Hyderabad Crime: సెల్​ ఫోన్ గొడవ కత్తులతో దాడి చేసిన యువకుడు
Hyderabad Crime (imagecredit:twitter)
క్రైమ్, హైదరాబాద్

Hyderabad Crime: సెల్​ ఫోన్ గొడవ.. కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసిన యువకుడు..?

Hyderabad Crime: జాగ్రత్తగా దాచి పెట్టమని ఇచ్చిన మొబైల్ ఫోన్(Mobile Phone) ను అమ్మేసుకున్నాడన్న కక్షతో స్నేహితునిపై కత్తితో దాడి చేసిన యువకుని ఉదంతమిది. విచక్షణారహితంగా పొడవటంతో బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. బాలాపూర్​ సీఐ సుధాకర్(CI Sudhakar) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వట్టేపల్లి వాస్తవ్యులైన రిహాన్ (17), షానవాజ్​, మోయిన్​, ఫర్హాన్​ లు స్నేహితులు. గతంలో ఓ కేసులో అరెస్ట్ అయిన షానవాజ్​ జైలుకు వెళ్లే ముందు తన సెల్​ ఫోన్​ ను రిహాన్ కు ఇచ్చాడు. తిరిగి వచ్చాక తీసుకుంటానని చెప్పాడు. అయితే, షానవాజ్ జైల్లో ఉన్నసమయంలో రిహాన్ దానిని అమ్మేసి డబ్బు ఖర్చు చేసుకున్నాడు.

Also Read: Ponguleti Srinivas Reddy: భూభారతి పోర్టల్‌తో అనుసంధానం.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూస‌మాచారం!

రెచ్చిపోయిన షానవాజ్..

బెయిల్ పై విడుదలై వచ్చిన తరువాత షానవాజ్​ ఫోన్​ గురించి అడుగగా ఇంట్లో ఎక్కడో పెట్టి మరిచిపోయానని చెప్పాడు. కాగా,న ఆదివారం రాత్రి నలుగురు స్నేహితులు కలిసి బండ్లగూడకు వచ్చి అక్కడ మద్యం సేవించారు. తెల్లవారుఝాము 2.30గంటల వరకు పీకలదాకా తాగారు. ఆ తరువాత షానవాజ్​ తన ఫోన్ గురించి ప్రశ్నించాడు. దాంతో రిహాన్​, షానవాజ్​ ల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో రెచ్చిపోయిన షానవాజ్​ తన వెంట తెచ్చుకున్న కత్తితో రిహాన్ పై దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం మిగితా వారితో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు అందించిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రిహాన్​ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. కేసులు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also Read: DEO VRS Issue: స్వచ్ఛంద పదవీ విరమణ బాట పడుతున్న విద్యాశాఖాధికారులు.. ఎందుకో తెలుసా..!

Just In

01

Sivaji Comments: శివాజీ కామెంట్స్‌పై బేషరతు క్షమాపణ కోరుతూ.. ‘మా’కు ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ ఫిర్యాదు..

Jishnu Dev Varma: అలంపూర్ జోగులాంబ అమ్మవారిని ద‌ర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ!

Oppo Reno 15 Series: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌లోకి రానున్న Oppo Reno 15 Series 5G

Champion: ఛాంపియన్‌తో ఛాంపియన్.. నితీష్ కుమార్ రెడ్డి ఫేవరేట్ హీరో, హీరోయిన్లు ఎవరంటే?

MLA Rajesh Reddy: అమ్మాయిలు చదువుతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉండాలి : ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి