Shivaji Comments: యాక్టర్ శివాజీ మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేసి మరో సారి వార్తల్లో నిలిచారు. ‘దండోర’ సినిమా డిసెంబర్ 25, 2025న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ ఆడవారి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ తనదైన శైలిలో మాట్లాడే శివాజీ ఇప్పుడు కూడా ఆడవారు గురించి, వారు వేసుకునే బట్టలు గురించి ఇలా చెప్పుకొచ్చారు. ‘అమ్మాయిలు హీరోయిన్లు మీరు కనబడేలా బట్టలు వేసుకుని పోతే మనమే నిందలు అనుభవించాల్సి వస్తుంది. దయచేసి ఏం అనుకోవద్దు మంచిగా చీర కట్టుకని రండి, ఎంతో అందంగా ఉంటుంది. మీ అందం నిండుగా చీరకట్టుకునే బట్టల్లో ఉంటుంది తప్పితే సామన్లు కనబడే దాంట్లో ఏం ఉండదు. మీ ముందు చాలా మాట్లాడతారు. చాలా బావున్నావు అంటారు, నువ్వు వెళ్లి పోయిన తర్వాత అంటారు ఇలాంటి బట్టలు వేసుకుంది కొంచెం మంచి బట్టుల వేసుకోవచ్చుకదా.. బావుంటావు కదా అంటూ మాట్లాడుకుంటారు. అంటూ చెప్పుకొచ్చారు. చాలా మందికి అలా అనాలనిపిస్తుందని కానీ అనలేమని, ఎందుకంటే స్త్రీ స్వతంత్రం స్వేచ్ఛ అంటారు అని చమత్కరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read also-Ravi Kiran Kola: విజయ్‌తో ‘రౌడీ జనార్ధన’ ప్రాజెక్ట్ ఎలా ఓకే అయ్యిందంటే?
అంతే కాకుండా.. మీ అందం నిండుగా కప్పుకునే చీరలోనే ఉంటుంది. సామాన్లు కనబడే దాంట్లో ఏమీ ఉండదు. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినపుడు నవ్వుతూ చాలా బాగున్నాయి అంటారు కానీ.. నువ్వు అలా వెళ్లిన తర్వాత తిట్టకుంటారు.. బాాగానే ఉంది కదా కొంచెం మంచి బట్టలు వేసుకోవచ్చుకదా అంటూ కామెంట్లు చేస్తారు. అంటూ చెప్పుకొచ్చారు. స్త్రీ అంటే ప్రకృతి ఆమె ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. స్త్రీ అంటే మా అమ్మ ఏప్పుడు చాలా గుండెల్లో ఉంటుంది. స్వేచ్చ అనేది అదృష్టం దానిని కోల్పోవద్దు.. మన గౌరవం ఎప్పుడు పెరుగుతుంది అంటే మన వేష భాషలనుంచే మన గౌరవం పెరుగుతుంది. అందులో ఏం తీసిపోలేదు. ప్రపంచ సుందరి పోటీల్లో కూడా చీర కట్టుకున్న వారికే విశ్వ సుందరి కిరీటాలు వచ్చాయి. అంటూ ముగించారు. ప్రస్తుతం ఈ మాటలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. శివాజీ కి కొందరు మద్దతు పలుకుతుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆయన అలా మాట్లాడతం సరికాదంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read also-Emmanuel: ఇమ్మానుయేల్‌కు ఇంత అన్యాయమా? ఏంటిది బిగ్ బాస్?

