Jupally Krishna Rao: పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కేసీఆర్ సర్కారుదే ‘దద్దమ్మ ప్రభుత్వం’ అని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఘాటుగా విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఉనికి కోల్పోతోందని, కండ కరిగిపోయి కేవలం తోలు మాత్రమే మిగిలిందని గ్రహించే.. తన రాజకీయ మనుగడ కోసం కేసీఆర్ ఇప్పుడు బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.బీఆర్‌ఎస్ పతనానికి కేసీఆర్ కుటుంబ రాజకీయాలే ప్రధాన కారణమని జూపల్లి ఆరోపించారు.
కేసీఆర్‌కు ఆలస్యంగా అర్థమైంది
“కొడుకు, అల్లుడు వ్యవహారశైలి వల్లే ప్రజల్లో ఆదరణ తగ్గిందని కేసీఆర్‌కు ఆలస్యంగా అర్థమైందన్నారు. అందుకే పార్టీని కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నారని వివరించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి పనిచేసినా ప్రజలు వారికి మూడింట ఒక వంతు సీట్లు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ప్రజలు ఇప్పటికే స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. బలహీనమైన, రోజురోజుకూ దిగజారుతున్న పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ ఫామ్ హౌస్‌ను వదిలి బయటకు వచ్చారన్నారు.
Also Read: Jupally Krishna Rao: ప్రతి జిల్లా కేంద్రంలో పుస్తక ప్రదర్శన నిర్వహించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
పదేళ్లు పాలించి ఎందుకు పూర్తి చేయలేదు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కుర్చి వేసుకుని కట్టిస్తామని చెప్పిన కేసీఆర్ పదేళ్లు పాలించి ఎందుకు పూర్తి చేయలేదని జూపల్లి ప్రశ్నించారు. రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసినా కేసీఆర్ ఎకరా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డిని సుప్రీంకోర్టులో తాగునీటి ప్రాజెక్టు అని కేసు వేసిన కేసీఆర్ ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టు అని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 299 టీఎంసీలు చాలు అని నాడు కేసీఆర్ ఎలా సంతకం పెట్టారని నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ తిరస్కరించినట్లు కేసీఆర్ అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గత కాంగ్రెస్ పాలనలోనే జూరాల నుంచి 70 టీఎంసీలకు మంజూరైందన్నారు.
Also Read: Jupally Krishna Rao: కొల్లాపూర్‌లో కాంగ్రెస్ హవా.. 50 స్థానాలు కైవసం : మంత్రి జూపల్లి

