Ranga Reddy District: దేవాదాయ భూమిపై రియల్ కన్ను
Ranga Reddy District ( image credit: swetcha reporte)
నార్త్ తెలంగాణ, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Ranga Reddy District: దేవాదాయ భూమిపై రియల్ కన్ను.. చక్రం తిప్పిన పాత ఆర్డీవో!

Ranga Reddy District: ప్రభుత్వ భూములంటే అంగట్లో సరుకులాగా మారిపోయింది. ప్రభుత్వ భూములే కాకుండా సిలీంగ్​, భూధాన్​, దేవాదాయా, అసైన్డ్​, వక్ఫ్​ భూముల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. ఈ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తిపడి రియల్​ వ్యాపారులకు అప్పగించేందుకు ఎన్​వోసీలు, ఓఆర్సీ లు ఇస్తున్నారు. ప్రధానంగా ఇబ్రహీంపట్నం, కందుకూర్​ డివిజన్​ పరిధిలోని అసైన్డ్​, సిలీంగ్​, భూధాన్​, దేవాదాయా, వక్ఫ్​ భూములకు వందల సంఖ్యలో ఎన్​వోసీలు, ఓఆర్​సీలు ఇచ్చి రియల్​ వ్యాపారులకు అండగా నిలబడిన వైనం ఉంది. రికార్డులకు విరుద్దంగా రెవెన్యూ డివిజన్​ అధికారులు వ్యవహారించడంతో ఆ భూములను కాపాడుకోవాడానికి స్ధానిక ప్రజలు కోర్టులు, ట్రిబ్యూనల్ చూట్టు కాళ్లకు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు.


రియల్​ వ్యాపారి ప్రయోజనాల కోసమే సమాధానాలు

అయినప్పటికి రెవెన్యూ అధికారులు రికార్డుల ఆధారంగా వాధించడం పక్కకు పెట్టి కేవలం రియల్​ వ్యాపారి ప్రయోజనాల కోసమే సమాధానాలు చేప్పడం సిగ్గు చేటు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బదిలీలు అయితాయనే ధీమాతో ఇస్టానుసారంగా ఎన్​వోసీలు, ఓఆర్​సీలు రెవెన్యూ డివిజన్​ అధికారులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మాడ్గుల మండలం ఆర్కపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని దేవాదాయా భూములకు గత ఆర్డీవో ఓఆర్​సీ ఇచ్చారు. ఈ భూమిపై స్ధానిక ప్రజలు ట్రిబ్యూనల్​ కోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పటి రెవెన్యూ అదనపు కలెక్టర్​ స్పందించి తిరిగి విచారణ చేపట్టాలని ఆర్డీవోను ఆదేశించారు. అయినప్పటికి అప్పటి ఆర్డీవో తమకేమీ సంబంధం లేనట్లు నిర్లక్ష్యంగా వ్యవహారించారు. ఆ తర్వాత స్ధానికులు హైకోర్టును ఆశ్రయించారు.

Also Read: Ranga Reddy District: కార్పొరేట్ పేరుతో కోట్ల వసూళ్లు.. ప్రైవేట్ స్కూల్స్‌పై పర్యవేక్షణ ఎక్కడ?


ధరణి చట్టానికి విరుద్దంగా ఓఆర్​సీ

రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఆర్కపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్​ 88,241,242,283 సర్వే నెంబర్లలోని 33 ఎకరాల 20 గుంటల దేవాదాయా శాఖ పరిధిలోని భూమికి ఆర్డీవో వెంకటాచారీ ఓఆర్​సీ సర్టిఫికెట్ (నెం.బి/2200/2020) జారీ చేశారు. ఈ భూమి మొత్తం ఆంజనేయస్వామి దేవాలయం పరిధిలోనే ఉంది. ఈ దేవాలయంలో సేవలు చేసే పూజరులకు జీవోనాసాధికోసం మాత్రమే భూమిని ఉపయోగించుకోవాలి. కానీ ఆ భూమిపై ఏలాంటి హక్కులగానీ ఆ పూజరికి ఉండవు. ఎందుకంటే ఎప్పుడో సుమారు 45 యేండ్ల కిందటే ఆ గ్రామాన్ని వదిలేసిన పూజరి వారసులు వచ్చి ఆ భూమి తమదేనని దర్జాగా విక్రయించారు. అయితే భూ రికార్డు ప్రకారం పట్టాదారుడి కాలంలో ఆంజనేయస్వామి దేవాలయంగా కాస్తుకాలంలో అప్పటి పూజరి పేరు నమోదైయింది.

రెవెన్యూ డివిజన్​ అధికారి ఏకపక్ష నిర్ణయం

అదే క్రమంగా రికార్డుల్లో పూజరి పేరుతో కాస్తుకాలంలో వస్తున్పటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోచ్చిన ధరణి భూ చట్టం ప్రకారం యాజమానికే సర్వ హక్కులు కల్పించింది. కానీ రెవెన్యూ అధికారులు గత ప్రభుత్వం తీసుకోచ్చిన భూ హక్కు చట్టాలను కాలరాసే విధంగా ఓఆర్​సీలు జారీ చేశారు. ఏ లెక్కన చూసిన పూజరికి ఈ దేవాదాయ భూములపై ఏలాంటి హక్కులు లేవు. ఎందుకంటే ఆంజనేయ స్వామి దేవాలయం శిథిలమై యేండ్లు గడుస్తున్నప్పటికే ఆ పూజరి సేవలు మానేశాడు. ఆ తర్వాత స్ధానిక ప్రజలు కలిసి గుడి పునర్​నిర్మాణం చేసుకోని పూజలు చేయడం ప్రారంభించారు. నిత్యం జరిగే పూజ కార్యక్రమాల నిర్వహాణకు ఈ భూమని దేవాదాయ శాఖాధికారులు కౌలు కోసం వేలం వేయడం జరిగింది. అందులో భాగంగానే స్ధానిక ప్రజలు దేవాదాయ భూముల నుంచి వచ్చే ఆదాయంతో నిత్యం పూజలు చేయడం ఆనవాయితీగా మారింది. ఇలాంటి సందర్భాలను గమనించకుండా అప్పటి రెవెన్యూ డివిజన్​ అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. దీంతో స్ధానికులు ఆ దేవాదాయ భూమిని కాపాడుకోవాలని విశ్వ ప్రయాత్నలు చేస్తున్నారు.

భూములను అమ్ముకున్న పూజరి తనయులు

రెవెన్యూ రికార్డులోని కాస్తుకాలంలోనున్న పూజరి పప్పు లక్షమయ్య వారసులు పప్పు శ్రీనివాస్​ శర్మ, పప్పు సింగ్ధా శర్మలు తిరుమణి యాదయ్య గౌడ్​, సత్తూర్​ ఆంజనేయులు గౌడ్, వావళ్లదాస్ ఆనంతారామన్​ గౌడ్​, వి. వెంకన్నలకు సర్వే నెంబర్​ 88,241,242,283 సర్వే నెంబర్లలోని 33 ఎకరాల 20 గుంటల భూమిని విక్రయిస్తున్నట్లు అగ్రిమెంట్​ చేసుకున్నారు. అయితే ఎకరాకు సుమారుగా రూ.కోటి విలువైన భూమిని కేవలం రూ.కోటి 50లక్షలకే 33 ఎకరాల భూమిని అప్పగించేందుకు ఓప్పందం చేసుకున్నారు. ఆ భూమికి నిజమైన వారసులుగా చేప్పుకునే వాళ్లు ఎందుకు ఇంత తక్కువ ధరకు భూమిని విక్రయించారనే అనుమానం కలుగుతుంది. అంటే కొనుగోలు దారుడు రెవెన్యూలోని లోపాలు సరిచేసుకోని పట్టాభూమికి మార్చుకుంటానని భరోసా కల్పించడంతోనే ఈ తతంగా నడించినట్లు సమాచారం. స్ధానికుల నుంచి కొనుగోలు దారుడికి వ్యతిరేకత రావడంతో ఆందోళన చెందుతున్నారు.

స్ధానికుల పట్టుదలతో ఓఆర్​సీకే పరిమితం

దేవాలయ భూములను కాపాడుకోవాలనే స్ధానికుల సంకల్పం నెరవెరిందని చెప్పవచ్చు. గుట్టుచప్పుడు కాకుండా పూజరి వారసులు రియల్​ వ్యాపారులతో కుమ్మక్కై చేసిన కుట్రను నిలిపివేసేందుకు స్ధానిక ప్రజలు ఒక్కటైయ్యారు. అయితే అప్పటి ఆర్డీవో ఓఆర్​సీ ఇచ్చేటప్పుడు పాటించాల్సిన నియమాలను పాటించకుండా జారీ చేయడంపై విమర్శలు వచ్చాయి. నిబంధనల ప్రకారం ఓఆర్​సీ ఇచ్చేముందు స్ధానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో, ఆంజనేయ స్వామి దేవస్ధానం వద్ద ప్రజా అభిప్రాయ సేకరణ నిమ్మిత్తం నోటీసు జారీ చేయాలి. కానీ ఏలాంటి నోటీసులు జారీ చేయకుండా స్ధానికులు అభ్యంతరం తెలుపుతారని లోపాయికారిగా ఓఆర్​సీని జారీ చేశారు. అయినప్పటికి పట్టువిడని విక్రమార్కుడిలాగా గ్రామస్థులు రికార్డులో ఓఆర్​సీని అమలు చేయకుండా అడ్డుకున్నారు.

Also Read: Ranga Reddy district: పట్టాదారుడికి తెలియకుండానే భూ మార్పిడి!

Just In

01

Telangana Education: కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా సర్కారు బడి.. నాణ్యమైన విద్యే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు!

Viral Video: మెట్రోలో మహిళపై లైంగిక వేధింపులు.. వీడియో వైరల్

Highest Grossing Movies: 2025లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాలు ఇవే..

Jagga Reddy on Pawan Kalyan: సినిమాలోనే కాదు.. బయటా యాక్టింగే.. పవన్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్

Harish Rao: కాంగ్రెస్ ఉన్నంతకాలం యూరియా సమస్య తీరదా? ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్!