Jupally Krishna Rao: సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలే ముఖ్యమంత్రి నాయకత్వ పటిమకు, సమర్థతకు నిదర్శమని ఆయన పేర్కొన్నారు. చిన్నంబావిలో మంత్రి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకం వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. ప్రజల సంతోషమే లక్ష్యంగా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు.
Also Read: Jupally Krishna Rao: వేలంపాటతో పదవులు పొందేవారు నా దగ్గరకు రావొద్దు : మంత్రి జూపల్లి కృష్ణారావు
ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు
మిగిలిన హామీల్ని కూడా ప్రభుత్వం అతి త్వరలోనే అమలు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన మొదటి, రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. 50 చోట్ల (3 స్వతంత్రులను కలిపి) కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. కేవలం 28 స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని మంత్రి వెల్లడించారు. ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో మంత్రి ముందస్తుగానే గెలుపు గుర్రాలను అభ్యర్థులుగా ఎంపిక చేయగా, అధికార పార్టీ మద్ధతుదారులు విజయం సాధిస్తే అభివృద్ధి సులభమవుతుందన్న మంత్రి మాటలను నమ్మిన ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.
Also Read: Jupally Krishna Rao: జాతీయ స్థాయిలో చారిత్రక నాణేల సదస్సు నిర్వహణకు రంగం సిద్ధం : మంత్రి జూపల్లి

