Hyderabad Crime: పిల్లల ముందే భార్యకు నిప్పంటించిన భర్త
Hyderabad Crime (image Source: Twitter)
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Hyderabad Crime: పిల్లల ముందే ఘోరం.. భార్యకు నిప్పంటించిన భర్త.. అడ్డొచ్చిన కూతుర్ని సైతం..

Hyderabad Crime: హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై పెట్రోల్ పోసి హతమార్చాడో భర్త. అడ్డుకున్న కూతుర్ని సైతం ఆ మంటల్లోకి హత్యాయత్నం చేశాడు. నల్లకుంట ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితుల అరుపులు విన్న స్థానికులు హుటాహుటీన వచ్చి మంటల్లో చిక్కుకున్న తల్లి, కూతుర్ని రక్షించే ప్రయత్నం చేశారు. గాయపడ్డ ఇరువురిని హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.

అసలేం జరిగిందంటే?

నల్గొండ జిల్లా హుజూరాబాద్ కి చెందిన వెంకటేష్, త్రివేణి భార్య భర్తలు. వారికి ఇద్దరు పిల్లలు, ఒక కూతురు ఉంది. హైదరాబాద్ లోని నల్లకుంట ప్రాంతంలో జీవిస్తున్న వెంకటేష్, త్రివేణి కాపురంలో గత కొన్ని రోజులుగా తరుచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యకు ఎవరితోనే అక్రమ సంబంధం ఉందని అనుమానిస్తూ భర్త వెంకటేష్ వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల పెద్ద గొడవ జరగడంతో త్రివేణి పుట్టింటికి సైతం వెళ్లింది. అయితే తాను మారిపోయానంటూ బతిమాలి మరి వెంకటేష్ తిరిగి ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు.

Also Read: BC Reservations: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీల ట్విస్ట్.. పెద్ద ప్లాన్ వేశారు..?

బిడ్డల కళ్ల ముందే ఘాతుకం

హైదరాబాద్ కు వచ్చిన కొద్దిరోజులు బాగానే ఉన్న వెంకటేష్.. ఆ తర్వాత తిరిగి వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు భార్య భర్తల మధ్య పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన వెంకటేష్.. కన్న బిడ్డల ముందే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన కూతుర్ని సైతం ఆ మంటల్లోకి నెట్టివేశాడు. దీంతో బాధితుల ఆర్తనాదాలు విని స్థానికులు పరిగెత్తుకు రాగా.. వెంకటేష్ భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. అయితే భార్య అప్పటికే మృతి చెందగా.. కూతురు స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై కోసు నమోదు చేసిన పోలీసులు.. వెంకటేష్ గంటల వ్యవధిలోనే వెంకటేష్ ను అరెస్టు చేశారు.

Also Read: Christmas Boxoffice: ఈ క్రిస్మస్ కు విడుదలైన తెలుగు సినిమాల డే వన్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?..

Just In

01

Champion Movie: కలెక్షన్ల ‘ఛాంపియన్’ మొదటి రోజు గ్రాస్ ఎంతో తెలిపిన నిర్మాతలు.. ఇది మామూలుగా లేదుగా..

Mettu Sai Kumar: రాబోయే బిగ్ బాస్ సీజన్‌లో.. హరీశ్ రావు, కేటీఆర్‌కు చోటివ్వండి.. హీరో నాగార్జునకు లేఖ

Dhurandhar Boxoffice: బాక్సాఫీస్ వద్ద ‘దురంధర్’ సునామీ.. రూ. వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన రణవీర్ సింగ్

Anasuya Viral Post: మిస్ అవుతున్నా.. స్విమ్ సూట్‌ వీడియో పెట్టి మరీ ట్రోలర్స్‌కు షాకిచ్చిన అనసూయ

Sankranti Holidays: గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు ఖరారు.. ఏకంగా 9 రోజులు హాలీడే