Mahabubabad District: బినామీ రైతుల పేర్లతో వరి దందా
Mahabubabad District ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Mahabubabad District: బినామీ రైతుల పేర్లతో వరి దందా.. అధికారుల మౌనమే అక్రమాలకు కారణమా?

Mahabubabad District: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని ఖానాపురం గ్రామంలో ఉన్న పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గత ఐదు సంవత్సరాలుగా బినామీ రైతుల పేర్లపై టోకెన్లు తీసుకుని పెద్ద ఎత్తున వరి ధాన్యాన్ని అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వేలువడుతున్నాయి. తక్కువ ధరకు రైతుల వద్ద కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ పొందేందుకు, బినామీ రైతుల పేర్లను సృష్టించి పిఎసిఎస్ కొనుగోలు కేంద్రంలో విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దళారులు చీకటి ఒప్పందాలు

ఇందుకోసం ప్రాథమిక సహకార సంఘం అధికారులతో దళారులు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఆర్ అండ్ బి రోడ్డుపక్కనే కొనుగోలు కేంద్రం ఉండాల్సినప్పటికీ, ఈ–క్రాప్ సెంటర్‌కు ఎలాంటి సంబంధం లేకుండా రోడ్డుకు దాదాపు కిలోమీటర్ లోపల ఖాళీ స్థలంలో అక్రమంగా పిఎసిఎస్ సెంటర్ ఏర్పాటు చేసి దందా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేంద్రం ద్వారా బినామీ పేర్లతో భారీగా వరి కొనుగోళ్లు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

Also Read: Mahabubabad District: ఆ రెండు గ్రామాలు రాష్ట్రానికే ఆదర్శం.. ఇద్దరు సర్పంచులు 18 వార్డులు ఏకగ్రీవం!

గ్రామాల్లో ఒక సామ్రాజ్యాన్నే ఏర్పాటు

ఈ అక్రమ వరి ధాన్యం దందాతో చుట్టుపక్కల గ్రామాల్లో ఒక సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకున్నాడని దళారి గురించి రైతుల మధ్య పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రైతుల హక్కులను కాలరాస్తూ ఇన్నేళ్లుగా ఇంతటి ఘోరం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడమే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, డీసీఓ, డీఏఓ అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపి, దళారీ వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Mahabubabad District: ఆ రైస్ మిల్లు అత్యాచారాలకు, అక్రమాలకు నిలయం.. వయో వృద్ధురాలిపై బీహార్ వ్యక్తి అత్యాచారం!

Just In

01

Actor Sivaji: నటుడు శివాజీపై మహిళా కమిషన్​ సీరియస్.. చర్యలు తప్పవ్!

Aadi Sai Kumar: ‘శంబాల’ ఉందా? లేదా? అనేది తెలీదు కానీ, ‘కల్కీ’ తర్వాత ఆ పేరు వైరలైంది

AP CM Chandrababu Naidu: ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ సాధిస్తే.. వారికి రూ. 100 కోట్లు ఇస్తా! మళ్లీ అదే సవాల్!

Ramchander Rao: ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధ్యయన కమిటీ వేస్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Uttam Kumar Reddy: పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!