Kavitha: సింగరేణి ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి
Kavitha ( image credit: swetcha reporter)
Political News, Telangana News

Kavitha: సింగరేణి ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

Kavitha: గిరిజనులు, ఆదివాసీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. జాగృతి జనంబాటలో భాగంగా కొత్తగూడెం, ఇల్లెందులో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల అభివృద్ధి కోసం ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గొత్తికోయగూడెంలో 72 ఆదివాసీ కుటుంబాలను సర్కార్ రోడ్డున పడేసిందన్నారు. వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, లేకపోతే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. కొత్తగూడెంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం కాంగ్రెస్ మంత్రులు కృషి చేయాలన్నారు.

Also Read: MLC Kavitha: ఒకవేళ సీఎం అయితే కొత్తగా ఏం చేస్తారు?.. ఎమ్మెల్సీ కవిత సమాధానం ఇదే

సింగరేణి ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి

ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణి ప్రైవేటీకరణతో మణుగూరు మనుగడ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని వాపోయారు. సింగరేణి కార్మికుల సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. సింగరేణి మీద ఆధారపడి 70 వేలమంది ప్రజలు జీవిస్తున్నారని చెప్పుకొచ్చారు. మణుగూరులో సింగరేణి మనుగడ 3 సంవత్సరాలేనని సింగరేణి సీఎండీ చెప్పారని గుర్తుచేశారు. పీకేఓసీ- 2మైన్‌ని ప్రైవేట్ పరం చేయకుండా సింగరేణికే ఉంచాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల పక్షాన నిలబడి హెచ్ఎంఎస్‌తో కలిసి తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని కవిత పేర్కొన్నారు.

Also Read: MLC Kavitha: కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్.. నిధులివ్వరు అంటూ..!

Just In

01

ACB Raids: ఖమ్మం ఆర్టీవో ఆఫీస్‌లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. ఓ అధికారి దగ్గర భారీ నగదు స్వాదీనం..?

Sonia Gandhi: గాంధీ పేరు మార్పు.. తొలిసారి పెదవి విప్పిన సోనియా.. ప్రధానికి సూటి ప్రశ్నలు

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ జర్నీలో ఇమ్మానియేల్ ఫీలింగ్ ఏంటో తెలుసా.. కళ్యాణ్‌, తనూజల మధ్య ఉన్నది ఇదే?

Kotak Bank Downtime: కోటక్ ఖాతాదారులకు కీలక అలర్ట్.. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ పనిచేయవు.. ఎప్పుడంటే?

Farmer Death: దౌల్తాబాద్‌లో దారుణం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి!