Jana Nayagan: మరో పాట.. నో డౌట్ ‘భగవంత్ కేసరి’ రీమేకే!
Jana Nayagan (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Jana Nayagan: మరో పాట వదిలారు.. నో డౌట్ ‘భగవంత్ కేసరి’ రీమేకే!

Jana Nayagan: దళపతి విజయ్ ఆఖరి చిత్రం కావడంతో ‘జననాయగన్’ పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా మొదటి నుంచి ‘భగవంత్ కేసరి’ చిత్రానికి రీమేక్ అనేలా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పాట కూడా ఆ విషయాన్ని తెలియజేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘చెల్లా మగలే’ (Chella Magale) అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ వదిలారు. ఈ సాంగ్ చూస్తుంటే.. ‘భగవంత్ కేసరి’ చిత్ర రీమేకే అని విషయాన్ని మరింత స్పష్టం చేసినట్లయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్‌ ఎలా ఉందంటే..

Also Read- Shekar Basha: కిలిమంజారో.. తోపు పాయింట్ లాగి, చిన్మయికి షాకిచ్చిన శేఖర్ భాషా!

తండ్రీ-కూతుళ్ల అనుబంధాన్ని చెబుతూ..

‘జననాయగన్’ సినిమా నుంచి వచ్చిన ఈ రెండో పాట ఒక మంచి మెలోడీ ట్యూన్‌తో అనిరుధ్ కంపోజ్ చేశారు. అనిరుధ్ సాధారణంగా తన హై-ఎనర్జీ బీట్స్‌తో అలరిస్తుంటాడు. ఇంకా చెప్పాలంటే ఆ బీట్స్‌కే ఆయన ఫేమస్. అలాంటిది ‘చెల్లా మగలే’ పాటలో మాత్రం ఆయనలోని సెన్సిటివ్ సంగీత దర్శకుడు కనిపిస్తాడు. ఈ పాట తండ్రీ-కూతుళ్ల మధ్య ఉండే ప్రేమను, అనుబంధాన్ని ఎంతో అందంగా తెలియజేస్తోంది. అనిరుధ్ అందించిన ట్యూన్ చాలా ప్రశాంతంగా, వినగానే మనసుకి హత్తుకునేలా ఉంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే వయోలిన్, ఫ్లూట్ వర్క్ పాటకి సోల్‌గా నిలిచాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ‘కోటి నిలవుగల్ వరుమ్ అళగే’ అంటూ మొదలయ్యే సాహిత్యం ప్రతి తండ్రి తన బిడ్డపై కురిపించే ప్రేమని తెలియజేస్తుంది. ఒక చిన్న నవ్వు నన్ను బ్రతికించేలా చేస్తోందని చెప్పే లైన్స్ ఎంతో ఎమోషనల్‌గా ఉన్నాయి.

Also Read- Srinivasa Mangapuram: ఘట్టమనేని వారసుడి సినిమా అప్డేట్ వచ్చేసింది.. ఏంటీ స్పీడూ?

బలమైన ఫ్యామిలీ సెంటిమెంట్

ఇంకా ఈ లిరికల్ వీడియోలో చూపించిన విజువల్స్ చూస్తుంటే, విజయ్ తన కూతురితో గడిపే సన్నివేశాలు చాలా నేచురల్‌గా, క్యూట్‌గా ఉన్నాయి. దళపతి మార్క్ సింప్లిసిటీ ఈ పాటకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. మరో విశేషం ఏమిటంటే.. ఈ పాటను హీరో విజయ్ పాడటం. ఆయన వాయిస్‌లోని వైవిధ్యం ఈ సెంటిమెంట్ సాంగ్‌కి చక్కగా సెట్ అయ్యింది. ముఖ్యంగా ఈ లిరిక్స్‌లో విజయ్ తన అభిమానులను పిలిచే విధానాన్ని గుర్తుచేస్తూ, భావోద్వేగానికి గురి చేసేలా ఉంది. సాధారణంగా విజయ్ సినిమాల్లో మాస్ మసాలా పాటలు, డ్యాన్స్ నంబర్లు ఎక్కువగా ఉంటాయి. కానీ హెచ్. వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఇలాంటి క్లాసిక్ మెలోడీ ఉండటం సినిమాలోని ఎమోషనల్ డెప్త్‌ని తెలియజేస్తోంది. ‘జననాయగన్’ అనేది కేవలం పొలిటికల్ యాక్షన్ డ్రామా మాత్రమే కాదు, ఇందులో బలమైన ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉందని ఈ పాట స్పష్టం చేస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ugandhar Muni: ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా.. ‘శంబాల’ కథ రాశా!

Mana Shankara Varaprasad Garu: పూనకాలు లోడింగ్.. ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ డేట్ ఫిక్స్!

Jwala Gutta: శివాజీ వివాదంపై గుత్తా జ్వాల ఘాటు వ్యాఖ్యలు.. పోస్ట్ వైరల్!

Indian Railways: రైల్వేస్ కీలక నిర్ణయం… ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్!

Chamala Kiran Kumar Reddy: దమ్ముంటే కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా.. ఎంపీ చామల కేటీఆర్‌కు సవాల్!