Bhatti Vikramarka: అక్రిడేషన్ల జీవో 252 ను సవరించేందుకు చర్యలు
Bhatti Vikramarka (imagecredit:swetcha)
ఖమ్మం

Bhatti Vikramarka: అక్రిడేషన్ల జీవో 252 ను సవరించేందుకు తక్షణ చర్యలు: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశంలో సుదీర్ఘ సమాలోచన అవసరమని, అర్బన్ లిమిట్ లోని ఐదు కిలోమీటర్ల వ్యవధిలో ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు వేసుల బాటు లేదని, బిలో పవర్టి కింద ఇళ్ల స్థలాలు ఇచ్చే అవసరం ప్రభుత్వం పరిశీలిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) స్పష్టం చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (టీజేఎఫ్) జర్నలిస్టుల బృందం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు వినతి పత్రం అందించారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ల కార్డులు గతం మాదిరిగా అర్హులైన వారందరికీ అందివ్వాలని, 252 జీవోను సవరించాలని, వర్కింగ్ జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులకు ఒకే విధమైన కార్డులను అర్హులైన వారందరికీ అందివ్వాలని, కార్డుల జారీలో కోత విధించే జీవోను తక్షణమే సవరణ చేయాలని, అదేవిధంగా జర్నలిస్టుల చిరకాల వాంఛ అయినా ఇళ్ల స్థలాల పంపిణీ అంశంపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల బృందం విజ్ఞప్తి చేసింది.

Also Read: Indian Army Alert: జమ్మూ కశ్మీర్‌లో యాక్టివ్ అయిన 30 మంది ఉగ్రవాదులు.. ఇంటెలిజెన్స్ బిగ్ అలర్ట్

ఇళ్ల స్థలాలు అంశంలో..

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందిస్తూ.. జర్నలిస్టులకు అక్రిడేషన్ల కార్డులు జారీ చేసే అంశంలో ఎటువంటి భేదాభిప్రాయాలు ఉంటే వాటిని పరిగణలోకి తీసుకొని సవరణ చేస్తామని, జీవో 252 వల్ల జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని భావిస్తే వాటిపై తక్షణ చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు అంశంలో సమాలోచన అవసరమని, అర్బన్ లిమిట్ లోని ఐదు కిలోమీటర్ల పరిధిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అవకాశం లేదని, బిలో పవర్టి కింద ఇళ్ల స్థలాలు కావాలంటే పరిశీలిస్తామని ఆయన స్పష్టం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను క్రోడీకరించి, సొసైటీ ద్వారా ఇవ్వాలనే ప్రతిపాదన పై మరింత న్యాయ నిపుణులతో సుదీర్ఘ అభిప్రాయ సేకరణ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమ ప్రభుత్వం బిలో ప్రాపర్టీ కింద ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశంలో పరిశీలిస్తామని అన్నారు.

వివిధ నాయకులు..

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే టి జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, వనం నాగయ్య, ప్రశాంత్ రెడ్డి, దుంపల భాస్కర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, శెట్టి రజినీకాంత్, కె .హరీష్, మందుల ఉపేందర్, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, నాయకులు కళ్యాణ్, సాయి పాల్గొన్నారు.

Also Read: KTR Praises PJR: పీజేఆర్‌పై కేటీఆర్ ప్రశంసలు.. ఏమన్నారంటే?

Just In

01

Panchayat Grants: తెలంగాణ గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. సీఎం కీలక ప్రకటన

Helicopter Crash: అమెరికాలో ఘోర ప్రమాదం.. గాల్లో హెలికాప్టర్లు ఢీకొని ఒకరు మృతి..!

Illegal Sand Mining: మసక మసక చీకట్లో అక్రమ ఇసుక రవాణా.. రాత్రి అయిందంటే రయ్ రయ్!

Hanumakonda District: వికలాంగ కుమారుడి వేదన తట్టుకోలేని గుండేడ్ గ్రామం.. ఏం చేశారో తెలుసా..!

Maoist Ganesh: స్వగ్రామానికి చేరిన మావోయిస్టు అగ్రనేత గణేష్ మృతదేహం.. గ్రామంలో హైటెన్షన్!