Jwala Gutta: శివాజీ వివాదంపై గుత్తా జ్వాల ఘాటు వ్యాఖ్యలు
Jwala Gutta and Sivaji (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Jwala Gutta: శివాజీ వివాదంపై గుత్తా జ్వాల ఘాటు వ్యాఖ్యలు.. పోస్ట్ వైరల్!

Jwala Gutta: నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో కాంట్రవర్సీ అవుతున్న శివాజీ (Sivaji) వ్యాఖ్యల ఘటనలోకి బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల (Jwala Gutta) కూడా ఎంటరైంది. సోషల్ మీడియాలో తాజాగా ఆమె చేసిన ఒక పవర్ ఫుల్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మహిళల వస్త్రధారణ, సమాజం చూసే కోణంపై ఆమె చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుత టాలీవుడ్ సినీ సర్కిల్స్‌లో నడుస్తున్న శివాజీ వివాదానికి కనెక్ట్ అవుతూ చర్చాంశనీయంగా మారాయి. ఆమె ట్వీట్‌ను సింగర్ చిన్మయి (Chinmayi) కూడా రీ పోస్ట్ చేయడంతో.. ఈ కాంట్రవర్సీలోకి ఆమె కూడా వచ్చి చేరినట్లయింది. సమాజంలో మహిళల ఉనికిని, వారి వ్యక్తిగత స్వేచ్ఛను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని బ్యాడ్మింటన్ క్వీన్ గుత్తా జ్వాల మరోసారి కుండబద్దలు కొట్టారు. మహిళలు ఏం ధరించాలి, ఎలా ఉండాలి అనే దానికంటే.. వారిని చూసే కళ్లు, వారిపై పెత్తనం చెలాయించాలనుకునే ‘మిసోజినిస్టిక్’ (మహిళా ద్వేషపూరిత) ఆలోచనలే అసలైన సమస్యని ఆమె ధ్వజమెత్తారు.

Also Read- Shekar Basha: కిలిమంజారో.. తోపు పాయింట్ లాగి, చిన్మయికి షాకిచ్చిన శేఖర్ బాషా!

సమస్య వస్త్రాల్లో లేదు.. చూసే చూపులో ఉంది!

గుత్తా జ్వాల తన ట్వీట్‌లో ఘాటైన పదజాలాన్ని ఉపయోగించారు. ‘‘సమస్య ఎప్పుడూ మహిళలు ఏం కోరుకుంటారు లేదా ఏం ధరిస్తారు అనే దానిపై లేదు.. సమస్య అంతా వారిని ఎవరు చూస్తున్నారు, ఆ చూసేవారు తమకు ఎలాంటి హక్కులు ఉన్నాయని భావిస్తున్నారు అనే దానిపైనే ఉంది’’ అని ఆమె పేర్కొన్నారు. అందం కొలమానాల నుంచి డ్రస్ ఎంపిక వరకు మహిళలను కేవలం ఒక వస్తువుగా చూస్తూ, వారిని జడ్జ్ చేసే అధికారం సమాజానికి ఎవరిచ్చారని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గుత్తా జ్వాల ట్వీట్‌ను నెటిజన్లు నటుడు శివాజీ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు లింక్ చేస్తున్నారు. శివాజీ మహిళల వస్త్రధారణ గురించి, ముఖ్యంగా పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల కలిగే ఇబ్బందుల గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. శివాజీ మాటలు ‘మహిళల స్వేచ్ఛను నియంత్రించేలా ఉన్నాయని’ ఒక వర్గం వాదిస్తుండగా, ఇప్పుడు గుత్తా జ్వాల కూడా శివాజీ కౌంటర్ ఇస్తూ ఈ పోస్ట్ చేయడంతో, ఆమె కూడా ఇప్పుడు వార్తలలో హైలెట్ అవుతున్నారు.

Also Read- Shambhala: ఆది కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘శంబాల’.. ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ వదిలారు

శరీరాలపై సమాజం పోలీసింగ్ చేయకూడదు

‘ఎవరి అనుమతి లేకుండా, ఎవరికీ వివరణ ఇచ్చుకోకుండా, క్షమాపణలు చెప్పకుండా మేం పోరాడుతున్న సమానత్వం ఇదే!’ అంటూ జ్వాల ఇచ్చిన పిలుపు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ పోస్ట్‌ని నిశితంగా పరిశీలిస్తే.. మహిళలను వస్తువులుగా చూడటం ఆపాలని, వారి శరీరాలపై సమాజం పోలీసింగ్ చేయకూడదని జ్వాల హెచ్చరించారు. ఒక పురుషుడికి తన జీవితంపై ఎంత హక్కు ఉంటుందో, ఒక మహిళకు కూడా అంతే హక్కు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. సంప్రదాయం లేదా పద్ధతి అనే పేరుతో మహిళల ఎంపికలను నియంత్రించడం.. ధ్వేషించడం కిందకే వస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. శివాజీ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న తరుణంలో, గుత్తా జ్వాల వంటి సెలబ్రిటీలు గొంతు విప్పడం ఈ వివాదానికి మరింత బలాన్ని చేకూర్చింది. మహిళల స్వేచ్ఛ అనేది వారి ప్రాథమిక హక్కు అని, దానిపై చర్చలు పెట్టడం ఆపాలని నెటిజన్లు కోరుతున్నారు. మరో వైపు శివాజీకి కూడా మద్దతు ఎక్కువవుతోంది. ఆయన మాట్లాడిన దానిలో తప్పేముందని మహిళలు కొందరు ప్రశ్నిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ugandhar Muni: ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా.. ‘శంబాల’ కథ రాశా!

Mana Shankara Varaprasad Garu: పూనకాలు లోడింగ్.. ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ డేట్ ఫిక్స్!

Jwala Gutta: శివాజీ వివాదంపై గుత్తా జ్వాల ఘాటు వ్యాఖ్యలు.. పోస్ట్ వైరల్!

Indian Railways: రైల్వేస్ కీలక నిర్ణయం… ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్!

Chamala Kiran Kumar Reddy: దమ్ముంటే కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా.. ఎంపీ చామల కేటీఆర్‌కు సవాల్!