MLA Rajesh Reddy: కాంగ్రెస్ పార్టీనే‌ దేశానికి రక్ష!
MLA Rajesh Reddy (imagecredit:swetcha)
మహబూబ్ నగర్

MLA Rajesh Reddy: కాంగ్రెస్ పార్టీనే‌ దేశానికి రక్ష: ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి

MLA Rajesh Reddy: కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశానికి స్వాతంత్రం వచ్చిందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి(MLA Rajesh Reddy) అన్నారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వల్లే పేదల బ్రతుకులు బాగుపడతాయని తెలిపారు.

Also Read: Motorola: భారత మార్కెట్‌కు మోటరోలా ‘సిగ్నేచర్’ సిరీస్..

అనేక పథకాలు అమలు

దేశంలో 141 సంవత్సరాల పాటు ప్రజల ఆదరణ పొందుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్(Congress) అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలిపారన్నారు. రాబోయే మున్సిపల్(Muncipal), ఎంపీటీసి(MPTC), జెడ్పీటీసీ(ZPTC) ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ విధానాలను, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల మధ్య విద్వేషాలు రాజేస్తున్న బిజెపి పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Also Read: Nara Bhuvaneshwari: కార్యకర్తల పిల్లలకు చదువు చెప్పేందుకు విద్యా సంస్థలు: నారా భువనేశ్వరి

Just In

01

Home Remedies: కడుపు నొప్పితో బాధపడుతున్నారా.. అయితే, ఈ సహజ చిట్కాలతో చెక్ పెట్టేయండి!

Adulterated liquor: ఖాకీ ముసుగులో కల్తీ మద్యం వ్యాపారం… కాపాడే ప్రయత్నాలు?

Rare Frame: సల్మాన్ 60వ బర్త్‌డే బాస్‌లో దిగ్గజాలు.. ఫొటో వైరల్!

Bhatti Vikramarka: మధిర నుంచే దేశానికి దిశా నిర్దేశం.. డిప్యూటీ సీఎం భట్టి హామీ

Instagram: యూఎస్‌లో ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం