New Year 2026: మరో 24 గంటల్లో కొత్త ఏడాది రాబోతుంది. కాబట్టి అందరూ ఎవరికీ తగ్గట్టు వారు ప్లాన్ చేసుకుంటారు. ఇక న్యూ ఇయర్ 2026 వేడుకలు అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ కలిసి ఆనందంగా గడపడం, ఆ ఆనందాన్ని మరింత ప్రత్యేకం చేసే విషయం రుచికరమైన భోజనం. ఇంట్లో పార్టీ అయినా, అవుట్‌డోర్ సెలబ్రేషన్ అయినా డిన్నర్ మెనూ బాగా ప్లాన్ చేస్తే వేడుక అదిరిపోతుంది. అందరికీ నచ్చేలా, వెరైటీగా, సింపుల్‌గా ఉండే ఫుడ్ ఐడియాస్ ఎంచుకోవడం న్యూ ఇయర్ పార్టీకి ముఖ్యం.
పార్టీని స్టార్టర్స్ తో మొదలు పెట్టండి..
పార్టీకి వచ్చిన వెంటనే ఆకలి పెంచే స్టార్టర్స్ తప్పనిసరి. వెజ్ తినే వాళ్ళ కోసం స్ప్రింగ్ రోల్స్, పన్నీర్ టిక్కా, చీజ్ బాల్స్ లాంటి ఐటమ్స్ బెస్ట్ చాయిస్. నాన్ వెజ్ ఇష్టపడేవాళ్లకు చికెన్ లాలిపాప్, చికెన్ 65, మటన్ రోస్ట్, ఫిష్ ఫింగర్స్ లాంటివి పార్టీకి స్పెషల్ టచ్ ఇస్తాయి. ఇవన్నీ ఎక్కువ మసాలా కాకుండా లైట్‌గా తయారు చేస్తే అందరూ తినొచ్చు.
డిన్నర్‌లో మెయిన్ కోర్స్ ఇలా ప్లాన్ చేయండి..
డిన్నర్‌లో మెయిన్ కోర్స్ పార్టీ హైలైట్‌గా ఉండాలి. వెజ్ తినే వారికీ ఫ్రైడ్ రైస్, జీరా రైస్, నాన్, రూమాలి రోటి లాంటి ఐటమ్స్‌తో పాటు పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ గ్రేవీలు వంటివి మంచి కాంబినేషన్ ఇస్తాయి. నాన్ వెజ్‌లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ , బట్టర్ చికెన్ లాంటి ఐటమ్స్ ఉంటే అతిథులకు ప్రత్యేక అనుభూతి కలుగుతుంది.
ఫుడ్ మధ్యలో లైట్‌గా ఉండేందుకు సలాడ్స్, రైతా చాలా అవసరం. గ్రీన్ సలాడ్, ఫ్రూట్ సలాడ్, రైతా , ఉల్లి రైతా డిన్నర్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. ఇవి జీర్ణక్రియకు కూడా మంచిది. కాబట్టి పార్టీ తర్వాత భారంగా అనిపించదు.
కేక్ కట్టింగ్‌తో కొత్త సంవత్సరానికి ఇలా స్వాగతం చెప్పండి..
న్యూ ఇయర్ పార్టీ డెజర్ట్స్ లేకుండా పూర్తికాదు. కేక్ కట్టింగ్‌తో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పి, గులాబ్ జామున్, ఐస్ క్రీమ్, ఫ్రూట్ కస్టర్డ్ లాంటి స్వీట్ ఐటమ్స్ పెట్టుకుంటే వేడుక మధురంగా ముగుస్తుంది. చివరగా మాక్‌టెయిల్స్, ఫ్రెష్ జ్యూసులు, టీ లేదా కాఫీతో పార్టీకి ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. ఈ విధంగా మీ ఇంట్లో ఫుడ్ ప్లాన్ చేస్తే కొత్త ఏడాది 2026 డిన్నర్ పార్టీ ఖచ్చితంగా గుర్తుండిపోయేలా ఉంటుంది.

