Shambala Movie: హిందీ డబ్బింగ్‌కు సిద్ధమవుతున్న ఆది ‘శంబాల’..
sambala-hindi(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Shambala Movie: హిందీ డబ్బింగ్‌కు సిద్ధమవుతున్న ఆది ‘శంబాల’.. అక్కడ రిలీజ్ ఎప్పుడంటే?

Shambala Movie: సాయికుమార్ ఎప్పటి నుంచో కొడుకు హిట్ కోసం ఎదురు చూస్తున్నందుకు ‘శంబాల’ సినిమా మంచి ఫీస్ట్ ఇచ్చింది. ఆది సాయి కుమార్ నటించిన ‘శంబాల’ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్‌తో, హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ మిస్టికల్ థ్రిల్లర్ ప్రస్తుతం థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. డిసెంబర్ 25న విడుదలై ఈ చిత్రానికి ప్రస్తుతం అన్ని చోట్ల నుంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో జనవరి 1న హిందీలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్లు సన్నాహాలు చేస్తున్నారు.

Read also-Nagababu Comments: శివాజీ vs అనసూయ.. నాగబాబు ఎంట్రీ.. దుర్మార్గులంటూ ఫైర్

హిందీ వెర్షన్ ప్రస్తుతం సెన్సార్ సర్టిఫికేషన్ కోసం వేచి ఉందని నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు తెలిపారు. ఇక హిందీలో ‘శంబాల’ రిలీజ్ అవుతోంది. అక్కడ మన ‘శంబాల’ ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూన ‘శంబాల’ దూసుకుపొతోంది. ఇక అంతే కాకుండా ‘శంబాల’కి ప్రీమియర్లు, డే వన్, రెండో రోజు ఇలా అన్నీ కలిపి చూస్తే మొత్తంగా రూ.5.4 కోట్ల గ్రాస్‌ వచ్చాయి. ఇది ఇప్పటివరకు ఆది సాయికుమార్ కెరీర్‌లో అతిపెద్ద ఓపెనింగ్‌ ఇచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు.

Read also-Sandhya Theatre Case: ఛార్జ్‌షీట్‌లో అల్లు అర్జున్ పేరు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం

‘శంబాల’కి పెరుగుతున్న మౌత్ టాక్‌తో మెల్లిగా కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రీమియర్ల నుంచి మెల్లిగా మొదలైన పాజిటివ్ టాక్ అలా స్ప్రెడ్ అవుతూనే ఉంది. దీంతో మొదటి రోజు, రెండో రోజు అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఇక ఈ లాంగ్ వీకెండ్‌లోనూ ‘శంబాల’ హవానే కొనసాగేలా కనిపిస్తోంది. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం అందరూ ‘శంబాల’కి క్యూ కడుతున్నారు. యగంధర్ ముని తెరకెక్కించిన తీరు, కొత్త పాయింట్‌ను టచ్ చేయడం, అన్ని రకాల అంశాల్ని జోడించి తెరకెక్కించడం కలిసి వచ్చిన అంశం. ఈ మూవీని చూసిన తరువాత విజువల్స్, ఆర్ఆర్ గురించి అందరూ అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఆది సాయికుమార్ నటన ఒకెత్తు అయితే.. టెక్నికల్ టీం చేసిన మాయాజాలం మరో ఎత్తు. ప్రస్తుతం ‘శంబాల’ హిందీ మార్కెట్‌పై కన్నేసింది. త్వరలోనే మేకర్లు ముంబైలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.

Just In

01

Bigg Boss Sanjana: నా ప్రమేయం లేకుండా ఓ ఘటన.. బిగ్‌బాస్ టాప్-5 ఫైనలిస్ట్ సంజనా ప్రెస్‌మీట్

DGP Shivadhar Reddy: సీఐ, ఎస్‌ఐలపై డీజీపీ శివధర్ రెడ్డి ఫుల్ సీరియస్.. అలా చేస్తే వేటు!

GHMC Mega Budget: మెగా బడ్జెట్‌కు రూపకల్పన చేసిన జీహెచ్ఎంసీ.. ఎంతో తెలుసా?

Wine Shop Owner: వైన్స్ షాప్ యజమాని ఇంట్లో నకిలీ మద్యం బాటిళ్లు… అంతా షాక్

Jagan Fans: నడిరోడ్డుపై జగన్ ఫ్యాన్స్‌కు పోలీసుల స్ట్రాంగ్ ట్రీట్‌మెంట్‌