీ వ్యూహానికి ఇది కొనసాగింపుగా నిలుస్తుంది.

Also Read: Karimnagar News: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కరీంనగర్ యువకుడి వినూత్న నిరసన.. డిమాండ్ ఏంటంటే?

గ్యాలరీ మోడ్ & విజువల్ ఆప్టిమైజేషన్

ఈ గ్యాలరీ టీవీకి ప్రత్యేక ఆకర్షణగా గ్యాలరీ మోడ్ ను ఎల్‌జీ అందిస్తోంది. మ్యూజియం క్యూరేటర్లతో కలిసి అభివృద్ధి చేసిన ఈ మోడ్, అసలైన కళాకృతుల టెక్స్చర్, రంగుల స్పష్టతను ప్రతిబింబించేలా రంగులు, ప్రకాశం, కాంట్రాస్ట్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది. అంతేకాదు, గదిలోని వెలుతురు పరిస్థితులను గుర్తించి చిత్ర నాణ్యతను స్వయంచాలకంగా సర్దుబాటు చేయడంతో , రోజు పొడవునా ఒకే స్థాయి క్లారిటీని అందిస్తుంది.

Also Read: Hyderabad Vijayawada Train: హైదరాబాద్-విజయవాడ ట్రైన్ జర్నీ 3 గంటలే!.. దక్షిణమధ్య రైల్వే అదిరిపోయే ప్రతిపాదన

గ్యాలరీ టీవీ 55 అంగుళాలు, 65 అంగుళాల సైజ్‌లలో అందుబాటులో ఉంటుంది. స్లిమ్, ఫ్లష్-మౌంట్ డిజైన్‌తో గోడకు అతుక్కుని ఉన్న ఫ్రేమ్‌లా కనిపించేలా రూపొందించారు. వినియోగదారుల ఇంటి డిజైన్‌కు సరిపోయేలా మాగ్నెటిక్ కస్టమైజబుల్ ఫ్రేమ్‌లు కూడా ఇందులో ఉన్నాయి. అంతర్గతంగా తగినంత స్టోరేజ్‌ను అందించడం వల్ల, వినియోగదారులు తమకు నచ్చిన విజువల్ కంటెంట్‌ను టీవీలోనే సేవ్ చేసుకోవచ్చు.

డిస్‌ప్లే పరంగా, ఈ టీవీకి ఎల్‌జీ మినీ ఎల్‌ఈడీ (MiniLED) టెక్నాలజీతో పాటు ఆల్ఫా 7 ఏఐ ప్రాసెసర్ శక్తినిస్తుంది. ఇవి కలిసి 4కే రిజల్యూషన్‌లో మెరుగైన విజువల్స్‌ను అందిస్తాయి. ఆడియో విషయానికి వస్తే, ఏఐ సౌండ్ ప్రో (AI Sound Pro) సపోర్ట్‌తో వర్చువల్ 9.1.2 ఛానల్ అవుట్‌పుట్‌ను అందించి, అదనపు స్పీకర్లు లేకుండానే ఇమర్సివ్ సౌండ్ అనుభూతిని కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read: Baba Vanga Predictions 2026: 2026లో ప్రపంచానికి ఏలియన్ల ముప్పు ఉందా.. బాబా వంగా చెప్పిన అంచనాలు నిజమవుతాయా?

ఈ అనుభవాన్ని పూర్తి చేసేలా LG Gallery+ సర్వీస్ ను కూడా అందిస్తున్నారు. ఇందులో 4,500కు పైగా కళాకృతుల లైబ్రరీ ఉండగా, వాటిని తరచూ అప్‌డేట్ చేస్తారు. వీడియో కంటెంట్‌కు మాత్రమే పరిమితం కాకుండా, స్క్రీన్‌ను ఒక ఇంటి డిజైన్ ఎలిమెంట్‌గా మార్చడమే గ్యాలరీ టీవీ వెనుక ఉన్న ప్రధాన ఆలోచనగా ఎల్‌జీ తెలిపింది.

Just In

01

Dhurandhar Movie: అలా జరిగినందుకు రూ.90 కోట్ల వరకూ నష్టపోయిన ‘దురంధర్’ సినిమా.. ఎందుకంటే?

Anaganaga Oka Raju: సంక్రాంతికి ఉన్న భారీ పోటీపై నవీన్ పొలిశెట్టి ఏమన్నారంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ క్లైమాక్స్ గురించి మారుతీ చెప్పింది ఇదే.. అది 70 రోజుల కష్టం..

New Year 2026 Hyderabad: న్యూయర్ వేడుకలకు సిద్ధమైన హైదరాబాద్.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్!

Bengaluru: బెంగళూరులో విషాదం.. భవనం పై నుంచి దూకి యువ ఉద్యోగి ఆత్మహత్య