Hydraa: ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువుకు ప్రాణం పోసిన హైడ్రా..!
Hydraa (imagecredit:swetcha)
హైదరాబాద్

Hydraa: ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువుకు ప్రాణం పోసిన హైడ్రా.. ఆనందంలో స్థానికులు

Hydraa: స‌క‌ల జీవ‌కోటికి ప్రాణాధారంగా నిలిచి, నేడు ఆనవాళ్లు కోల్పోయే దశలో ఉన్న ప్రగతి నగర్ అంబీర్ చెరువుకు హైడ్రా ప్రాణం పోసింది. పునరుద్దరించేందుకు సిద్దమైంది. న‌గ‌రీక‌ర‌ణ‌లో ప‌రిస‌రాల‌న్నీ కాంక్రీట్ జంగిల్‌గా మారిపోగా, ప్రస్తుం అంబీర్ చెరువు వ్య‌ర్థాల‌కు నిల‌యంగా మారింది. చికెన్, మాంసం, చేప‌ల‌ వ్య‌ర్థాలతో దుర్గంధ‌భ‌రితమైంది. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స‌హ‌జ‌త్వాన్ని కోల్పోయిన చెరువుకు పున‌రుజ్జీవం ఇవ్వాల‌ని స్థానికులు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ని కోరారు. ఫ‌ర్ ఎ బెట‌ర్ సొసైటీ ప్ర‌తినిధులు కూడా ఇందులో ఉన్నారు. ప్ర‌జావాణిలో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో స్పందించిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు వెంట‌నే అక్క‌డ ప‌రిస్థితిని ప‌రిశీలించి రంగంలోకి దిగింది హైడ్రా. ముందుగా చెత్త వేయ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంది. చికెన్ వ్య‌ర్థాలు వేయ‌డానికి వ‌చ్చిన 4 వాహ‌నాల‌ను హైడ్రా ప‌ట్టుకుంది. చెత్త‌ను తొల‌గించే ప‌నుల‌ను పెద్ద‌ఉఎత్తున చేప‌ట్టింది.

సెల‌వుల్లోనూ కొనసాగిన పనులు

క్రిస్మ‌స్ ప‌డంగ‌తో పాటు వారాంతప సెల‌వులున్నా హైడ్రా ప‌నులు కొన‌సాగిస్తుంది. వీలైనంత త్వరగా చెరువుకు పునరుజ్జీవం పోసి, మళ్లీ ఆహ్లదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకుంది. 5 నుంచి 6 లారీలు, 3 జేసీబీల‌తో చెత్త‌ను తొల‌గిస్తోంది. ఆప‌రేష‌న్ అంబీర్ చెరువు ను నిర్వహించి, విజయవంతంగా ముందుకెళ్తుంది. శ‌నివారం వ‌ర‌కూ 104 లారీల చెత్త‌ను తరలించినట్లు హైడ్రా వెల్లడించింది. చెరువు ఒడ్డున గుట్ట‌లుగా చెత్త పేరుకుపోయింద‌ని, మ‌రో వంద లారీలకు పైగా ఉంటుంద‌ని అక్క‌డ ప‌నులు చేప‌ట్టిన అధికారులు చెబుతున్నారు. కూక‌ట్‌ప‌ల్లి – ప్ర‌గ‌తిన‌గ‌ర్‌ల‌ను క‌లుపుతూ ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువు మ‌ధ్య‌లోంచి వేసిన రోడ్డుకు ఇరువైపులా పూర్తిగా చెత్త‌ను తొల‌గించాల్సి ఉంద‌ని తెలిపారు. ఇక్క‌డ చిరు వ్యాపారుల‌తో మాట్లాడి ప్ర‌త్యామ్నాయ స్థ‌లంలో అమ్మ‌కాలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల‌తో స‌మ‌న్వ‌యంతో ప‌ని చేస్తున్నారు. చెత్త‌ను పూర్తిగా తొల‌గించి ఫెన్సింగ్ వేయాల‌ని హైడ్రా నిర్ణ‌యించింది.

Also Read: GHMC Mega Budget: మెగా బడ్జెట్‌కు రూపకల్పన చేసిన జీహెచ్ఎంసీ.. ఎంతో తెలుసా?

హైడ్రాకు సహకరిస్తున్నస్థానికులు

ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువు ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని అనుభ‌వించిన స్థానికులు సైతం మళ్లీ ఆ వాతావరణాన్ని నెలకొల్పాని భావిస్తున్న హైడ్రాకు సహకరించేందుకు ముందుకొచ్చారు. చెరువులోనుంచి వెళ్లే ప్ర‌ధాన ర‌హ‌దారికి ఇరువైపుల ఉన్న చిరు వ్యాపారుల‌కు ప్ర‌త్యామ్నాయం స్థ‌లం చూపించాల‌ని కోరుతున్నారు. ఈ మేర‌కు జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. ఇందుకు త‌మ స‌హ‌కారం ఉంటుంద‌ని చెబుతున్నారు. త‌ర్వాత చెత్త వేయ‌డానికి వీల్లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నారు. ప్ర‌గ‌తిన‌గ‌ర్‌, నిజాంపేట్‌, కూక‌ట్‌ప‌ల్లి ప్రాంతాల నుంచి వ‌చ్చే మురుగు నీరు ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువులోకి చేర‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఎస్టీపీ (సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాట్ల‌)ల‌తో చెరువుకు మంచినీరు చేరేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.

Also Read: Bigg Boss Sanjana: నా ప్రమేయం లేకుండా ఓ ఘటన.. బిగ్‌బాస్ టాప్-5 ఫైనలిస్ట్ సంజనా ప్రెస్‌మీట్

Just In

01

Chiranjeevi Anil: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి మరో పోస్టర్ రిలీజ్.. ఇంకా పదిహేను రోజులే..

Daseoju Sravan: ట్యాక్సీల పేరుతో రియల్ ఎస్టేట్ రంగం నాశనం: దాసోజు శ్రవణ్

Gold Rates Today: తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Telangana BJP: బీజేపీలో పూర్తిస్థాయి కమిటీల నియామకమెప్పుడు?.. నిరాశలో క్యాడర్!

Dhruv Rathee: యూట్యూబర్ ధృవ్ రాఠీ వీడియోలో జాన్వీ కపూర్ ఫోటో.. సోషల్ మీడియా వార్..