Niranjan Reddy: కేసీఆర్‌ను మానసికంగా వేధిస్తున్నావ్
Niranjan Reddy ( imageCREDIT: SWETCHA repORTER)
Political News

Niranjan Reddy: కేసీఆర్‌ను మానసికంగా వేధిస్తున్నావ్.. కవిత వ్యాఖ్యలకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటర్!

Niranjan Reddy: పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందంటూ ఎమ్మెల్సీ కవిత తనపై చేసిన వ్యాఖ్యాలకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. ‘‘తండ్రి వయసున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఇంటికి పిలిపించుకొని మాట్లాడుతున్నావు. నీ దారికి రాని మాలాంటి నలుగురైదుగురిపై విషం చీమ్ముతున్నావ్. నీళ్ల నిరంజన్ రెడ్డి అని నేను కావాలని పిలిపించుకోలేదు. నువ్వు లిక్కర్ రాణి అని పిలిపించుకో. కేసీఆర్‌ను మానసికంగా వేధిస్తున్నావ్’’ అంటూ ఆయన కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. తాను లక్షా 20 వేల ఎకరాలకు నీళ్లు తెచ్చానని, పూర్తిగా అవగాహన చేసుకోవాలన్నారు. నీకు హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇండ్లు, గండిపేటలో విలాసవంతమైన ఫామ్ హౌస్‌లు నీకు ఎక్కడివి?, ఎక్కడికెళ్లి వచ్చాయి?. నాకు ఎక్కడా ఫామ్‌హౌస్‌లు లేవు. నాకు సొంత ఊరిలో ఉన్నది ఒక్కటే వ్యవసాయ క్షేత్రం. కేసీఆర్ కూతురివి కనుకనే నీకు ఇంత గౌరవం ఇస్తున్నాం. ఆ గౌరవాన్ని కాపాడుకుంటాలేవు’’ అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ పాలనలో 720 రైతుల ఆత్మహత్య

కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోందని, కానీ ఇప్పటికే 720 మంది రైతులు ఆత్మహత్యాలు చేసుకున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రైతాంగం విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ‘‘పాలమూరు రంగారెడ్డి 10 శాతం పనులు పూర్తి చేస్తే అయిపోతుంది. కానీ, పాలమూరు బిడ్డ రేవంత్ ఎందుకు స్పందిస్తలేదు. కవిత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపకుండా నాపై దూర్బాషాలడడం ఎంతవరకు సమంజసం?. నేను ఒక్కసారి కూడా కవితను పల్లెత్తు మాట అనలేదు. డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్లు నన్ను సోషల్ మీడియాలో కావాలనే బ్లేమ్ చేస్తున్నారు. కవిత ఎవరిని సంతోషాపెట్టాలని నన్ను దుర్భాషాలాడుతుందో తెలుస్తలేదు.

Also ReadNiranjan reddy: యూరియా కొరతపై జిల్లా కలెక్టర్‌ను కలిసిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

కవిత ఆరోపణలు చేయడం సిగ్గుచేటు

నేను కక్ష పూరితంగా కేసులు ఎవరి మీద పెట్టించలేదు. అలాంటివి ఉంటే నిరూపించాలి. కావాలని అసత్య ఆరోపణలు చేయవద్దు. నేను ఎంతో మంది విద్యార్థులను సొంత ఖర్చులతో చదివించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవి నేను ప్రచారం చేసుకోలేదు. పెబ్బేరు సంత నేను కబ్జా చేశానరడం అసత్యప్రచారం. పూర్తి విషయ పరిజ్ఞానం లేకుండా నేను దేవుడి మాన్యాన్ని కబ్జా చేశానంటూ కవిత ఆరోపణలు చేయడం సిగ్గుచేటు’’ అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు లేదు కదా?, కాబట్టి తనపై మోపుతున్న నిందారోపణలు రుజువు చేయాలంటూ సవాలు విసిరారు. పార్టీ కష్ట కాలంలో కూడా కేసీఆర్‌ను వదల్లేదని, పార్టీ జెండాను వదలలేదని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘నేను కేసీఆర్ మనిషిని. ఆయన మాటను, ఆదేశాలను నేనెప్పుడూ తూ.చ. తప్పకుండ పాటిస్తాను. మేము కేసీఆర్‌కు వన్నె తెస్తుంటే నీవు కేసీఆర్‌ను మానసికంగా వేధిస్తున్నావు. నువ్వు లిక్కర్ కేసులో జైలుకు వెళ్లినప్పుడు కేసీఆర్ అభిమానులంతా దుఃఖ సాగరంలో మునిగిపోయారు’’ అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read: Harish Rao: బిజెపి మోడీ వైపు ఉందా రేవంత్ వైపు ఉందా: హరీష్ రావు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?