GHMC: డీలిమిటేషన్‌కు లైన్ క్లియర్.. మ్యాప్‌లు
GHMC ( image credit: swetcha reeporter)
హైదరాబాద్

GHMC: డీలిమిటేషన్‌కు లైన్ క్లియర్.. మ్యాప్‌లు, జనాభా లెక్కలివ్వాలని కోర్టు ఆదేశం!

GHMC: జీహెచ్ఎంసీ పరిధిని 300 మున్సిపల్ వార్డులుగా డీలిమిటేషన్ చేసే ప్రక్రియకు దాదాపు పూర్తి అయినట్టేనని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పాత జీహెచ్ఎంసీ పరిధిలోకి తెలంగాణ కోర్ ఆర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడంతో వార్డుల డీలిమిటేషన్ అనివార్యమైన నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన డ్రాఫ్ట్‌ను జారీ చేసిన కమిషనర్, మరుసటి రోజు నుంచి డీలిమిటేషన్‌పై ప్రజల నుంచి అభ్యంతరాలను, సలహాలను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో డీలిమిటేషన్‌పై నలుగురు హైకోర్టును ఆశ్రయించడంతో అభ్యంతరాలు, సలహాల స్వీకరణకు రెండు రోజుల గడువు పెంచడంతో ముగియాల్సిన స్వీకరణ  కూడా కొనసాగింది.

జీహెచ్ఎంసీ సర్కిల్, జోన్, ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పెషల్ కౌంటర్లు మొత్తం 5,905 అభ్యంతరాలు, సలహాలను స్వీకరించినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ కూడా పిటిషన్లను సవాలు చేయడంతో  విచారించిన కోర్టు, పిటిషన్లు దాఖలు చేసిన నలుగురికి డీలిమిటేషన్ మ్యాప్‌లు, వార్డుల జనాభా లెక్కలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో వార్డు డీలిమిటేషన్‌కు ఇప్పటి వరకు ఎదురైన వివిధ రకాల అడ్డుంకులు దాదాపు తొలగి లైన్ క్లియర్ అయిందని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. వార్డుల డీలిమిటేషన్ కు సంబంధించి ఇప్పటి వరకు స్వీకరించిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని స్వల్ప మార్పులతో డ్రాఫ్ట్‌ను సర్కారుకు పంపనున్నారు. అక్కడ అనుమతి తీసుకున్న తర్వాత ఇవాళ గానీ, సోమవారం గానీ ఫైనల్ నోటిఫికషన్ జారీ చేసే అవకాశాలున్నాయి.

Also Read: GHMC Elections: ఆ నెలలో జీహెచ్ఎంసీ ఎన్నికలు? ఇప్పటి నుంచే ఏర్పాట్లకు మౌఖిక ఆదేశాలు!

చేయనున్న మార్పులు కొన్ని..

వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించి ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి స్వీకరించిన అభ్యంతరాల మేరకు డ్రాఫ్ట్‌లో స్వల్ప మార్పులు చేయనున్నారు. ముఖ్యంగా పాత బాగ్ అంబర్ పేట వార్డు పేరు డీడీ కాలనీగా అధికారులు పేర్కొన్నా ఆ వార్డు పేరు బాగ్ అంబర్ పేటగానే మార్చనున్నారు. దీనికి తోడు మోండా వార్డు పేరు కూడా యథావిధిగా కొనసాగించనున్నారు. దీంతో పాటు బీహెచ్ఎంసీలో ఒక వార్డుకు సంబంధించి కార్పొరేటర్ సింధు కౌన్సిల్‌లో చేసిన అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని మార్పులు చేయనున్నారు.

రిజర్వేషన్ల ఖరారే తదుపరి ప్రక్రియ

డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్‌ను సర్కారు ఆమోదించిన వెంటనే అధికారులు వార్డుల వారీగా జనాభాను లెక్కలేసి ఆయా సామాజికవర్గాల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిసింది. వార్డుల డీలిమిటేషన్ చేసిన జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఎన్నికల సంఘం అధికారులు వార్డుల వారీగా జనాభా లెక్కలను సేకరించి, అత్యధికంగా ఉన్న సామాజికవర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా జనరల్ తదితర క్యాటగిరీలుగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రిజర్వేషన్లకు సంబంధించి కూడా డ్రాఫ్ట్ రూపకల్పన చేసి, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, వాటిని డిస్పోజ్ చేసిన అనంతరం ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత సర్కారు ఆదేశిస్తే జీహెచ్ఎంసీ పరిధిలోని 300 వార్డులకు ఎన్నికలను నిర్వహించే అవకాశాలున్నాయి.

సెన్సెస్ లెక్కలు తేలిన తర్వాత మరోసారి డీలిమిటేషన్

ప్రస్తుతం జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను 2011 జనాభా లెక్కలు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వద్దనున్న తాజాగా వర్తమాన జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని 45 వేలకు ఓ వార్డు అనే ప్యారమీటర్‌తో పది శాతం తక్కువ, ఎక్కువగా వార్డులను డీలిమిటేషన్ చేశారు. వచ్చే సంవత్సరం దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలను తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సన్సెస్ ప్రక్రియను నిర్వహించనున్నది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత 2027 తర్వాత ఇవే 300 వార్డులను అప్పటి జనాభా ప్రకారం డీలిమిటేషన్ చేయనున్నట్లు అధికారవర్గాల సమాచారం. ప్రస్తుతం పట్టణ స్థానిక సంస్థల విలీనం, వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను హడావుడిగా చేస్తున్న సర్కారు అంతలోపే జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహిస్తే, పాలక మండలిని అలాగే కొనసాగిస్తూ తాజాగా సేకరించిన జనాభా లెక్కల ప్రకారం వార్డులను మరోసారి డీలిమిటేషన్, రిజర్వేషన్లను చేపట్టి, తదుపరిగా నిర్వహించనున్న ఎన్నికలకు అమలు చేస్తారన్న చర్చ సైతం లేకపోలేదు. అంటే సన్సెస్ ప్రక్రియ ముగిసే వరకు జీహెచ్ఎంసీ ఒకే కార్పొరేషన్‌గా కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కూడా జీహెచ్ఎంసీ ఒకే కార్పొరేషన్‌గా కొనసాగిస్తారా? లేక ఎన్ని ముక్కలు చేస్తారో అనే క్లారిటీ రావాల్సి ఉన్నది.

Also Read: GHMC Council: వాడివేడిగా కౌన్సిల్ సమావేశం.. పార్టీలకతీతంగా పునర్విభజనపై సభ్యుల ప్రశ్నల వర్షం!

Just In

01

Ponnam Prabhakar: ఈవీ పాలసీని కంపెనీలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్!

Toshakhana 2 Case: ఇమ్రాన్ ఖాన్, అతడి భార్యకు బిగ్ షాక్.. పాక్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు

AndhraKing Taluka OTT: రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Khammam Gurukulam: క్రీడలు విద్యార్థుల్లో సమైక్యతను పెంచుతాయి: జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ముజాహిద్‌!

PV Narasimha Rao Statue: పీవీ విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల.. ముఖ్య అతిథిగా రానున్న పీవీ ప్రభాకర్ రావు!