Honor Win Series: స్మార్ట్‌ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్..
Honor ( Image Source: Twitter)
Technology News

Honor Win Series: స్మార్ట్‌ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. డిసెంబర్ 26న Honor Win సిరీస్ లాంచ్

Honor Win Series: Honor కంపెనీ తన కొత్త Win సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఈ వారంలో చైనాలో లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో Honor Win, Honor Win RT అనే రెండు మోడళ్లు విడుదల కానున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. లాంచ్‌కు ముందే ఫోన్ల డిజైన్‌తో పాటు కీలక ఫీచర్లను Honor టీజ్ చేయగా, టెక్ ప్రపంచంలో ఈ సిరీస్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్టాండర్డ్ Win మోడల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండగా, Win RT మోడల్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందించనున్నారు.

Also Read: Bhatti Vikramarka: విద్య, వైద్యం, సంక్షేమ రంగాలపై ప్రజా ప్రభుత్వం దృష్టి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ 10,000mAh భారీ బ్యాటరీ ఉండటం ఈ సిరీస్‌లో ప్రధాన హైలైట్‌గా నిలుస్తోంది. ఇది ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద బ్యాటరీగా Honor రికార్డ్ సృష్టించనుంది. అదనంగా, గేమింగ్, హెవీ యూజ్ కోసం 25,000 RPM స్పీడ్‌తో పనిచేసే Dongfeng Turbine Cooler ను ఇందులో పొందుపరిచారు. ఈ ఇన్‌బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ వల్ల ఫోన్ వేడెక్కకుండా మెరుగైన పనితీరు లభించనుంది.

Also Read: Karnataka Bus Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సుకు మంటలంటుకొని 17 మంది సజీవ దహణం

కెమెరా విభాగంలో కూడా Honor Win సిరీస్ గణనీయమైన అప్‌గ్రేడ్‌తో రానుంది. సమాచారం ప్రకారం, Honor Win మోడల్‌లో 50MP Sony LYT700 ప్రైమరీ కెమెరా, 12MP సెకండరీ సెన్సర్‌తో పాటు 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్) ఇవ్వనున్నారు. అదే సమయంలో, Honor Win RT మోడల్‌లో టెలిఫోటో కెమెరా లేకుండా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. రెండు ఫోన్లలోనూ 50MP ఫ్రంట్ కెమెరా లభించనుందని తెలుస్తోంది.

భద్రత, డ్యూరబిలిటీ విషయంలో ఈ సిరీస్ కొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది. ఈ ఫోన్లకు 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ అందించనున్నారు, ఇది కేవలం 0.14 సెకన్లలోనే ఫోన్ అన్‌లాక్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే, IP68, IP69, IP69K సర్టిఫికేషన్లతో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను అందించడం మరో ముఖ్యమైన ఫీచర్.

Also Read: AV Ranganath: పతంగుల పండగకు చెరువులను సిద్ధం చేయాలి.. అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌!

పనితీరు విషయానికి వస్తే, టాప్-ఎండ్ Honor Win మోడల్‌లో Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ ఉండటం ఖరారైంది. దీనితో పాటు LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ లభించనున్నాయి. Honor Win సిరీస్‌లోని ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు డిసెంబర్ 26న చైనాలో అధికారికంగా లాంచ్ కానుండగా, ధరలు, ఇతర వివరాలు లాంచ్ రోజున వెల్లడయ్యే అవకాశం ఉంది.

Just In

01

Tollywood Flops: 2025లో నిర్మాతలను నిండా ముంచేసిన టాలీవుడ్ టాప్ టెన్ సినిమాలు ఇవే?..

Maoist Encounter: భారీ ఎన్ కౌంటర్.. టాప్ తెలుగు మావోయిస్టు నేత హతం

Prabhas RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ నుంచి మ్యూజికల్ సర్‌ప్రైజ్.. క్రిస్మస్ ట్రీట్ అదిరిందిగా..

Uttar Pradesh: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లో కాల్పులు.. టీచర్ మృతి

Bandi Sanjay: పంచాయతీలకు నిధులు.. ప్రభుత్వానికి బండి సంజయ్ డెడ్ లైన్