Karate Kalyani: అనసూయను ‘ఆంటీ’ అని కాకుండా ఏమనాలి?
Anasuya Vs Karate Kalyani (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Karate Kalyani: అనసూయను ‘ఆంటీ’ అని కాకుండా ‘స్వీట్ 16 పాప’ అని పిలవాలా?

Karate Kalyani: ‘దండోరా’ (Dhandoraa) ప్రీ రిలీజ్ వేడుకలో శివాజీ (Sivaji) చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి రచ్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, శివాజీకి సపోర్ట్‌గా కొందరు.. చిన్మయి, అనసూయలకు సపోర్ట్‌గా మరికొందరు ఇలా పోస్ట్‌లు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడీ రచ్చలోకి నటి కరాటే కళ్యాణి (Karate Kalyani) కూడా చేరారు. ఆమె శివాజీకి సపోర్ట్‌లు పలు టిబెట్‌లలో పాల్గొంటున్నారు. శివాజీ మాట్లాడిన రెండు పదాలను ఖండిస్తున్నాను. ఆ రెండు పదాలు కాకుండా మిగతా ఆయన చెప్పినదానికి మద్దతు ఇస్తున్నట్లుగా ఆమె ప్రతి డిబెట్‌లో చెబుతూ వస్తున్నారు. ఇక అనసూయ (Anasuya) తాజాగా చేసిన పోస్ట్‌లో ‘నన్న ఆంటీ అంటున్నారు. ఆయనని సార్ అంటున్నారు’ అనే దానిపై కూడా కళ్యాణి రియాక్టైంది. ఇంకా దేవాలయాలపై ఉన్న విగ్రహాలను చూపిస్తూ, అనసూయ చేసిన పోస్ట్‌కు కూడా కరాటే కళ్యాణి కౌంటర్ ఇచ్చారు.

Also Read- Chinmayi Sripada: నీ కొడుకులకు కూడా.. మరోసారి శివాజీకి ఇచ్చిపడేసిన చిన్మయి!

వయస్సును అంగీకరించడంలో తప్పేముంది?

ఈ వివాదంలో అనసూయ తన వయస్సు గురించి ప్రస్తావిస్తూ, 54 ఏళ్ల వ్యక్తిని ‘గారు’ అని గౌరవిస్తూ, 40 ఏళ్ల తనను మాత్రం ‘ఆంటీ’ అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై కరాటే కళ్యాణి స్పందిస్తూ, వయస్సు పెరగడం అనేది ప్రకృతి సహజమని, దాన్ని అంగీకరించడంలో మొహమాట పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ రోజుల్లో 20 ఏళ్లు దాటిన అమ్మాయిలను కూడా పిల్లలు ఆంటీ అని పిలుస్తున్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడే నన్ను ఆంటీ అని పిలిచేవారు. నాకప్పటికి పెళ్లి కూడా కాలేదు. నాకంటే పెద్దవాళ్లు కూడా నన్ను అలానే పిలిచేవారు. అప్పట్లో నేను కూడా కాస్త ఫీల్ అయ్యాను కానీ, అది ఒక అలవాటుగా మారిపోయిందని తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. 40 ఏళ్లు వచ్చినప్పుడు ఆ వయస్సుకు తగ్గట్టుగా పిలవడంలో తప్పేముంది. అయినా నువ్వు ఆంటీవే కదా.. ఆంటీని ఆంటీ అంటే ఒప్పుకోవాలి కదా. అందులో తప్పేముంది. ఆంటీ అనకూడదు అంటే మరి మిమ్మల్ని ఏమని పిలవాలి. అక్క అనాలా? చెల్లి అనాలా? లేక స్వీట్ 16 పాప అని పిలవాలా? ఏమని పిలవాలో మీరే చెప్పండి.. అలా పిలుస్తారు. ప్రతి చిన్న విషయానికి ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

Also Read- Peddi Song: ‘సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక..’ లిరిక్ గమనించారా? ‘చికిరి’‌కి కూడా నోటీసులు ఇస్తారా?

విగ్రహాలపై విమర్శలకు కౌంటర్

అనసూయ తన డ్రెస్సింగ్‌ను సమర్థించుకుంటూ దేవాలయాల్లోని విగ్రహాలను ఉదాహరణగా చూపడంపై కూడా కళ్యాణి తీవ్రంగా మండిపడ్డారు. శిల్పులు విగ్రహాలను చెక్కేటప్పుడు అందులోనూ వస్త్రధారణ ఉంటుందని, ఆ సౌందర్యాన్ని చూసే దృష్టి కోణాన్ని బట్టి ఉంటుందని ఆమె వివరించారు. గుడిలోని విగ్రహాలను, బయట తిరిగే వ్యక్తుల విచ్చలవిడి వస్త్రధారణతో పోల్చడం మూర్ఖత్వమని ఆమె కొట్టిపారేశారు. మర్యాద, ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవం కేవలం వయస్సు మీద మాత్రమే కాకుండా, వారు ప్రవర్తించే విధానంపై కూడా ఆధారపడి ఉంటుందని కళ్యాణి అన్నారు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే భారతీయ సంస్కృతి, కట్టుబాట్ల గురించి నేర్పించి ఉంటే ఇలాంటి వివాదాలు వచ్చేవి కావని ఆమె వ్యాఖ్యానించారు. మొత్తానికి, శివాజీ ఇప్పటికే తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా అనసూయ ఈ వివాదాన్ని ఇంకా సాగదీయడం సరికాదని, ‘ఆంటీ’ అనే పిలుపుపై అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని కరాటే కళ్యాణి తన తాజా డిబెట్‌లో స్పష్టం చేశారు. ఈ వివాదం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది, ఒక పక్క అనసూయకు మద్దతు లభిస్తుండగా, మరోపక్క కళ్యాణి లాంటి వారు వాస్తవాల్ని అంగీకరించాలని సూచిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Hindu Man Killed: హిందూ యువకుడిపై మూకదాడి.. హత్య.. బంగ్లాదేశ్‌లో మరో ఘోరం

Ravi Teja: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. మాస్ రాజా క్రిస్మస్ అవతార్ చూశారా!

Special Trains: దక్షిణమధ్య రైల్వే గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో స్పెషల్ ట్రైన్స్ ప్రకటన

Ganja Seizure: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఆగని గంజాయి దందా.. మరో బ్యాచ్ దొరికింది

Trivikram Srinivas: ‘ఈ సినిమా ఆడుద్ది’.. ఏ సినిమా అంటే?