Crime News: కట్టుకున్న భార్య.. కడుపున పుట్టిన కొడుకును కిరాతకంగా హత్య చేసిన వ్యక్తి ఆ తరువాత గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లా కొల్లూరు ప్రాంతంలోని జేపీనగర్ లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఆడుకుంగటున్న బాలుడు
జేపీనగర్ లో నివాసముంటున్న చంద్రకళ (30), శివరాజ్ భార్యాభర్తలు. వీరి కుమారుడు రేవంత్ (14). ఇటీవలే శివరాజ్ భార్య, కుమారునితో కలిసి జేపీనగర్ వచ్చి ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. కాగా, గురువారం వీరి ఇంటి పక్కనే ఉంటున్న కుటుంబంలోని బాలుడు ఆడుకోవటానిని రేవంత్ ను పిలిచేందుకు ఇంట్లోకి వెళ్లాడు. చూడగా శివరాజ్ గొంతు నుంచి రక్తం కారుతూ కనిపించింది.
Also Read: Galaxy Watch: గెలాక్సీ వాచ్ వినియోగదారులకు శుభవార్త..
భార్య, కొడుకును చంపి..
భయపడ్డ బాలుడు పరుగున వెళ్లి ఇంట్లో వారికి విషయం చెప్పాడు. దాంతో స్థానికులు వచ్చి చూడగా శివరాజ్(Shivaraj) స్పృహ తప్పి కనిపించాడు. బెడ్ రూంలో చంద్రకళ(Chendhrakala), రేవంత్(Revanth) చనిపోయి అగుపించారు. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలియగానే కొల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. చనిపోయిన చంద్రకళ, రేవంత్ ల మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం తరలించారు. శివరాజ్ ను ఆస్పత్రిలో చేర్పించారు. శివరాజ్ తన భార్య, కొడుకును చంపి ఆ తరువాత గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని భావిస్తున్నారు. దీనికి కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read: Panchayat Election: ఖర్చులు పక్కాగా చూపాల్సిందే.. ఈ రూల్ తెలుసా?, లేదా?

