Harish Rao: ‘కేసీఆర్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే.. సీఎం, నీళ్ళ మంత్రికి ఎందుకంత నొప్పి అని… ఎవరి ఒత్తిడితో నీటి వాటాను తగ్గించుకున్నారు.. 45 టీఎంసీలకు.. మంత్రి ఉత్తమ్ స్వయంగా తన దస్తూరితో కేంద్రానికి లేఖ రాశారనిచెప్పారు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumnar Reddy).. ఉత్తర కుమార ప్రగల్బాలు పలికారని’ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(harish rao) ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అనుభవమంతా దోపిడికి, లూటీకి పనికొస్తుందంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడైనా ప్రిపేర్ అయ్యి ప్రెస్‌మీట్స్ నిర్వహించాలని ఎద్దేవా చేశారు. నీళ్ళ మంత్రి ఉత్తమ్‌కు సగం సగం నాలెడ్జ్ మాత్రమే ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ లేవని ఇచ్చిన అంశాలను నివృత్తి చేయాలి.. లేదంటే సమాధానం చెప్పాలని.. అది చేయకుండా మరుగుజ్జు మనస్తత్వంతో.. సంకుచిత మనస్తత్వంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఫ్రస్టేషన్ లో ఏదేదో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లయింది పింఛన్లు ఎందుకు పెంచలేదు.. మహిళలకు 2500 ఏమైందని కేసీఆర్ అడిగారని.. నిధుల సేకరించడంలో బాగా అనుభవం ఉందన్నారు.. ఇప్పుడు ఏమైంది.. వాటాలకు లూటీలకు దోపిడీలకు మాత్రమే అనుభవం సరిపోయిందా… రైతులను ఎందుకు గోసపెడుతున్నారు యాప్లు, మ్యాపులు ఎందుకంటే సమాధానం లేదన్నారు. రాజకీయాల కోసం ఎందుకు రాష్ట్రం పరువు తీస్తున్నారు అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
కాలేశ్వరం నీళ్లతో..
పార్టీ తల్లి.. పార్టీ అధ్యక్షుడు తండ్రి లాంటి వారు మాకు అని స్పష్టం చేశారు. పుట్టుక ఒకదాంట్లో.. చదువు ఒకదాంట్లో.. ఉద్యోగం ఒకదాంట్లో.. రేపు ఎందులో ఉంటావో.. చొక్కాలు మార్చినంత సులువుగా పార్టీ మార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని దుయ్యబడ్డారు. త్యాగాల చరిత్ర మాది వెన్నుపోటు చరిత్ర మీది అని మండిపడ్డారు. ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలోని తెలంగాణ నెంబర్వన్ గా చేసింది టిఆర్ఎస్(TRS) ప్రభుత్వం అని స్పష్టం చేశారు. మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ అనంతగిరి కింద పండిన పంటలు కాలేశ్వరం నీళ్లతో కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే దాన్నే ఉత్పత్తిలో.. డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ(Telangana) నెంబర్ వన్ అయింది అన్నారు. 2023లో పాలమూరు డిపిఆర్ వాపస్ వస్తే కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అనుమతి, సెంట్రల్ సాయి మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ అనుమతి, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి, కేంద్ర భూగర్భ జల బోర్డు అనుమతి ఎలా సాధించామని ప్రశ్నించారు. 2023 ఏప్రిల్ లో పాలమూరు డిపిఆర్ వాపస్ వస్తే మూడు రోజుల్లోనే మా ప్రభుత్వం జలశక్తి మంత్రికి లేఖ రాసిందని.. కెసిఆర్ జనశక్తి అధికారులతో మాట్లాడారని అక్కడ నుంచి సిడబ్ల్యుసి కి అప్రైజల్ కొనసాగించమని ఆదేశాలు ఇప్పించామన్నారు.
Also Read: GHMC: డీలిమిటేషన్ పై ముగిసిన స్టడీ.. సర్కారుకు నివేదిక సమర్పించిన జీహెచ్ఎంసీ!
చిల్లర వాగుడు ఎందుకు..
సీఏసీ సిఫారసు సహ ఏడు అనుమతులు సాధించామని ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 2024 డిసెంబర్ 19న డిపిఆర్ వాపసు లేఖ రాస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నదని కేసీఆర్ నిలదీశారని.. రెండేళ్లలో ఒక్క అనుమతి కూడా ఎందుకు తేలేదని నిలదీశారు. ఇది కాకుండా 45 టిఎంసిలు చాలు అంటూ ఢిల్లీకి ఉత్తంకుమార్ లేఖ రాశాడని.. సిగ్గు లేకుండా మేము రాయలేదంటున్నారని మండిపడ్డారు. 45 టీఎంసీలతో ఎవరికి అన్యాయం చేస్తావు పాలమూరు కా? రంగారెడ్డికా? నల్గొండ కా?.. ఎవరి డైరెక్షన్.. చంద్రబాబు డైరెక్షన దానికి సమాధానం చెప్పకుండా చిల్లర వాగుడు ఎందుకు అని నిలదీశారు. 45 టీఎంసీలు చాలు అని ఉత్తమ్ లెటర్ రాసి ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పాలమూరు 90 శాతం పనులు పూర్తి చేసింది వాస్తవమని.. మీరు రెండేళ్లలో ఏం చేశారని నిలదీశారు. నార్లపూర్ 90 శాతం పూర్తి చేసి డిసెంబర్ 2023 లో రెండు టీఎంసీల నీటిని నింపేమని.. ప్రస్తుత జలాశయంలో నాలుగు టీఎంసీల నీరు ఉంది అన్నారు. ఏదుల, వట్టెం, కరివేన, ఉద్దండపూర్ పనులు దాదాపు పూర్తి చేశామని.. కేవలం రెండు కిలోమీటర్లు తవ్వితే నీళ్లు నిండుతాయని తెలిపారు.
2025-26 బడ్జెట్లో..
టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే కొడంగల్, నారాయణపేట రైతుల కాళ్లు కృష్ణ లీలతో కడిగే వాళ్ళమన్నారు. టిఆర్ఎస్ పదేళ్లలో 2014 నుంచి 2023 వరకు 17 లక్షల 24 వేల ఎకరాల కొత్త ఆయకట్టు, 31 లక్షల 50 వేల ఎకరాల స్థిరీకరణ చేశామని.. మొత్తం 48 లక్షల 74 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25లో ఆ ఏడాదికి 6.55 లక్షల ఎకరాలను సాగులోకి తెస్తామని.. 2025-26 బడ్జెట్లో 5 లక్షల ఎకరాలను ఐ పీ క్రియేట్ చేస్తామని.. చెప్పారని ఈ రెండేళ్లలో 11.60 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చారా.. ఎక్కడ నీళ్లు ఇచ్చారు చెప్పాలని సవాల్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా తప్పు చెప్పానని ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రెండేళ్లలో ఒక ప్రాజెక్టు కట్టింది లేదు ఒక చెక్ డాం పూర్తి చేసింది లేదన్నారు. కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ అజ్ఞానంతో తెలంగాణ రాష్ట్రం ఎక్కువగా రావలసిన నీటి వాటాను కోల్పోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కుడి కాలం నుంచి ఏపీ ప్రభుత్వం రోజు పదివేల క్యూసెక్కులన్నీ తరలించకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: VC Sajjanar: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. స్వయంగా ప్రశ్నించనున్న సీపీ సజ్జనార్!
ఎస్ఎల్ బిసిని తవ్వకుండా..
కృష్ణా జలాల్లో ఏపీ తాత్కాలిక వాటా 512 టిఎంసిలు అని కానీ 650 కి పైగా నీళ్లు ఏపీ తరలించకపోతుంటే నోరు తెగలద అని మండిపడ్డారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్ ప్రజల పాలిట పెన్ని శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు , కోయిల సాగర్, ప్రాజెక్టులను నాడు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలేదు చెప్పాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగు ప్రాజెక్టుల కింద ఆరున్నర లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చామని.. మొత్తంగా పాలమూరులో పది లక్షల ఎకరాల్లో నీరు పారించామని వెల్లడించారు. ఎస్ఎల్ బిసి(SLBC) ని పావు కిలోమీటర్ తవ్వకుండానే కుప్ప కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసమే పాలమూరుకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ తీరును ఎండగడతామని స్పష్టం చేశారు. కృష్ణా నదిలో 28.49 టీఎంసీలు అతి తక్కువ వినియోగం వినియోగం చేసింది రేవంత్ రెడ్డి పాలన లోనే మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలతో ఆటలాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల దెబ్బతిస్తున్నారని మండిపడ్డారు. టన్నెల్ తో సహా ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టులో భాగమైన డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లిపాక రిజర్వాయర్ భూసేకరణ పునరావాసం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు 3892 కోట్లు అని హరీష్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ చారిత్రక తప్పిదం.. దివాలా కోరు కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు.
Also Read: Parasakthi Release: నాలుగు రోజులు రిలీజ్ ముందుకు వచ్చిన శివ కార్తికేయన్ పరాశక్తి.. ఎందుకంటే?

