Ganja Seizure: కొత్తగూడెంలో ఆగని గంజాయి దందా.. మరో బ్యాచ్
Ganjay Smuggling (Image source X)
ఖమ్మం, లేటెస్ట్ న్యూస్

Ganja Seizure: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఆగని గంజాయి దందా.. మరో బ్యాచ్ దొరికింది

Ganja Seizure: కొత్తగూడెంలో ఆగని గంజాయి దందా

పోలీస్ అధికారులు అప్రమత్తమైన ఆగని అక్రమ రవాణా
రోజుకో విధమైన దందాతో రెచ్చిపోతున్న అక్రమార్కులు
డ్రగ్స్, గంజాయి పై ఉక్కు పాదం మోపిన కొత్త పొంతలు తొక్కుతున్న అక్రమ వ్యాపారం

ఖమ్మం క్రైమ్, స్వేచ్ఛ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమ గంజాయి దందా (Ganja Seizure) ఆగడం లేదు. అక్రమ గంజాయి రవాణాపై పోలీసులు తనిఖీలు, నాకాబంది వంటి చర్యలు చేపడుతున్నప్పటికీ అక్రమార్కులు ఆగడం లేదు. పోలీసులకు దొరకుండా కొత్త కొత్త పంథాల్లో వ్యాపారం కొనసాగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ నేతృత్వంలో గంజాయి, డ్రగ్స్‌పై కొత్త కార్యక్రమాన్ని రూపొందించి, నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అక్రమార్కుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. జిల్లాకు సంబంధించిన ఒకరిద్దరు అక్రమార్కులు ఉంటే, అటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు చెందినవారు, ఇటు జార్ఖండ్, చెన్నై ప్రాంతాలకు చెందిన గంజాయి అక్రమ వ్యాపారులు, కొత్తగూడెం మార్గం మీద నుంచే రవాణా వ్యాపారాలను కొనసాగిస్తుండడం జిల్లాలో కలకలం రేపుతోంది.

పోలీసులు అప్రమత్తమైన ఆగని గంజాయి రవాణా

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో గంజాయిని రైతులు దట్టమైన అటవీ ప్రాంతాలైన సీలేరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తుంటారు. ఈ ప్రాంతాన్ని బేస్ చేసుకొని అటు పక్కనే ఉన్న విశాఖపట్నం సమీప ప్రాంతాల్లోనూ గంజాయి పంటను రైతులు పండిస్తుంటారు. అక్కడ ఉన్న మధ్యవర్తుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా మీదుగా వివిధ రాష్ట్రాలకు తరలిస్తుంటారు. ఒకటి కాదు, రెండు కాదు క్వింటాళ్ల కొద్ది గంజాయి, కోట్ల రూపాయల విలువైన సరుకుని ఇతర ప్రాంతాలకు కొత్తగూడెం మీదుగా తరలిస్తుంటారు. కొంతమంది ద్విచక్ర వాహనాలు ఉపయోగిస్తే మరికొంతమంది కార్లు, ఇతర చిన్న వాహనాలను వాడుతుంటారు. ఇంకొందరు మాత్రం పెద్దపెద్ద డీసీఎంలు కంటైనర్లలో తరలించేందుకు సన్నాహాలు చేస్తున్న సందర్భాలు బయటపడుతున్నాయి.

Read Also- Anasuya: అనసూయ సంచలన నిర్ణయం.. కరాటే కళ్యాణి, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు

కిందిస్థాయి సిబ్బంది సహకారంపై అనుమానాలు?

గత కొన్ని రోజుల క్రితమే కొత్తగూడెం జిల్లా కేంద్రం సమీపంలోని సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోల్ బంక్ వద్ద పోలీసులకు గంజాయి తరలిస్తున్న భారీ వాహనం దొరికింది. అందులో కోట్ల రూపాయల విలువైన గంజాయి లభ్యమయింది. ఇంకా కొన్ని చిన్నాచితక ఘటనల్లో కూడా గంజాయి కేజీలలో పోలీసులకు పట్టుబడింది. ఇక, తాజాగా బుధవారం ఏకంగా రూ.1.52 కోట్ల విలువైన 304 కేజీల గంజాయి పోలీసులకు దొరికడంతో జిల్లా అధికారులు కూడా అవాక్కయ్యారు. నిత్యం తనిఖీలు గస్తీలు కాస్తున్నప్పటికీ కొత్తగూడెం మీదుగా తరలింపునకు అసలు కారణం ఏంటో అర్థం కాకుండా పోతుంది. సొంత శాఖలోని కిందిస్థాయి సిబ్బంది అక్రమాలకు అండగా ఉంటున్నారా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

కొత్త పుంతల్లో అక్రమ వ్యాపారం

తెలంగాణ రాష్ట్రంలో గంజాయి రవాణా వ్యాపారంపై ప్రభుత్వం పూర్తిస్థాయి నిషేధాజ్ఞలు విధించింది. ఆ నేపథ్యంలో ఏ జిల్లాలో కూడా చేయని సాహస కార్యక్రమాలు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ నేతృత్వంలో చేపడుతున్నారు. మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లందు డీఎస్పీలతో నిత్యం తనిఖీలను నిర్వహిస్తున్నారు. మరోవైపు, మత్తు పదార్థాల వైపు వెళ్లకూడదని విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. అయినప్పటికీ కొత్తగూడెం జిల్లా కేంద్రం మీదుగా గంజాయి రవాణా వ్యాపారులు రోజుకో రకమైన కొత్త పుంతలు తొక్కుతూ అక్రమ రవాణా కొనసాగుతుండడంపై పోలీసులకు అంతుచిక్కడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఎక్కువ మొత్తంలో ఒక్క కొత్తగూడెం జిల్లాలోనే గంజాయి లభ్యం కావడంతో జిల్లా ఉన్నతాధికారులకు అర్థం కాని పరిస్థితి. నిత్యం రాత్రి పగలు అనే తేడా లేకుండా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ అక్రమ వ్యాపారం సాగుతుండడంపై అసలు ఏం జరుగుతుందోనని ఆలోచించే పరిస్థితి వచ్చింది.

Read Also- Tollywood Flops: 2025లో నిర్మాతలను నిండా ముంచేసిన టాలీవుడ్ టాప్ టెన్ సినిమాలు ఇవే?..

Just In

01

Eesha Movie: యుఎస్‌లో రిలీజ్ కాకుండానే ఫేక్ రివ్యూ.. నిర్మాతకు దొరికేసిన రివ్యూయర్!

Duvvada Couple: శివాజీ మాటల రచ్చలోకి ‘దువ్వాడ’ జంట.. సపోర్ట్ ఎవరికంటే?

Vilaya Thandavam: యాక్షన్ మోడ్‌లో కార్తీక్ రాజు.. ‘విలయ తాండవం’ లుక్ అదిరింది

Suryapet News: పిల్లర్లు తడుపుతూ కరెంట్ షాక్‌తో తండ్రీకొడుకు మృత్యువాత.. తీవ్ర విషాదం

Jetlee Movie: వెన్నెల కిషోర్ ‘సుడోకు’ ఫన్.. ‘జెట్లీ’ స్టైలిష్ ఫస్ట్ లుక్ విడుదల