Uttam Kumar Reddy: తెలంగాణకు కేసీఆర్, హరీష్ రావు ద్రోహులు
Uttam Kumar Reddy (imagecredit:twitter)
Telangana News

Uttam Kumar Reddy: తెలంగాణకు కేసీఆర్, హరీష్ రావు ద్రోహం చేశారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: తెలంగాణకు ద్రోహం చేసిందే కెసిఆర్ హరీష్ రావు అని.. కుట్రతోనే ఏపీకి నీళ్లు అప్పగించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్ర వాళ్లకు అమ్ముడు పోయింది బీఆర్ఎస్ నేతలు అని.. నీళ్లు, కాంట్రాక్టర్లు అన్ని ఆంధ్రాళ్లకే అప్పగించాలని ఆరోపించారు. సచివాలయంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. హరీష్ రావు.. గోబెల్స్ అని పెట్టుకోవాలని సూచించారు. కాళేశ్వరం విషయంలో పదే పదే అబద్ధాలు మాట్లాడుతున్నారని.. బీ ఆరెస్ నాయకులు సిగ్గుతో తలవంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల తలలను తాకట్టు పెట్టి కాళేశ్వరం నిర్మాణం చేశారన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని, కాళేశ్వరం నుంచి ఐదేళ్లలో 70 టీఎంసీ మాత్రమే నీళ్లను ఉపయోగించారన్నారు.

ఏడాదికి వేల 20వేల కోట్లు

హరీష్ రావు అతి తెలివితేటలు వాడటం ప్రజలు గమనిస్తున్నారన్నారు. కృష్ణా జల్లాల విషయంలో 2014 నుంచి 2020 వరకు ఆపేక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్(KCR) సంతకాలు పెట్టారని, పాలమూరు, డిండి, ఎస్ఎల్ బీసీ(SLBC) ని కేసీఆర్ ఎందుకు పూర్తి చెయ్యలేదని ప్రశ్నించారు. కేసీఆర్(KCR), హరీష్ రావు(Harish Rao) బరితేగించి మాట్లాడుతున్నారని, కేసీఆర్ అప్పులు తీర్చడానికి ఏడాదికి వేల 20వేల కోట్లు చెల్లిస్తున్నామన్నారు. కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. సిగ్గులేకుండా కేసీఆర్, హరీష్ రావు వ్యాఖ్యలు ఉన్నాయని, 45 టీఎంసీ లేఖ కొత్తది కాదు… గత బీ ఆరెస్ ఒప్పందాన్నే మేము లేఖను రాసామని వెల్లడించారు. 90 టీఎంసీ లను గతంలో కేసీఆరే డివైడ్ చేసి 45టీఎంసీ లుగా చేశారని, పాలమూరుకు ఇప్పటికీ పూర్తిగా పర్యావరణం అనుమతులు రాలేదన్నారు.

Also Read: Bigg Boss Buzzz: బిగ్ బాస్ బజ్‌లో తన తదుపరి లక్ష్యమేంటో చెప్పేసిన కళ్యాణ్.. ఏంటంటే?

మొత్తం లెక్కలు తిస్తే..

పదేళ్ళ పాటు పాలమూరు పూర్తి చేయకుండా అక్కడి ప్రజలను మోసం చేసింది కేసీఆర్ అని ధ్వజమెత్తారు. 90శాతం పనులు పూర్తి అయితే.. ఒక్క ఎకరాకు నీళ్లు ఎందుకు ఇయ్యలేదని, పాలమూరు మాత్రమే కాదు అన్ని ప్రాజెక్టలు తిరిగేందుకు మేము సిద్ధమే అన్నారు. ముందు తెలంగాణ(Telangana) ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2020 కె ఆర్ ఎం బి(KRMB) మీటింగ్‌లో 45 టీఎంసీ తెలంగాణకు సరిపోతాయని కేసీఆర్ ఒప్పుకున్నారన్నారు. కేసీఆర్ మాట్లాడితే కాంట్రాక్టర్ లు అంటున్నాడు. మొత్తం లెక్కలు తిస్తే అసలు విషయం తెలుస్తది. కేసీఆర్ 34శాతం కావాలని అంటే.. మేము వచ్చాక 70శాతం వాటా కావాలని లేఖ రాసామని, కేసీఆర్, హరీష్ రావు ద్రోహం, కుట్రతో ఏపీకి నీళ్లు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కమిషన్లకు కక్కుర్తి పడి..

కేసీఆర్, హరీష్ రావు తీస్మారఖాన్‌లు.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌లో ఏపీ తో కుమ్మకై రోజుకు 3టీఎంసీ అప్పగించారని మండిపడ్డారు. హరీష్ రావుకు నోరు ఎలా వస్తోంది అబద్ధాలు మాట్లాడటానికి అని నిలదీశారు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్క్రిమ్ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆపించామని వెల్లడించారు. నేను అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాలి? పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు?.. కాంట్రాక్టర్ల కోసం కమిషన్లకు కక్కుర్తి పడి ఆపేక్స్ లో తక్కువ వాటాకు ఒప్పుకున్నారు. నల్గొండ జిల్లాకు అన్యాయం చేసేందుకు కేసీఆర్ డిండికి అనుమతి ఇవ్వలేదు అని నిలదీశారు. కోమటిరెడ్డి పై కోపంతో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుపై కుట్ర చేశారని మండిపడ్డారు. అంద్రోళ్లకు అమ్ముడు పోయింది బీఆర్ఎస్ వాళ్ళు అని, నీళ్లు – కాంట్రాక్టర్లు అన్ని అంద్రోళ్ళకే అమ్మారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Also Read: Nirmala Jaggareddy: గాంధీ పేరు తొలగించడం జాతికే అవమానం.. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి!

Just In

01

Parasakthi Release: నాలుగు రోజులు రిలీజ్ ముందుకు వచ్చిన శివ కార్తికేయన్ పరాశక్తి.. ఎందుకంటే?

KCR: ప్రాజెక్టులపై కేసీఆర్ కొత్త రాజ‌కీయం.. మరో డ్రామాకు తెరలేపిన గులాబి బాస్..?

Hydraa: ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువు పునరుద్దరణపై హైడ్రా ఫుల్ ఫోకస్..!

GHMC: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. వడ్డీ మాఫీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు..!

Shivaji Comments: ఆడవారు వేసుకునే దుస్తుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన యాక్టర్ శివాజీ..