GHMC Elections: ఆ నెలలో జీహెచ్ఎంసీ ఎన్నికలు?
GHMC Elections (IMAGE CREDIT; SWETCHA REPORTER)
Political News, హైదరాబాద్

GHMC Elections: ఆ నెలలో జీహెచ్ఎంసీ ఎన్నికలు? ఇప్పటి నుంచే ఏర్పాట్లు.. మౌఖిక ఆదేశాలు!

GHMC Elections: జీహెచ్ఎంసీ పాలక మండలి వచ్చే ఫిబ్రవరి 10తో గడువు ముగియనుండడంతో ఇప్పట్లో మళ్లీ బల్దియాకు ఎన్నికలు జరుగుతాయా అనే సస్పెన్స్‌కు తెర పడింది. ఫిబ్రవరిలో పాలక మండలి గడువు ముగిసిన నాలుగైదు నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సిటీలో చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు లేని అధికార పార్టీ ప్రస్తుత పాలక మండలి అధికార గడువు ముగిసి, ఏడాది గడిచిన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని, అంతలోపు సిటీలో అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని భావించింది. కానీ, గత నెల 11వ తేదీన జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం సాధించడంతో జోష్ పెరిగింది.

సర్పంచ్ సీట్లను కైవసం

తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ అంచనాలను మించి సర్పంచ్ సీట్లను కైవసం చేసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ బాగున్నదని, అనుకూలమైన పరిస్థితులున్నాయని విశ్లేషించిన సర్కారు, ఇదే ఊపులో త్వరలోనే ఎంపీటీసీ, ఆ తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి మరింత సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇదే స్పూర్తితో జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ హడావుడిగా సాగడమే ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నది.

Also Read: Panchayat Elections: గుర్తులు పోలిన గుర్తులు.. అభ్యర్థుల్లో గుండె దడ.. మూడవ దశ పంచాయతీ ఎన్నికల సర్వంసిద్ధం!

నెలాఖరు కల్లా డీలిమిటేషన్ పూర్తి

జీహెచ్ఎంసీలో 300 వార్డులు(కొత్తవి కలిపి) ఉన్నాయి. వచ్చే సంవత్సరం జూలై, ఆగస్ట్ నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని, ఇందుకు సర్కారు జీహెచ్ఎంసీకి మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడం వల్లే ఉన్నతాధికారులు వార్డుల డీలిమిటేషన్‌పై వన్ పాయింట్‌గా వర్కవుట్ చేస్తున్నట్లు సమాచారం. వచ్చే సంవత్సరం సెన్సస్ జరగనున్నందున జీహెచ్ఎంసీ అధికారులు డీలిమిటేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిసింది. వార్డుల ఫైనల్ నోటిఫికేషన్‌కు ఆమోదం, రిజర్వేషన్ల ఖరారుతో పాటు జీహెచ్ఎంసీని యథావిధిగా కొనసాగించాలా లేక రెండు, మూడు ముక్కలు చేయాలా అనే విషయంపై సర్కారు నిర్ణయం తీసుకునే లోపు ప్రస్తుత పాలక మండలి అధికార గడువు ముగియనున్నందున, ఆ తర్వాతే కొనసాగింపు, ఎన్నికలకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Also Read: GHMC Council Meeting: మనం రౌడీలమా? ప్రజాప్రతినిధులమా?.. కార్పొరేటర్లపై జీహెచ్ఎంసీ మేయర్ ఆగ్రహం

Just In

01

Telangana News: పలు జిల్లాల్లో స్కూల్ టైమింగ్స్ మార్పు.. విద్యాశాఖ కీలక నిర్ణయం

RBI Governor: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ.. ఎందుకంటే?

Private Hospitals: కడుపుకోత.. గద్వాలలో డాక్టర్ల కాసుల కక్కుర్తి.. ఏం చేస్తున్నారంటే?

Champion Trailer: రోషన్ మేకా ‘ఛాంపియన్’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన శ్రీకాంత్ వారసుడు..

BRS party – KTR: బీఆర్ఎస్‌కి పూర్వవైభవం మొదలైంది.. కేటీఆర్ పొలిటికల్ హాట్ కామెంట్స్