Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్న పంచాయతీ రాజ్ శాఖ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. జల్ సంచయ్ జన్ భాగీదారి (JSJB) ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయన్ని డిప్యూటీ సీఎం కార్యాలయం స్వయంగా వెల్లడించింది. పవన్ కళ్యాణ్ చొరవతో గ్రామాల ముఖ చిత్రం మారుతోందని చెప్పేందుకు దీనినొక ఉదాహరణ అభివర్ణించింది.
అగ్రస్థానం ఎందుకంటే?
పవన్ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం.. గత ఏడాదిన్నర కాలంలో చేపట్టిన సమగ్ర చర్యలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకును ప్రకటించింది. వర్షపు నీటి పరిరక్షణ, నిరుపయోగ భూముల తగ్గింపు, వ్యవసాయ భూముల విస్తీర్ణం పెంపు, ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం, నీటి కుంటల నిర్మాణం వంటి చర్యలు గ్రామాల్లో నీటి భద్రతకు బలమైన పునాది వేశాయి. ఇలా నీటి పరిరక్షణకు నిరంతరం చర్యలు చేపడుతూ జాతీయ స్థాయిలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది.
జల్ సంచయ్ జన్ భాగీదారి (JSJB) ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన ఆంధ్రప్రదేశ్
గత ఏడాదిన్నర కాలంలో NDA రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర చర్యలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకును ప్రకటించింది. వర్షపు నీటి పరిరక్షణ, నిరుపయోగ భూముల తగ్గింపు, వ్యవసాయ భూముల… pic.twitter.com/yaTbLaiHaq
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) December 25, 2025
జాతీయ స్థాయిలో సత్తా
ఇటీవలే పవన్ నిర్వహిస్తున్న ఏపీలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సైతం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. గతంలో జాతీయ స్థాయిలో 23వ స్థానంలో ఉన్న ఏపీని పవన్ తన విశేష కృషితో 22 స్థానాలు మెరుగుపరిచి అగ్రస్థానంలోకి తీసుకొచ్చారు. ఉద్యోగుల శిక్షణకు సంబంధించి అత్యధికంగా కార్యక్రమాలు నిర్వహించడం, వారిలో శక్తి సామర్థ్యాలు పెంపొందించడానికి చేస్తున్న కృషి కారణంగా ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా పవన్ పై జాతీయ స్థాయిలో ప్రశంసలు కురిశాయి.
Also Read: Maoist Encounter: భారీ ఎన్ కౌంటర్.. టాప్ తెలుగు మావోయిస్టు నేత హతం
పల్లె ప్రగతికి కృషి
కూటమి ప్రభుత్వం గెలుపొందిన తొలినాళ్లలో పవన్ ఏ శాఖ తీసుకుంటారన్న చర్చ పెద్ద ఎత్తున సాగింది. హోంశాఖ, ఆర్థిక శాఖ ఇలా కీలకమైనవే పవన్ ఎంచుకుంటారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా పంచాయతీ రాజ్ శాఖను పవన్ ఎంచుకున్నారు. దానితో పాటు మరో 5 శాఖలను తన వద్దనే అట్టి పెట్టుకున్నారు. గ్రామీణ మంత్రి పల్లెల అభివృద్ధికి తనదైన శైలిలో పవన్ బాటలు వేశారు. ‘పల్లె పండుగ’ పేరుతో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కేంద్ర నుంచి పెద్ద ఎత్తున నిధులను సైతం గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఆశించిన దాని కంటే అధికంగా మౌలిక వసతులు కల్పించబడుతున్నాయి. తాజాగా గ్రామీణ తాగునీటి భద్రత విషయంలోనూ ఏపీ పంచాయతీ రాజ్ శాఖ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలవడం పవన్ చేస్తున్న కృషికి నిదర్శనమని కూటమి నేతలు ప్రశంసిస్తున్నారు.

