BRS: సంచలన నిర్ణయం తీసుకున్న గులాబీ పార్టీ.. జరిగేది ఇదే..!
BRS (imagecredit:twitter)
Political News, Telangana News

BRS: సంచలన నిర్ణయం తీసుకున్న గులాబీ పార్టీ.. సంక్రాంతి తర్వాత జరిగేది ఇదే..!

BRS: గులాబీ పార్టీకి కొత్త ఇన్చార్జిలు రాబోతున్నారు. అందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేపట్టినట్టు సమాచారం. ఇప్పటివరకు పార్టీ బలోపేతంపై దృష్టి సారించలేదు. అయితే పంచాయతీ ఎన్నికలు పార్టీకి బూస్ట్ ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో పార్టీ అసెంబ్లీ నియమించగా.. కొంతమంది పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వారి ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. సంక్రాంతి తర్వాత అందుకు శ్రీకారం చుటబోతున్నట్లు విశ్వాసనీయ సమాచారం.

పార్టీ బలోపేతంపై దృష్టి..

గులాబీ పార్టీ బలోపేతంలో భాగంగా తొలుత అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిల నియామకం పై దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం పని చేస్తున్న ఇంచార్జిలలో ని కొంతమందిలో సీరియస్ నెస్ కొరవడం.. పార్టీ శ్రేణులను కలుపుకపోవడం.. స్థానిక అందుబాటులో ఉండకపోవడం.. పంచాయతీ ఎన్నికల్లో సైతం ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడం.. కొంతమంది ఏజ్ అయినవారు ఉండడంతో పార్టీ బలోపేతంపై దృష్టి సాధించడం లేదని పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీంతో ప్రక్షాళన చేయాలని అందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిసింది. నియోజకవర్గ ఇన్చార్జిలు గా యువతకు అప్పగిస్తే పార్టీ బలోపేతం అవుతుందని.. మనుగడ ఉంటుందని.. అందరిని కలుపుకొని పోతారని.. ప్రజా సమస్యలపై సైతం పోరాడుతారని పార్టీ భావిస్తుంది. అందుకోసం యువత పేర్లను ఇప్పటికే సేకరించినట్లు సమాచారం.

ఎమ్మెల్యే అనుచర వర్గం

ఇది ఇలా ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలను సుప్రీం చేసింది. నియోజకవర్గ పార్టీ బాధ్యతలు ఎమ్మెల్యేలు అప్పగించింది. అప్పటివరకు సాఫీగా కొనసాగిన పార్టీ.. ఎమ్మెల్యేలను ఇన్చార్జ్ చేసిన తర్వాత రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి ఉద్యమకారులు, మొదటినుంచి పనిచేస్తున్నవారు .. రెండోది ఎమ్మెల్యే అనుచర వర్గంగా విడిపోయింది. మరోవైపు ఇతర పార్టీలో గెలుపొంది గులాబీలో చేరిన ఎమ్మెల్యేలకు సైతం పార్టీ ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వడంతో.. పాత కొత్త నేతల మధ్య సమన్వయం కొరవడింది. నియోజకవర్గాల పార్టీ రెండుగా చీలిపోయింది. ఎమ్మెల్యే అనుచరులకే పెద్దపీట కావడంతో ఆది నుంచి పనిచేసిన నేతలు వ్యతిరేకించారు. ఇదే 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడింది. టిఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ఇదే ప్రధాన కారణమని పార్టీ నేతలే అభిప్రాయపడ్డారు. అయితే వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న పార్టీ అధినేత కేసీఆర్ యువతకు నిహారిక బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు నియోజకవర్గ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు కేవలం పార్టీ పదవులు అప్పగించాలని.. ఇన్చార్జి బాధ్యతలు నుంచి తొలగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని.. పనిచేసే కేడర్ కు గుర్తింపు లభిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Uttam Kumar Reddy: తెలంగాణకు కేసీఆర్, హరీష్ రావు ద్రోహం చేశారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కేవలం అధ్యక్షులు మాత్రమే..

సంక్రాంతి తరువాతే పార్టీ కమిటీల ప్రకటన ఉంటుందని సమాచారం. 2017 తర్వాత రాష్ట్ర కమిటీని నియమించలేదు. ఖాళీలను సైతం భర్తీ చేయలేదు. అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా కమిటీలను సైతం పూర్తి స్థాయిలో నియమించలేదు. కేవలం అధ్యక్షులు మాత్రమే నియమించింది పార్టీ అధిష్టానం. గ్రామ స్థాయిలో సైతం కమిటీలు వేయలేదు. వీటన్నిటిని పరిధిలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. అందుకే నియోజకవర్గ ఇన్చార్జిలుగా యువతకు బాధ్యతలు అప్పగించాలని… ప్రస్తుతం ఇన్చార్జిలుగా ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులకు బాధ్యతలు నుంచి తప్పించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని పలువురు సీనియర్ల సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యమ సమయంలో..

పార్టీ జిల్లా అధ్యక్ష పదవులను సైతం యువతకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. బీసీలకు మెజార్టీ జిల్లా అధ్యక్ష పదవులను కట్టబెట్టాలని నిర్ణయిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి యువత వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఉద్యమ సమయంలో పనిచేసిన వారికి… సామాజిక వర్గాల్లో బలంగా ఉన్న వారికి.. విద్యార్థి ఉద్యమాల్లో యాక్టివ్ గా పని చేసిన వారికి సైతం కమిటీలో కీలక పదవులు అప్పగించబోతున్నట్లు సమాచారం. యువతకు పదవులు వేస్తేనే పార్టీ మరో 20 ఏళ్లకు పైగా పట్టిష్టంగా ఉంటుందని భావించే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.

Also Read: Gold Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

Just In

01

Sigma Telugu Teaser: దళపతి విజయ్ తనయుడి ‘సిగ్మా’ టీజర్ ఎలా ఉందంటే..

Etela Rajender: హుజురాబాద్ ప్రజల నమ్మకాన్ని నిలబెడతా : ఈటెల రాజేందర్!

Sivaji: ‘సారీ’ చెప్పిన శివాజీ.. కాంట్రవర్సీ ముగిసినట్లేనా?

Sivaji Comments: శివాజీ కామెంట్స్‌పై బేషరతు క్షమాపణ కోరుతూ.. ‘మా’కు ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ ఫిర్యాదు..

Jishnu Dev Varma: అలంపూర్ జోగులాంబ అమ్మవారిని ద‌ర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ!