Pregnant Murder: కులాంతర వివాహనికి మరో నిండు ప్రాణం బలైంది. వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకున్నదని, గర్భవతి అని కూడా చూడకుండా కన్నకూతుర్ని ఓ కఠినాత్ముడు దారుణంగా హత్య (Pregnant Murder) చేశాడు. ఐరన్ రాడ్లు తీసుకొని, తీవ్రంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. కర్ణాటకలో హుబ్బళ్లిలో జరిగిన షాకింగ్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మాన్య పటేల్ అనే ఓ 19 ఏళ్ల యువతి ఓ యువకుడిని ప్రేమించింది. కానీ, యువకుడిది వేరే కులం కావడంతో ఇంట్లో వాళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడితో పెళ్లి ప్రసక్తేలేదని తెగేసి చెప్పారు. అయినప్పటికీ, తన మనసుకు నచ్చిన వ్యక్తినే మాన్య వివాహం చేసుకుంది.
Read Also- Eesha Song: ‘ఈషా’ సినిమా నుంచి మంచి ఫీల్ గుడ్ సాంగ్ వచ్చింది విన్నారా?.. ఎలా ఉందంటే?
తల్లిదండ్రులు చంపేస్తారేమోనన్న భయంతో ఇద్దరూ గ్రామానికి దూరంగా కాలంగా బతికారు. ఇటీవలే స్వగ్రామానికి తిరిగి వెళ్లారు. డిసెంబర్ 8న గ్రామానికి చేరుకొని, మాన్య తన భర్తతో కలిసి అత్తింటికి వెళ్లింది. అక్కడే కాపురం ఉన్నారు. అయితే, ఆదివారం (డిసెంబర్ 8) నాడు మాన్య కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు, ఆమె భర్త మీద, మామయ్య మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. వ్యవసాయ పనుల్లో ఉన్న సమయంలో దాడికి యత్నించడంతో వారు తప్పించుకొని పారిపోయారు. అయితే, అదేరోజు సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల మధ్య ఈసారి ఒక బ్యాచ్ నేరుగా మాన్య భర్త ఇంటికి వెళ్లారు. ఐరన్ రాడ్లతో మాన్యపై దాడికి యత్నించారు. ఆమె 6 నెలల గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా కొట్టారు. ఆమెను రక్షించేందుకు ఆడపడుచు, మరిది ప్రయత్నించారు. కానీ, వారిని కూడా తీవ్రంగా కొట్టారు. మాన్య ప్రధాన టార్గెట్‌గా ఈ దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మాన్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ చనిపోయింది. ఇక, తీవ్రంగా గాయపడిన రేణుకమ్మ, సుభాష్‌కు ప్రస్తుతం ట్రీట్‌మెంట్ అందుతోంది.
Read Also- Minister Sridhar Babu: విద్యలో సమూల మార్పులే ప్రభుత్వ లక్ష్యం : టీచర్ల సమస్యలపై శ్రీధర్ బాబు భరోసా!
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. ఇందులో మాన్య తండ్రి ప్రకాశ్ ఫక్కిర్గోడ కూడా ఉన్నాడు. మరో ఇద్దరు కూడా దగ్గరి బంధువులే. మాన్య కుటుంబ సభ్యుల ముప్పుని తప్పించుకోవడానికి కొన్నాళ్లు 100 కిలోమీటర్ల దూరంలో నివసించారని, ఇటీవలే స్వగ్రామానికి వచ్చారని పోలీసులు వెల్లడించారు. మరణించే సమయానికి మాన్య ఆరు నెలల గర్భవతి అని వివరించారు. ఈ కేసుపై సమగ్ర విచారణకు, మిగతా నిందితులను అరెస్ట్ చేసేందుకుగానూ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసు అధికారులు ప్రకటించారు. ఇరుకుటుంబాల మధ్య సఖ్యత కుదుర్చేందుకు గ్రామంలో గతంలో పలు ప్రయత్నాలు జరిగాయని, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దారుణం జరిగిపోయిందని స్థానికులు అంటున్నారు.

