Harish Rao: బిఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులకు ఏడు డిపిఆర్లకు అనుమతి తీసుకొస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు డిపిఆర్(DPR) వెనక్కి వచ్చాయని.. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ఒక్క డీపీఆర్ కేంద్రానికి పంపలేదు.. ఒక అనుమతి కూడా తీసుకు రాలేదని.. ఉత్తంకుమార్ రెడ్డి(Uttam Kumar Rddy) ఉత్తమ మాటలు మాట్లాడవద్దని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) మండిపడ్డారు. అసెంబ్లీలోని కెసిఆర్(KCR) చాంబర్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఉత్తంకుమార్ రెడ్డికి రెండేళ్లయిన ప్రాజెక్టులపై అవగాహన రాలేదు అన్నారు. ఉత్తముకు రేవంత్ రెడ్డి గాలి సోకిందని.. అబద్దాలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఉత్తం బయటపెట్టిన టిఆర్ఎస్ హయాంలో 2022 సంవత్సరంలో జీవో లో పాలమూరుకు 90 టీఎంసీలు స్పష్టంగా ఉందన్నారు. 45 టీఎంసీలకు తగ్గించారా లేదా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
మీరు పాలమూరు ద్రోహులు
ప్రాజెక్టు డీపీఆర్ వెనక్కి వచ్చి ఏడాదైనా ఎందుకు పట్టించుకోలేదని.. ఈరోజుకు కూడా పంపలేదని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకు 7 అనుమతులు తీసుకొచ్చామని.. రెండేళ్లలో ఒక్క అనుమతి తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుపై గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉత్తం నాయకత్వం లోనే కేసులు వేశారని.. మీరు పాలమూరు ద్రోహులు అని మండిపడ్డారు. ప్రాజెక్టు పనులు ఆగకూడదని తాగునీటి పనుల పేరిట పనులు కొనసాగించామని వెల్లడించారు. 90 టీఎంసీలకు డిపిఆర్ ఇచ్చి ఏడు అనుమతులు తీసుకొచ్చామని.. రెండు టీఎంసీల కోసం రెండు టన్నెల్లు మేమే తవ్వాం, పనులు చేశాం ఈ విషయంలో ఉత్తమ్ కు సవాల్ చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నేతలు కేసు వేస్తే మేం స్టే ఎత్తివేయించి అనుమతులు తీసుకొచ్చాం.. కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతలకు రెండేళ్ల క్రితం కొబ్బరికాయ కొట్టారు, డీపీఆర్ ఇప్పటికి పంపలేదు అని మండిపడ్డారు. 27 వేల కోట్లు ఖర్చు పెట్టాం, 20వేల ఎకరాల భూమి సేకరించాం అరే స్పష్టం చేశారు. కోర్టుల్లో కేసులు వేసి పాలమూరుకు ద్రోహం చేసింది కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.
Also Read: Sathupalli Medical Shops: సత్తుపల్లిలో అనధికార ‘సిండికేట్’ దందా!.. రెచ్చిపోతున్న మాఫియా..!
ఎస్సెల్బీసీ సొరంగం
1985 లో కల్వకుర్తికి కొబ్బరికాయ కొట్టారు.. 2014 వరకు కాంగ్రెస్(Congress), టిడిపి(TDP) ప్రభుత్వాలు ఇచ్చింది 13 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇచ్చారన్నారు. మేము అధికారంలోకి వచ్చాక తొమ్మిదిన్నర ఏళ్లలో 3.7 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని వెల్లడించారు. కల్వకుర్తిపై 2600 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఎస్సెల్బీసీ సొరంగం బీఆర్ఎస్ హయాంలో 11 కిలోమీటర్లకు పైగా తోవ్వమని.. రెండేళ్లలో కాంగ్రెస్ 200 మీటర్లు మాత్రమే తవ్వింది అన్నారు. నెమ్మది చేయాలని చెబితే.. ఇన్ని పనులు ఎలా జరుగుతాయని నిలదీశారు. ఎస్ ఎల్ బి సి(SLBC) పై 1900 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పెండ్లిపాకల డిండి ప్రాజెక్టులను 3800 కోట్లతో నిర్మించామని.. కానీ కాంగ్రెస్ వాడిని బొందపెట్టిందన్నారు. కాలువలు తవ్వింది.. రిజర్వాయర్లు నిర్మించింది టిఆర్ఎస్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు.
15 రోజులు పాటు..
రెండేళ్లలో కిలోమీటర్ పొడవు ఉన్న లింక్ కెనాల్ ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేదు.. ఆ కెనాల్ ను తవ్వితే నాలుగు రిజర్వాయర్లకు నీరు అందేనన్నారు. పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని.. పాలమూరుకు బీఆర్ఎస్ ఏం చేసిందో దీంతో అర్థం అవుతోంది.. ఎవరికి పాలమూరు పై ప్రేమ ఉన్నట్లు తెలుస్తుందన్నారు. అసెంబ్లీని 15 రోజులు పాటు నిర్వహించాలని బిఏసి(BAC) సమావేశంలో కోరామన్నారు. 15 అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశామని.. ప్రశ్నోత్తరాల సమయం పెట్టాలని, ఎజెండా కాపులు ముందుగా ఇవ్వాలని.. శాసనసభ్యులకు ప్రోటోకాల్ పాటించాలని కోరినట్లు తెలిపారు.
Also Read: Viral News: కుక్క కాటుకు చనిపోయిన గేదె.. ఆస్పత్రికి పరుగులు పెట్టిన జనం, ఎందుకంటే?

