Water Projects: నీటి ప్రాజెక్టులపై ఎత్తుకు పైఎత్తు వేస్తున్న పార్టీలు!
Water Projects (imagecredit:twitter)
Telangana News

Water Projects: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. నీటి ప్రాజెక్టులపై ఎత్తుకు పైఎత్తు వేస్తున్న పార్టీలు!

Water Projects: అసెంబ్లీ సాక్షిగా అధికార కాంగ్రెస్(Congress) పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్(BRS) మధ్య వాటర్ వార్ జరగనుంది. అందుకు రెండు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులు.. కృష్ణ, గోదావరి జలాల్లో తెలంగాణ(Telangana)కు రావలసిన వాటా.. ఆ రెండు పార్టీలు చేసిన చేస్తున్న అంశాలపై వివరించబోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను గులాబీ ఎండగట్టేందుకు.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ అసెంబ్లీలో ఎండగట్టేందుకు ఎవరికి వారుగా సన్నద్ధమవుతున్నారు. ఎత్తుకు పైఎత్తులు ఎలా వేయాలని దానిపై ముమ్మర కసరత్తు ప్రారంభించాయి. అసెంబ్లీ సమావేశం రసవత్తరంగా కొనసాగబోతున్నాయి.

లక్ష కోట్లతో కట్టిన కాలేశ్వరం

అసెంబ్లీ సమావేశాలు ఈనెల 29 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా నీటి ప్రాజెక్టులు, కృష్ణ(Krishna), గోదావరి(Godhavari) జలాల్లో తెలంగాణకు రావలసిన వాటా పై ప్రధానంగా చర్చించనున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 నవంబరు వరకు నీటి ప్రాజెక్టులపై అనుసరించిన విధానం.. నీటి కేటాయింపులు.. వెచ్చించిన నిధులు.. తెలంగాణకు జరిగిన అన్యాయంపై వివరించ బోతున్నారు. లక్ష కోట్లతో కట్టిన కాలేశ్వరం డిపిఆర్ నుంచి మేడిగడ్డ బ్యారేజీ లోని పిల్లర్లు కొంగుబాటు.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం.. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల సాగర్, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు తదితర ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీయనున్నట్లు సమాచారం.

కేసీఆర్ చేసుకున్న ఒప్పందాలు

అదేవిధంగా కృష్ణ జలాల్లో తెలంగాణకు రావలసిన వాటా పై అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ సంతకాలు పెట్టారని.. తెలంగాణకు 299 టీఎంసీలు.. ఏపీకి 512 టీఎంసీలు కు ఒప్పుకొని తెలంగాణకు అన్యాయం చేశారని.. అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్లు అడగలేదని.. దిండి ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిలసాగర్ సైతం నీటి కేటాయింపులపై కృష్ణ టివి నెలలో సైతం అడగలేదని.. నాడు కేసీఆర్ చేసుకున్న ఒప్పందాలు.. తెలంగాణకు జరిగిన అన్యాయం.. ఏపీకి ఎలా సహకరించారు అనే అంశాలను ఆధారాలతో సహా వివరించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అందులో భాగంగానే జనవరి 2, 3 తేదీల్లో కృష్ణ గోదావరి జలాలపై తెలంగాణకు రావలసిన వాటా పై అసెంబ్లీలో చర్చించబోతున్నట్లు సమాచారం. అసెంబ్లీ సాక్షిగా టిఆర్ఎస్ తప్పిదాలను ఎండగట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. 10 ఏళ్లలో తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా కేసీఆర్ నిర్మించలేదని.. నిర్మించిన కాలేశ్వరం ఏడాదిలోపే కుప్పకూలిందని.. ప్రజలపై ఆర్థిక భారం మోపిందని ఇప్పటికే ప్రభుత్వ విమర్శలు చేస్తుంది. తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు అంశాన్ని సైతం ప్రధానంగా చర్చించాలని భావిస్తున్నట్లు తెలిసింది. బి ఆర్ ఎస్ ను నిలదీసేందుకు అస్త్ర శాస్త్రాలు సిద్ధం చేస్తుంది.

Also Read: Kalvakuntla Kavitha: కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ.. పాలమూరు – రంగారెడ్డిపై పెట్టలే.. బీఆర్ఎస్‌పై కవిత ఫైర్

పాలమూరుకు అన్యాయం

బీఆర్ఎస్ పార్టీ సైతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని.. రెండేళ్ల పాలనలో ఒక ప్రాజెక్టు నిర్మించలేదని, పెండింగ్ ప్రాజెక్టులు సైతం పూర్తి చేయలేదని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టేందుకు సిద్ధమవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టాడు మట్టి తీయలేదని.. 90 శాతం పనులు పూర్తి చేసిన 10% పనులు కూడా చేయలేకపోయిందని.. కాలువలు నిర్మించలేకపోయిందని పాలమూరుకు అన్యాయం చేస్తుందని.. ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంతో పాలమూరు నల్గొండ రంగారెడ్డి జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని అసెంబ్లీ సాక్షిగా నిలదీయాలని భావిస్తుంది. ఎస్ ఎల్ బి సి పనులు చేపట్టడంలోనూ నిర్లక్ష్యం చేస్తుందని.. పెండింగ్ ప్రాజెక్టులు డిండి, కల్వకుర్తి నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులను సైతం పూర్తి చేయలేదని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కు ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తుందని వ్యవహరించబోతున్నారు.

కృష్ణ నీటిలో అతి తక్కువ..

అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు డిపిఆర్ ను కేంద్రం వెనక్కి పంపించిన తిరిగి పంపలేదని.. ఈ ప్రాజెక్టుకు 90 టీఎంసీలు రావాల్సి ఉన్నప్పటికీ.. 45 టీఎంసీలకే మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లేఖ రాశారని ఆ లేఖను సైతం అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టబోతున్నారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం పోలవరం నల్లమల్ల సాగర్ కు నీటిని తరలించకపోతున్న అడ్డుకోవడం లేదని.. అదేవిధంగా సాగర్ ఎడమ కాలవ నుంచి నీటిని తరలించకపోతున్న.. అధికంగా వాడుకుంటున్న అడ్డుకోవడం లేదని.. ఇప్పటికీ సాగర్ ను తెలంగాణ ఆధీనంలోకి తీసుకు రాలేకపోయారని… కృష్ణ నీటిలో అతి తక్కువగా 28 టీఎంసీలు వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది అని.. ఒకవైపు కృష్ణ జలాల్లో రావలసిన వాటాపై కొట్లాడం లేదని.. మరోవైపు గోదావరి జిల్లాలో సైతం అన్యాయం చేస్తుందని ఎండగట్టనున్నారు.

Also Read: Ponguleti Srinivasa Reddy: అవినీతి లేని పాలనే లక్ష్యం.. అభివృద్ధిలో దూసుకుపోతాం.. మంత్రి పొంగులేటి

మిషన్ కాకతీయ

కాలేశ్వరం ప్రాజెక్టు పై పదేపదే చేస్తున్న ఆరోపణలు తిప్పి కొట్టాలని.. మేడిగడ్డ పిల్లర్ మరమతు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని అందుకు సంబంధించిన వివరాలను అసెంబ్లీలో వివరించేందుకు సన్నద్ధమవుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ పోరుబాటతోనే కాంగ్రెస్లో చలనం వస్తుందని విమర్శనాస్త్రాలు సందించబోతున్నారు. అదేవిధంగా పదేళ్లలో కృష్ణ గోదావరి జిల్లాలపై కేసీఆర్ కొట్లాడిన తీరు.. ట్రిబ్యునల్ లో చేసిన వాదనలు.. సాధించిన విజయాలు.. కాలేశ్వరం తో ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చింది.. మిషన్ కాకతీయ తో భూగర్భ జలాల పెంపు.. చెరువుల మరమ్మతు తదితర అంశాలను సైతం వివరించబోతున్నారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అన్యాయం.. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ రెండేళ్లలో తెలంగాణకు చేసిన అన్యాయాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అసెంబ్లీలో అనుసరించాల్సిన అంశాల పైన గులాబీ నేతలకు దిశ నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలపై కాంప్రమైజ్ కావద్దని సూచించారు.

కౌంటర్ ఇచ్చేలా..

ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై అనుసరించాల్సిన అంశాలపై అధికార కాంగ్రెస్ పార్టీ జనవరి 1న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పార్టీ ప్రజాప్రతినిధులకు ఇస్తుంది. అసెంబ్లీలో టిఆర్ఎస్ నేతలు మాట్లాడే ప్రతి అంశానికి కౌంటర్ ఇచ్చేలా సంసిద్ధులను చేస్తున్నారు. అసెంబ్లీలో, అసెంబ్లీ బయట సైతం టిఆర్ఎస్ చేసే విమర్శలకు ప్రతి విమర్శలు చేసేలా నేతలకు సూచనలు ఇస్తున్నారు. ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశాలు చలికాలంలో వేడి రగిలించబోతున్నాయి. కౌంటర్ ప్రతి కౌంటర్లతో రాజకీయాలు మరింత వేడెక్కపోతున్నాయి. ఎవరు పై చేయి సాధిస్తారని ఆసక్తి ప్రజల్లో నెలకొంది.

నేడు ప్రాజెక్టులపై సీఎం సమీక్ష

రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నట్లు సమాచారం. 2014 నుంచి 2023 దాకా నీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వం అనుసరించిన విధానం, కేటాయింపులు, వెచ్చించిన నిధులు, జరిగిన నష్టంపై ఈ సమీక్షలో చర్చించనున్నారు. అధిక వడ్డీతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలు, ఈ రెండేళ్ల కాలంలో ఆ రుణభారం తీర్చడానికి ఏ మేరకు చెల్లింపులు చేయాల్సి వచ్చిందన్న దానిపైనా సమీక్షించనున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్లుగా ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులు, పనులపై కూడా చర్చించనున్నారు. పాలమూరు-రంగారెడ్డితో పాటు కృష్ణా బేసిన్‌లోని వివిధ ప్రాజెక్టుల పనులను ఏ విధంగా చేపట్టారు? రీడిజైనింగ్‌ వల్ల పనుల్లో జరిగిన జాప్యం, ప్రాజెక్టుల నిర్మాణ పనులపై చర్చించనున్నట్లు సమాచారం. అసెంబ్లీలో గత కెసిఆర్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టబోతున్నారు. అందుకు సీఎం రేవంత్ ఆస్ట్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.

Also Read: Jwala Gutta: శివాజీ వివాదంపై గుత్తా జ్వాల ఘాటు వ్యాఖ్యలు.. పోస్ట్ వైరల్!

Just In

01

Hydraa: ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువుకు ప్రాణం పోసిన హైడ్రా.. ఆనందంలో స్థానికులు

45 Movie: సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్న ‘ది 45’.. రిలీజ్ ఎప్పుడంటే?

GHMC: గాంధీ ఆస్పత్రి పరిసరాలలో దర్శనమిచ్చిన కుక్కలు.. కమిషనర్ సీరియస్!

Khudiram Bose Movie: తొలి చిత్రంతోనే దేశ చరిత్రను ఆవిష్కరించిన రాకేష్ జాగర్లమూడి.. ‘ఖుదీరాం బోస్’ ముచ్చట్లు

Nara Bhuvaneshwari: కార్యకర్తల పిల్లలకు చదువు చెప్పేందుకు విద్యా సంస్థలు: నారా భువనేశ్వరి