Seethakka: గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు
Seethakka ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
Telangana News

Seethakka: గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి : మంత్రి సీతక్క

Seethakka: గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా, విజయవంతంగా పూర్తి చేసిన పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క(Seethakka) అభినందనలు తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఈ కీలక ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ముగియడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో నిరంతర పర్యవేక్షణ, పారదర్శకత, నిబద్ధతతో పనిచేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు

అదే విధంగా, ఎన్నికల అథారిటీగా కీలక బాధ్యతలు నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ జీ. సృజన కు అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు సహాయ సహకారాలు అందించిన పోలీస్, ఇతర శాఖల అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగకుండా, రీపోలింగ్ అవసరం లేకుండా ఎన్నికలు పూర్తి కావడం అందరి సమిష్టి కృషికి నిదర్శనమని ఆమె అన్నారు.

Also Read: Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క

పార్టీలకతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి

గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నిన్నటి వరకు రాజకీయ పోటీలు ఉన్నా, నేటి నుంచి గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను విశ్వాసంతో స్వీకరించి, పారదర్శక పాలనతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

ప్రజాసేవకు అంకితం కావాలి

పల్లెలే తెలంగాణ సౌభాగ్యం. పల్లెల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి పరిపూర్ణమవుతుందన్నారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, మౌలిక వసతులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజాసేవకు అంకితం కావాలని ఆమె కోరారు. గ్రామాల ప్రగతే లక్ష్యంగా, ప్రజల భాగస్వామ్యంతో బలమైన గ్రామపంచాయతీలను నిర్మిద్దామని మంత్రి పిలుపునిచ్చారు.

Also Read: Minister Seethakka: ఆ అభ్యర్థిని సర్పంచ్‌గా గెలిపించండి.. మంత్రి సీతక్క అభ్యర్థన

Just In

01

Telangana News: పలు జిల్లాల్లో స్కూల్ టైమింగ్స్ మార్పు.. విద్యాశాఖ కీలక నిర్ణయం

RBI Governor: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ.. ఎందుకంటే?

Private Hospitals: కడుపుకోత.. గద్వాలలో డాక్టర్ల కాసుల కక్కుర్తి.. ఏం చేస్తున్నారంటే?

Champion Trailer: రోషన్ మేకా ‘ఛాంపియన్’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన శ్రీకాంత్ వారసుడు..

BRS party – KTR: బీఆర్ఎస్‌కి పూర్వవైభవం మొదలైంది.. కేటీఆర్ పొలిటికల్ హాట్ కామెంట్స్