GHMC: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. వడ్డీ మాఫీ..!
GHMC (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. వడ్డీ మాఫీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు..!

GHMC: ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్(Property Tax) బకాయిదారులకు సర్కారు తీపి కబురు చెప్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26) నకు సంబంధించి మాత్రం సర్కారు ఏకంగా మూడు నెలల కన్నా ఎక్కువ కాలం వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్ ) అమల్లోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రతి ఆర్థిక సంవత్సరం కేవలం మార్చి మాసంలో మాత్రమే ఈ ఓటీఎస్ ను అమలు చేసేవారు. అసలు ఓటీఎస్ ను అమలు చేయని ఆర్థిక సంవత్సరాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సారి ఆర్థిక సంక్షోభాన్ని దృష్టి పెట్టుకుని జీహెచ్ఎంసీ కోరిన విధంగానే సర్కారు ఏకంగా మూడు నెలలకు ఓటీఎస్ అమలుకు ఉత్తర్వులిచ్చింది. ఆర్థిక సంవత్సరం (2025-26) చివరి రోజైన మార్చి 31 వరకు అమల్లో ఉండనున్న ఈ వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) జీహెచ్ఎంసీలో ఇటీవలే విలీనమైన 27 సర్కిళ్లలో కూడా అమలు చేయనున్నట్లు సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది.

కేవలం 10 శాతం చెల్లిస్తే..

దీర్ఘకాలంగా పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో 90 శాతాన్ని మాఫీ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు(K Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలోని ప్రైవేట్ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తుల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలకు కూడా ఈ ఈ రాయితీ వర్తిస్తుందని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. బకాయి పడ్డ ఓరిజినల్ ఆస్తిపన్ను మొత్తంతో పాటు, దానిపై పేరుకుపోయిన వడ్డీలో కేవలం 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90 శాతం వడ్డీని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తుంది. ఈ రాయితీని పొందాలనుకునే పన్ను మొత్తాన్ని10 శాతం వడ్డీని ఒకే విడతలో వన్ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన బకాయిలను వసూలు చేయడంతో పాటు, పన్ను చెల్లింపుదారులపై ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించాలన్న జీహెచ్‌ఎంసీ(GHMC) కమిషనర్ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నగరవాసులు తమ ఆస్తిపన్ను బకాయిలను క్లియర్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Also Read: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో విద్యార్థి నేతపై కాల్పులు.. తలలోకి బుల్లెట్..

టార్గెట్ @ రూ.3 వేల కోట్లు

వర్తమాన ఆర్దిక సంవత్సరం (2025-26) వార్షిక ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్ ను జీహెచ్ఎంసీ తొలుత రూ. 2200 కోట్లుగా ఫిక్స్ చేయగా, ఆ తర్వాత రూ. 2500 కోట్లకు టార్గెట్ ను పెంచుకుంది. జీహెచ్ఎంసీలోకి ఇటీవలే 27 పట్టణ స్థానిక సంస్థలు విలీనం కావటంతో జీహెచ్ఎంసీ పరిధి కాస్త 650 కిలోమీటర్ల నుంచి 2 వేల 50 కిలోమీటర్లకు పెరిగింది. ఇదే తరహాలో ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 14 లక్షల ప్రాపర్టీ ఇండెక్స్ నెంబర్ (పీటీఐఎన్)లున్నాయి. వీటి సంఖ్య విలీనమైన 27 సర్కిళ్లలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న ఆస్తులతో కలిపి సుమారు 18 లక్షల నుంచి 19 లక్షల వరకు పెరగనున్నాయి.

జీహెచ్ఎంసీ ఖజానాకు..

కానీ విలీన 27 సర్కిళ్లలోని ఆస్తుల్లో క్యాపిటల్ వ్యాల్యూ ప్రాతిపదికన వసూలు చేస్తుండగా, జీహెచ్ఎంసీ పరిధిలో రెంటల్ వ్యాల్యూ ప్రాతిపదికన వసూలు చేస్తున్నారు. వసూళ్ల ఏ రకంగా చేసినా, నిధులు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరే అవకాశముండటంతో నిన్న మొన్నటి వరకు టార్గెట్ గా పెట్టుకున్న వర్తమాన ఆర్థిక సంవత్సర ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్ ను అధికారులు రూ. 3 వేల కోట్లకు పెంచుకున్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పాత పరిధిలోనే సుమారు రూ. 1478 కోట్లు వసూలు కాగా, టార్గెట్ చేరేందుకు ఇంకా రూ. 1522 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. వీటిలో కనీసం రూ. 500 కోట్లు విలీన సర్కిళ్ల నుంచి పాత జీహెచ్ఎంసీ పరిధి నుంచి మరో రూ. వెయ్యి కోట్ల మేరకైనా పన్ను వసూలు చేసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు వ్యూహాన్ని సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

Also Read: Hydra: బ‌డాబాబుల ఆక్ర‌మ‌ణ‌ల‌కు హైడ్రా చెక్.. రూ. 2500 కోట్ల విలువైన భూమికి ఫెన్సింగ్‌!

Just In

01

Crime News: పెళ్లి కోసం ఒత్తిడి తేవడంతోనే బీటెక్​ విద్యార్థిని ఆత్మహత్య!

Poco M8 Series: పోకో అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి రానున్న పోకో M8 సిరీస్

Chinmayi Shivaji: నటుడు శివాజీ వ్యాఖ్యలపై గాయని చిన్మయి ఆగ్రహం.. ‘ఆ నీతి సూత్రాలు మాకెందుకు?’

Hydraa: గుడ్ న్యూస్.. బ‌తుక‌మ్మ‌కుంట‌లో ఆప‌ద మిత్రుల బోటు రిహార్స‌ల్స్‌!

Chiranjeevi Mohanlal: మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం కోలీవుడ్ సూపర్ స్టార్.. ఇక ఫ్యాన్స్‌కు పండగే?