Drug Peddlers Arrested: ఎన్డీపీఎల్ మద్యం సీజ్ చేసిన పోలీసులు
Drug Peddlers Arrested (imagecredit:twitter)
క్రైమ్

Drug Peddlers Arrested: బెంగళూరు నుండి హైదరాబాద్ డ్రగ్స్.. ఎన్డీపీఎల్ మద్యం సీజ్ చేసిన పోలీసులు

Drug Peddlers Arrested: బెంగళూరు నుంచి విమానంలో డ్రగ్స్ తోపాటు నాన్ డ్యూటీ పెయిడ్​ లిక్కర్ తీసుకొచ్చిన వ్యక్తిని ఎక్సయిజ్​ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి 5.39 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్​ తోపాటు ఆరు బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. న్యూ ఇయర్ వేడుకలు సమీపించిన నేపథ్యంలో కొందరు పెడ్లర్లు బెంగళూరు నుంచి డ్రగ్స్ తోపాటు నాన్​ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్లు తీసుకొస్తున్నట్టుగా ఎక్సయిజ్ స్టేట్ టాస్క్​ ఫోర్స్​ పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో బీ టీం ఎస్​ఐ బాలరాజు సిబ్బందితో కలిసి ఎయిర్ పోర్టు వద్ద నిఘా పెట్టారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్ తోపాటు మద్యం బాటిళ్లు తెచ్చిన సాయిచరణ్ అనే వ్యక్తి కారులో వెళుతుండగా అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మాదక ద్రవ్యాలు, మద్యం సీజ్​ చేసి కేసులు నమోదు చేశారు. నిందితున్ని తదుపరి దర్యాప్తు నిమిత్తం శంషాబాద్ ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు.

ఒడిషా నుంచి గంజాయి..

గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు అందిన సమాచారంతో దాడులు జరిపిన ఎక్సయిజ్​ స్టేట్ టాస్క్​ ఫోర్స్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 6.300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిషాకు చెందిన జగన్నాథ్​, సరోజ్​ జలారి, బెహన్​ దూరే అనే వ్యక్తులు కొత్త సంవత్సరం సందర్భంగా ఉన్న డిమాండ్​ ను క్యాష్ చేసుకునేందుకు గంజాయితో హైదరాబాద్ వచ్చారు. సరూర్​ నగర్​ హుడా కాలనీలోని రాఘవేంద్ర భవన్​ వద్ద దానిని అమ్ముతుండగా సమాచారం తెలిసి సీ టీం సీఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Also Read: Kichcha Sudeepa: ఇతర ఇండస్ట్రీ స్టార్స్‌పై సుదీప్ సంచలన వ్యాఖ్యలు

నానక్ రాంగూడలో..

ఎక్సయిజ్ డిస్ట్రిక్ట్ టాస్క్​ ఫోర్స్​ సీఐ పవన్​ కుమార్, ఎస్​ఐ శ్రీకాంత్ రెడ్డితోపాటు సిబ్బందితో కలిసి నానక్ రాంగూడలో గంజాయి అమ్ముతున్న అస్సాం రాష్ట్రానికి చెందిన దిలీప్​ ను అరెస్ట్ చేసి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్కనారు. నిందితునిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం శేరిలింగంపల్లి పోలీసులకు అప్పగించారు.

మద్యం బాటిళ్లు సీజ్​..

ఇతర రాష్ట్రాల నుంచి నాన్​ డ్యూటీ పెయిడ్​ మద్యం బాటిళ్లను తీసుకు వచ్చిన ఇద్దరిని రంగారెడ్డి జిల్లా ఎక్సయిజ్ ఎన్​ ఫోర్స్​ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 64 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ​నిందితులకు నోటీసులు జారీ చేశారు. సీజ్​ చేసిన మద్యం బాటిళ్లను మీర్​ పేట ఎక్సయిజ్​ పోలీస్​ స్టేషన్ లో అప్పగించారు.

Also Read: Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..!

Just In

01

Jagapathi Babu: షాకింగ్ లుక్‌లో జగపతిబాబు.. ‘పెద్ది’ పోస్టర్ వైరల్!

iPhone 16: తక్కువ ధరకే iPhone 16 కొనుగోలు చేసే ఛాన్స్

POCSO Act Case: మైనర్‌పై అత్యాచారం కేసులో మేడ్చల్ కోర్టు కీలక తీర్పు

SP Dr P Shabarish: అల్లర్లు తగ్గాయి.. అత్యాచారాలు, హత్యలు పెరిగాయ్.. మహబూబాబాద్ క్రైమ్ రిపోర్ట్

Remand Prisoner Died: సబ్‌జైలులో రిమాండ్ ఖైదీ మృతి.. కారణం ఏంటంటే?