Nirmala Jaggareddy: ఉపాధి హామీ పథకం పేరును తొలగించిన కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి (Nirmala Jaggareddy) తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గంజి మైదాన్ లోని గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును చెరిపివేయాలని కుట్ర చేస్తుందని మండిపడ్డారు. దేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడిని అవమానించేలా వ్యవహరిస్తున్న బీజేపీని ప్రజలు ఎన్నటికీ క్షమించరని ఆమె హెచ్చరించారు.
Also Read: Viral video: చట్టసభలో ఉద్రిక్తత.. జుట్లు పట్టుకొని.. పొట్టు పొట్టుకొట్టుకున్న మహిళా ఎంపీలు
బీజేపీ ప్రభుత్వం గాడ్సే ఆశయాలతో ముందుకు సాగుతుంది
స్వాతంత్య్ర పోరాటంలో ఏ ఒక్క బీజేపీ నాయకుడి పాత్ర లేదు. అందుకే వారికి దేశభక్తుల విలువ తెలియడం లేదు. బీజేపీ ప్రభుత్వం గాంధీ మార్గంలో కాకుండా, గాడ్సే ఆశయాలతో ముందుకు సాగుతుంది” అని ఆమె ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో పేదల కోసం తెచ్చిన ఈ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం వెనుక ఉన్న రాజకీయ దురుద్దేశాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు, టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, బూచి రాములు, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, బొంగుల రవి, ప్రవీణ్, నర్సింహారెడ్డి, మహేశ్, తాహిర్, కసిని రాజు, నవాజ్, ఆరిఫ్, బాబు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

