Telangana Panchayats: ఇక పంచాయతీలు ప్రగతి బాటలో పయనించనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టబోతుంది. గత రెండేళ్లుగా పల్లెల్లో నిలిచిన పనులు వేగంపుంజుకోనున్నాయి. ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టబోతున్నారు. ప్రత్యేకంగా పారిశుద్ధ్య, వీధి దీపాలు, నీటి సరఫరా పై దృష్టి సారించనున్నారు.
పారిశుద్ధ్య ట్రాక్టర్ల ఈఎంఐలు
రాష్ట్రంలో ని 12702 గ్రామపంచాయతీలో పాలకవర్గాలు కొలువుదీరాయి. సుదీర్ఘకాలం తర్వాత కొలువు ధీరడంతో ఇక గ్రామంలోని మౌలిక సమస్యలపై దృష్టి సారించనున్నారు. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి సుమారు 6000 కోట్లకు పైగా 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది. ఆ నిధులు విడుదలయితే ఇక గ్రామాలన్నీ ప్రగతి బాటలో పయనించనున్నాయి. మౌలిక సమస్యలైన వీధి దీపాలు(Street lights,), పారిశుద్ధ్యం(sanitation), నీటి సమస్య(water problems), గ్రామపంచాయతీ విద్యుత్ బిల్లులు(village panchayat electricity bills), పారిశుద్ధ్య ట్రాక్టర్ల ఈఎంఐ లు, పల్లె ప్రకృతి వనాలు తదితర సమస్యలు పరిష్కారం కానున్నాయి. వాటి కోసం ప్రభుత్వం సైతం ప్రత్యేక నిధులు కేటాయించాలని.. గ్రామాలను అభివృద్ధి బాటలో పయనించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మౌలిక సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే గ్రామాల వారిగా నివేదికలు తీసుకొని తీసుకొని ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్ట పోతున్నట్లు సమాచారం.
Also Read: GHMC: బల్దియాలో ఇంజినీర్ల కొరత.. పని భారంతో అల్లాడుతున్న అధికారులు
విడుదల వారీగా బిల్లులు
గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో హరితహారం నర్సరీల నిర్వహణ, పల్లె ప్రకృతి వనాలు, పారిశుద్ధ్య, ట్రాక్టర్ల నిర్వహణ, చెత్త డంపింగ్ యార్డ్ లు, స్మశాన వాటికల ఏర్పాటు తదితర బాధ్యతలను సర్పంచ్లకు అప్పగించింది. దీంతో అప్పులు చేసి మరి సర్పంచ్లు గ్రామాల్లో పనులు కంప్లీట్ చేశారు. అయితే చేసిన పనులకు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో 500 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. కాంగ్రెస్(Congress) వచ్చిన తర్వాత విడుదల వారీగా బిల్లులు మంజూరు చేస్తుంది. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేసిన అభివృద్ధి పనులను అప్పులు చేసి కంప్లీట్ చేసిన.. నిధుల విడుదలలో జాప్యంతో 60 మందికి పైగా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటిది ఘటనలు పునరావృతం కాకుండా.. సర్పంచ్లకు భరోసా కల్పించేలా చేసిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేసేలా.. అభివృద్ధి పనులు పరిగెత్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. గత బిఆర్ఎస్ చర్యలతో కుంటుపడిన గ్రామాల అభివృద్ధిని గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
గ్రామాల్లో కొత్త వెలుగులు
గ్రామాల్లో చేపట్టే పనులకు ఉపాధి హామీ నిధులను సైతం వినియోగించుకోవాలని.. గ్రామాల్లో కొన్ని పనులను ఆ పథకం కింద చేర్చి కొనసాగించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వం సైతం కేంద్రం నుంచి రావాల్సిన 15 ఫైనాన్స్ నిధులను త్వరగా తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టాలని భావిస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గ్రామాల్లో కొత్త వెలుగులు నింపబోతున్నాయి. నూతన పాలవర్గాలకు సైతం ప్రభుత్వం భరోసా కల్పించబోతుంది.
Also Read: Harish Rao: అబద్ధాలకు హద్దు పద్దు ఉంటది: మంత్రి ఉత్తంమ్‌పై హరీష్ రావు ఫైర్!

