MLC Kavitha: కేంద్రం తెలంగాణకు ప్రత్యేక నిధులు కాదు కదా, జనం ఇచ్చిన దాన్ని కూడా తిరిగి ఇవ్వడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) మండిపడ్డారు. 2019 – 2020 నుంచి 2023 – 2024లో కేంద్రానికి తెలంగాణ ట్యాక్స్ రూపంలో రూ.4,35,990 కోట్లు ఇచ్చిందని, రిటర్న్‌గా కేంద్రం రూ.3,76,000 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. అంటే దాదాపు రూ.60 వేల కోట్లు ఎగ్గొట్టిందని పేర్కొన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. హైదరాబాద్‌కు మంచి నీటిని మల్లన్న సాగర్ నుంచి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అసలు హైదరాబాద్ ప్రజల దాహార్తిని ఎలా తీరుస్తుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
సిటీలో ఎన్నో సమస్యలు
సిటీలో నాలాలు, మంచి నీటి వ్యవస్థ బాగు చేయాలంటే వేల కోట్లు కావాలని, అది కేంద్రం ప్రభుత్వం సహకారం ఉంటేనే సాధ్యమవుతుందని కవిత అన్నారు. నగరంలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాల్సిన అవసమున్నదని తెలిపారు. ఇప్పటికే విద్యను పూర్తిగా ఇక్కడ ప్రైవేట్ పరం చేసేశారని ఆరోపించారు. ఫుట్ బాల్ మ్యాచ్ కారణంగా తెలంగాణకు వచ్చిన ప్రయోజనం ఏంటని, సింగరేణి కార్మికుల సొమ్మును అందుకోసం వాడారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఫండ్ నుంచి సింగరేణికి రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహం విషయంలో తాను తెలంగాణ వాదుల పక్షానే ఉంటానని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో డివిజన్లను అశాస్త్రీయంగా డివైడ్ చేశారని, నగరంలో ప్రజా రవాణా, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని ఆరోపించారు. సిటీ పర్యటనలో చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటి పరిష్కారం కోసం నిరంతరం జాగృతి పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.
Also Read: MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!
క్రైమ్ రేటు పెరిగింది
నగరంలో సరైన ప్రజా రవాణా సదుపాయం లేదని కవిత అన్నారు. గతంలో 7,500 బస్సులుంటే ఇప్పుడు వాటిని 3,500 తగ్గించారని ఆరోపించారు. సిటీలో ఎక్కడకు వెళ్లినా సరే బస్సుల సమస్య గురించే చెబుతున్నారని అన్నారు. బస్సులు తగ్గించడంతో వ్యక్తిగత వాహనాల సంఖ్య భారీగా పెరిగిందని పేర్కొన్నారు. డల్లాస్, సింగపూర్ నగరం మాదిరిగా కావాలంటే ప్రజా రవాణా ఉండాలని, ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్లకు అప్పగిస్తున్నారని, అంటే క్రమంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలా జరిగితే వారికి ఇష్టమొచ్చినట్లు ధరలు పెంచేస్తారని అన్నారు. గతంలో ఓల్డ్ సిటీలో సెట్విన్ బస్సులు చిన్న గల్లీలకు కూడా పోయేవని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు పెద్ద గల్లీలకు కూడా బస్సులు రాని పరిస్థితి ఉన్నదన్నారు. ఇక, వీధ కుక్కల సమస్య పెరిగిందని చెప్పారు. మొన్న ఓ బాబుపై 20 కుక్కలు దాడి చేసి అతని చెవును కొరికాయని వివరించారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడంతో కుక్కల సమస్య పెరిగిందని అన్నారు. క్రైమ్ రేటు కూడా నగరంలో పెరిగిందన్నారు. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్లను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని అన్నారు. గతంలో సిటిజన్ పోలీసింగ్ అనేది ఉండేదని, దాంతో క్రైమ్ చేయాలంటే భయం ఉండేదని పేర్కొన్నారు. చాలా చోట్ల డ్రగ్స్ సమస్య పెరిగిందని ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు.
Also Read: MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

