Akhanda 2: ‘అఖండ 2’కి సౌండ్ బాక్సులు అందుకే ఆగిపోతున్నాయ్..
akhanda-2-interview
ఎంటర్‌టైన్‌మెంట్

Akhanda 2: ‘అఖండ 2’ థియేటర్లలో సౌండ్ బాక్సులు అందుకే ఆగిపోతున్నాయ్.. బాబోయ్ కాషన్ కియా..

Akhanda 2: బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ 2’ తాండవం థియేటర్ల్ వద్ద పూనకాలు తెప్పించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వూ లో ‘అఖండ 2 తాండవం’ సినిమా విషయంలో సౌండ్ ఎందుకు ఆగిపోతుంది. అన్న ప్రశ్నకు థమన్ సమాధానం ఇచ్చారు. అసలు సౌండ్ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని, తాను అంతా మిక్స్ చేసిన తర్వాత డాల్బీ నుంచి ఓ ఇంజనీర్ వచ్చి ఎక్కడ ఎంత సౌండ్ ఉండాలి అని అతను నిర్ణయిస్తాడని, అందులో తన ప్రమేయం ఏమీ లేదన్నారు. డాల్బీ నుంచి వచ్చిన వారు ఎక్కడ ఎన్ని డెసిబల్స్ ఉండాలో వాళ్లకు చెబితే అదే విధంగా తాము మిక్స్ చేస్తామన్నారు. మరి ఎందుకు థియోటర్లలో మాక్సులు సరిగా పాడటంలేదు అని యాంకర్ అడగ్గా.. కొత్తగా వచ్చిన థియేటర్లలో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ వాడుతున్నారు. పాత థియేటర్లో అన్నీ మారుస్తున్నారు కానీ స్పీకర్లు మార్చడం లేదు. అందుకే ఇప్పుడు వచ్చిన సౌండ్ కి పాత సిస్టం ఆగిపోతున్నాయన్నారు. దీనికి ఉదాహరణగా.. ఓజీ సినిమా కు ఓ థియేటర్ కు వెళితే.. నెత్తురుకు మరిగిన అన్న తర్వాత సౌండ్ ఆగిపోయిందని.. తీరా లోపలికి వెళ్లి చూస్తే వారు వాడేవి అన్నీ పాతవి అని అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.

Read also-Shambala Movie: ‘శంబాల’ థియేటర్‌లో మంచి ఎక్సీపిరియన్స్ చేస్తారు.. సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల..

ఇదిలా ఉండగా అఖండ 2 తాండవం ప్రమోషన్ లో భాగంగా చేసిన ఓ ఇంటర్వూలో  బోయపాటి అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. హిందీ అంతంత మాత్రంగా వచ్చిన బోయపాటి యాంకర్ కి ఏదో చెబుతూ.. ఆల్రడీ బోల్ దియా.. కాషన్ కియా.. అంటూ వచ్చీ రాని హిందీలో మానేజ్ చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుంతం అది తెగ వైరల్ అవుతోంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వూలో ఇదే వియాన్ని యాంకర్ సునీత అడగ్గా.. అది నా మనసులోంచి వచ్చిన మాట నాకు అదే వచ్చు అదే చెప్పాను అంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఇప్పుడు అది నవ్వులు పూయిస్తుంది. దీనికి డీజేలు యాడ్ చేసి ఇంకా వైరల్ చేస్తున్నారు.

Read als0-Dandora Movie Trailer: శివాజీ ‘దండోరా’ ట్రైలర్ వచ్చేసింది.. ఆ మత్తు దిగాలంటే టైమ్ పట్టుద్ది సార్..

Just In

01

KCR: 27 లేదా 28న పాలమూరుకు కేసీఆర్?.. ఎందుకో తెలుసా?

Student Suicide Attempt: గురుకుల క‌ళాశాల‌ భ‌వ‌నం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Ramchander Rao: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌కు బీజేపీ రాంచందర్ రావు ప్రశ్న ఇదే

Bhatti Vikramarka: తెలంగాణలో అత్యధిక ప్రజావాణి అర్జీలను పరిష్కరించిన కలెక్టర్‌.. ఎవరో తెలుసా..?

New Sarpanch: ఎలుగుబంటి వేషంలో నూతన సర్పంచ్.. కోతుల సమస్యకు చెక్!