Sudharshan Reddy: రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి(Sudharshan reddy) అన్నారు. సోమవారం హైదరాబాదు నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు – కలెక్టర్లు, ఈ. ఆర్. ఓ.లు, ఎ. ఈ. ఆర్. ఓ. లతో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దృష్ట్యా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, పట్టణ ప్రాంతాలలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ రోజుకి 10 వేల చొప్పున చేస్తూ నిర్దిష్ట గడులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
నిర్ణీత గడువులోగా పూర్తి..
వచ్చే వారంలోగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో వృద్ధి నమోదు కావాలని, మ్యాపింగ్ ప్రక్రియతో పాటు ఓటర్ల జాబితాలో బ్లర్ ఫోటోగ్రాఫ్/స్మాల్ ఫోటోగ్రాఫ్/ఇంప్రాపర్ ఫోటోగ్రాఫ్ ల గుర్తింపు చేపట్టాలని, ఫారం 8 ద్వారా అసలైన ఫోటోగ్రాఫ్ సేకరించి నవీకరించాలని, ఈ ప్రక్రియ జనవరి, 2026 లోగా పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్(Collector Rahul Raj) తాసిల్దార్లతో సమావేశం నిర్వహించి ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమానికి సంబంధించి జిల్లాలోని రెండు. నియోజకవర్గాల పురోగతిని గణాంకాల ఆధారంగా సమీక్షించారు. ఓటరు జాబితాలో డూప్లికేట్ ఎంట్రీలు, సమానమైన వివరాలు, బ్లర్ ఫోటోలు వంటి లోపాలను సరిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో స్వీకరించిన దరఖాస్తులు, ఎంట్రీలు, సవరణలు, తొలగింపులు మరియు నవీకరణల వివరాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నమోదు చేయాలని, ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read: Shocking Crime: చున్నీతో కట్టుకున్నోడికి ఉరి బిగించి చంపి.. చిన్న పిల్లాడితో డ్రామా చేయబోయింది..?
పకడ్బందీ ఓటరు జాబితా..
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అన్ని పనులను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని, ఫీల్డ్ స్థాయిలో తనిఖీలు వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో సూపర్ వైజర్లు, బూతు స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఓటరు జాబితా రూపొందించాలని స్పష్టం చేశారు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి పౌరునికి ఓటు హక్కు అందేలా చర్యలు తీసుకోవాలని తద్వారా జిల్లాలో ప్రజాస్వామ్య ప్రక్రియ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. సూపర్ వైజర్లు కు లక్ష్యం నిర్దేశించాలని ఆదేశించారు. ప్రతి రోజు నివేదికలు అందచేయాలని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓలు, మెదక్ రమాదేవి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, తూప్రాన్ జై చంద్రారెడ్డి, తహసీల్దార్ లు పాల్గొన్నారు.
Also Read: Harish Rao: అబద్ధాలకు హద్దు పద్దు ఉంటది: మంత్రి ఉత్తంమ్‌పై హరీష్ రావు ఫైర్!

