Nagababu Comments: దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ, శ్రీ రెడ్డి, తదితరులు తమదైన శైలిలో స్పందించారు. తాజాగా ఇదే అంశంపై నాగ బాబు కూడా ఆయన గళం వినిపించారు. ఆయన స్పందిస్తూ.. మహిళలు వేసుకునే దుస్తుల గురించి మగవారు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ హక్కు రాజ్యాంగం మనకు ఇవ్వలేదు. అది వారి వ్యక్తిగతం.. అంటూ ఫైర్ అయ్యారు. అదే సందర్భంలో నేను మాట్లాడుతున్నది శివాజీని టార్గెట్ చేసి అయితే కాదు. ఎందుకంటే సమాజంలో పెరుగుతున్న ఓ రుగ్మత గురించి మాట్లాడుతున్నా.. మగ అహంకార సమాజంలో మనం బతుకుతున్నాము. మహిళలు ఏ బట్టలు వేసుకున్నా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం బట్టలు మాత్రమే కారణం అనేది ఒక మిధ్ మాత్రమే అంటూ మండిపడ్డారు.
Read also-Shivaji Controversy: తొడలు కనబడుతున్నాయనే.. నన్ను చూస్తున్నారు.. శివాజీ వివాదంపై శ్రీరెడ్డి కౌంటర్
భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో వ్యక్తుల స్వేచ్ఛకు రాజ్యాంగం అత్యున్నత ప్రాధాన్యతనిచ్చింది. మహిళల వస్త్రధారణ ‘మోరల్ పోలీసింగ్’ (నైతిక పోలీసింగ్) పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా నటుడు శివాజీ గతంలో మహిళల దుస్తుల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ, వస్త్రధారణ అనేది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో కొందరు వ్యక్తులు తామే నీతి నియమాలకు కాపలాదారులుగా భావించి, ఇతరుల ప్రవర్తనను లేదా దుస్తులను నియంత్రించడానికి ప్రయత్నించడాన్నే ‘మోరల్ పోలీసింగ్’ అంటారు. నాగబాబు తన ప్రసంగంలో ఈ ధోరణిని తీవ్రంగా ఖండించారు. భారత రాజ్యాంగం ప్రకారం, ఏ వ్యక్తి కూడా మరొకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే అధికారం లేదు. గౌరవం అనేది చూసే చూపులో ఉండాలి తప్ప, ధరించే బట్టల్లో కాదని ఆయన బలంగా వినిపించారు.
భారత సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో వస్త్రధారణ స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా గుర్తించింది.
ఆర్టికల్ 14: చట్టం ముందు అందరూ సమానులే. కేవలం లింగం లేదా వస్త్రధారణ ఆధారంగా ఎవరినీ తక్కువ చేసి చూడటం లేదా వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధం.
ఆర్టికల్ 19: ఇది ప్రతి పౌరుడికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కల్పిస్తుంది. ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని వస్త్రధారణ ద్వారా వ్యక్తీకరించడం కూడా ఈ హక్కు పరిధిలోకి వస్తుంది.
ఆర్టికల్ 21: ఇది జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛను గ్యారెంటీ ఇస్తుంది. ప్రతి వ్యక్తి తన ఇష్టానుసారం, గౌరవప్రదంగా బతికే హక్కును కలిగి ఉంటారు. ఇందులో ‘ప్రైవసీ’ (గోప్యత) కూడా అంతర్భాగమే, అంటూ చెప్పుకొచ్చారు.
Read also-Anaganaga Oka Raju: ‘వెడ్డింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
నాగబాబు విశ్లేషణ ప్రకారం, ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అటువంటి సమయంలో వారి వస్త్రధారణను తప్పుబట్టడం లేదా దాని ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం వెనుకబడిన ఆలోచనా విధానానికి నిదర్శనం. నాగరిక సమాజంలో వ్యక్తుల ఆలోచనలు మారాలి. మహిళల పట్ల గౌరవం వారి దుస్తులను బట్టి కాకుండా, వారి వ్యక్తిత్వం ప్రతిభను బట్టి ఉండాలి. మోరల్ పోలీసింగ్ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం లేదా ఇతరులను కించపరచడం నేరమని, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను గౌరవించడమే అసలైన సామాజిక బాధ్యత అని తెలిపారు.
వస్త్రధారణ స్త్రీల వ్యక్తిగత హక్కు. Moral policing is against the Constitution.
Moral policing is unconstitutional in India. Courts have repeatedly held that it violates fundamental rights such as liberty, dignity, privacy, and equality guaranteed under Articles 14, 19, and 21… pic.twitter.com/t927DNMnNV
— Naga Babu Konidela (@NagaBabuOffl) December 27, 2025

